దేవుని సార్వభౌమత్వము మరియు మానవుని స్వచిత్తము రక్షణలో ఎలా కలిసి పనిచేయగలదు?


ప్రశ్న: దేవుని సార్వభౌమత్వము మరియు మానవుని స్వచిత్తము రక్షణలో ఎలా కలిసి పనిచేయగలదు?

జవాబు:
దేవుని సార్వభౌమత్వము మరియు మానవుని స్వచిత్తము మరియు బాధ్యత మధ్య గల అనుబంధమును పూర్తిగా అర్థము చేసుకొనుట అసంభవము. ఆయన రక్షణ ప్రణాళికలో అవి కలసి ఎలా పనిచేయగలవో దేవునికి మాత్రమే నిజముగా తెలుసు. ఇతర సిద్ధాంతముల కంటే ఎక్కువగా, ఈ సిద్ధాంతములో దేవుని యొక్క స్వభావము మరియు ఆయనతో మనకున్న అనుబంధమును పూర్తిగా అర్థంచేసుకొనుటలో మన అసమర్థతను ఒప్పుకొనుట చాలా ప్రాముఖ్యము. ఇరువైపులా ఎక్కువ దూరం వెళ్లుట వలన రక్షణ యొక్క అవగాహనలో భంగము కలుగుతుంది.

ఎవరు రక్షించబడతారో దేవునికి తెలుసు అని లేఖనము స్పష్టముగా చెబుతుంది (రోమా. 8:29; 1 పేతురు 1:2). “జగత్తుకు పునాది వేయబడక మునుపే” దేవుడు మనలను ఎన్నుకొనెనని ఎఫెసీ. 1:4 చెబుతుంది. విశ్వాసులు “యేర్పరచబడినవారని” (రోమా. 8:33; 11:5; ఎఫెసీ. 1:11; కొలస్సి. 3:12; 1 థెస్స. 1:4; 1 పేతురు 1:2; 2:9) “ఎన్నుకొనబడినవారని” బైబిల్ మరలా మరలా వర్ణిస్తుంది (మత్తయి 24:22, 31; మార్కు 13:20, 27; రోమా 11:7; 1 తిమోతి 5:21; 2 తిమోతి 2:10; తీతు 1:1; 1 పేతురు 1:1). విశ్వాసులు రక్షణ కొరకు ముందుగా ఏర్పరచబడినారు (రోమా. 8:29-30; ఎఫెసీ. 1:5, 11), మరియు ఎన్నుకొనబడినారు (రోమా. 9:11; 11:28; 2 పేతురు 1:10), అనేది స్పష్టముగా కనిపిస్తుంది.

క్రీస్తును రక్షకునిగా అంగీకరించుటకు మనం భాధ్యులమని కూడా బైబిల్ చెబుతుంది – మనం చేయవలసినదంతా యేసు క్రీస్తును నమ్ముట మరియు మనం రక్షణ పొందుతాము (యోహాను 3:16; రోమా. 10:9-10). ఎవరు రక్షించబడతారో దేవునికి తెలుసు, రక్షింపబడువారిని దేవుడు ఎన్నుకుంటాడు, మరియు రక్షణ పొందుటకు మనం క్రీస్తును ఎన్నుకోవాలి. ఈ మూడు కలిసి ఎలా పని చేస్తాయో గ్రహించుట మానవ మదికి అసంభవము (రోమా. 11:33-36). లోకమంతటికి రక్షణను తీసుకొనివెళ్లుట మన భాద్యత (మత్తయి 28:18-20; అపొ. 1:8). ముందు జ్ఞానం, ఎన్నిక, ముందుగా ఏర్పరుచుటను దేవుని చేతికి అప్పగించి సువార్తను ప్రకటించుటలో మనం విధేయులైయుండాలి.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
దేవుని సార్వభౌమత్వము మరియు మానవుని స్వచిత్తము రక్షణలో ఎలా కలిసి పనిచేయగలదు?