నిత్య జీవము పొందితివా?


ప్రశ్న: నిత్య జీవము పొందితివా?

జవాబు:
నిత్య జీవమునకు ఒక స్పష్టమైన మార్గమును బైబిల్ అందిస్తుంది. మొదటిగా, దేవునికి విరోధముగా పాపము చేసితిమని మనం గుర్తించాలి: “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” (రోమా. 3:23). మనమంతా దేవునికి అయిష్టమైన కార్యములు చేసితిమి, మరియు అది మనలను శిక్షకు పాత్రులుగా చేస్తుంది. మన పాపములన్ని తుదకు నిత్య దేవునికి విరోధముగా చేయుచున్నాము కాబట్టి, కేవలం నిత్య శిక్ష మాత్రమే మనకు సరిపోతుంది. “ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము” (రోమా. 6:23).

అయితే, యేసు క్రీస్తు, పాపములేని (1 పేతురు 2:22), దేవుని నిత్య కుమారుడు మానవుడై (యోహాను 1:1, 14) మన పాప జీతమును చెల్లించుటకు మరణించెను. “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” (రోమా. 5:8). యేసు క్రీస్తు మనం పొందవలసిన శిక్షను తనపై వేసుకొని (2 కొరింథీ. 5:21), సిలువపై మరణించెను (యోహాను 19:31-42). పాపము మరియు మరణముపై తన జయమును నిరూపించుచు, మూడు రోజుల తరువాత ఆయన మరణము నుండి తిరిగిలేచెను (1 కొరింథీ. 15:1-4). “మృతులలోనుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు...ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను” (1 పేతురు 1:3).

విశ్వాసం ద్వారా రక్షణ కొరకు క్రీస్తు యెడల మన ఆలోచనను-ఆయన ఎవరు, ఆయన ఏమి చేసెను, మరియు ఎందుకు చేసెను-మార్చుకొనవలెను (అపొ. 3:19). మన విశ్వాసము ఆయనపై మోపి, సిలువపై ఆయన మరణం మన పాపముల యొక్క వెల చెల్లించునని నమ్మిన యెడల, మనం క్షమించబడి పరలోకములో నిత్యజీవము యొక్క వాగ్దానమును పొందుదుము. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16). “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు” (రోమా 10:9). సిలువ మీద యేసు ముగించిన కార్యముపై విశ్వాసం మాత్రమే నిత్య జీవమునకు ఏకైక సత్య మార్గము! “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు” (ఎఫెసీ. 2:8-9).

మీరు యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలని ఆశించినయెడల, ఈ చిన్న ప్రార్థన చెయ్యండి. ఈ ప్రార్థన చెప్పుట లేక వేరే ఏ ప్రార్థన చెప్పుట కూడ మిమ్మును రక్షించదని జ్ఞాపకముంచుకోండి. కేవలం క్రీస్తును నమ్ముట మాత్రమే మిమ్మును పాపము నుండి రక్షించగలదు. ఈ ప్రార్థన కేవలం దేవునిలో మీకున్న విశ్వాసమును తెలియజేయుటకు మరియు మీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకు వందనములు చెల్లించుటకు ఒక మార్గము మాత్రమే. “దేవా, నేను నీకు విరోధముగా పాపము చేసితిని మరియు శిక్షకు పాత్రుడనని నాకు తెలుసు. అయితే నేను పొందవలసిన శిక్షను యేసు క్రీస్తు తీసుకొనెను మరియు ఆయనను విశ్వసించుట ద్వారా నేను క్షమాపణ పొందగలను. రక్షణ కొరకు నా విశ్వాసమును నీ మీద మోపుచున్నాను. నీ అద్భుత కృప కొరకు క్షమాపణ కొరకు-నిత్య జీవమను బహుమానము కొరకు వందనములు! ఆమేన్!”

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
నిత్య జీవము పొందితివా?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి