ప్రశ్న
సోలో క్రిస్టో ఎందుకు ముఖ్యం?
జవాబు
సోలో క్రిస్టో, లేదా సోలస్ క్రిస్టస్, ప్రొటెస్టంట్ సంస్కరణ యొక్క ముఖ్యమైన అంశాలను సంగ్రహించే ఐదు సోలాలలో (లేదా సోలే) ఒకటి. సోలో క్రిస్టో అంటే లాటిన్‌లో "క్రీస్తు మాత్రమే" అని అర్థం. మిగిలిన నాలుగు సోలస్‌లు సోలా స్క్రిప్చురా ("కేవలం లేఖనము"), సోలా ఫిడే ("కేవలం విశ్వాసము"), సోలా గ్రాటియా ("కేవలం కృప"), మరియు సోలా డెయో గ్లోరియా ("కేవలం దేవుని మహిమ కొరకు") అనేవి. ఈ సిద్ధాంతాలలో ప్రతి ఒక్కటి అత్యంత ముఖ్యమైనది. వీటిలో దేనినైనా విడిచిపెట్టడం తప్పుకు దారితీస్తుంది మరియు రక్షించలేని ఒక అబద్ధమైన సువార్తకు దారితీస్తుంది.
సంస్కరణవాదులు 'సోలో క్రిస్టో' (క్రీస్తు మాత్రమే) అని నొక్కి చెప్పినప్పుడు, మనం మరెవరి యోగ్యతతోనూ కాకుండా, కేవలం క్రీస్తు ద్వారానే రక్షించబడతామని వారు ధృవీకరించారు. యేసు మాత్రమే రాజులకధిపతి (ప్రకటన 19:16). ఆయన మాత్రమే మన ప్రధాన యాజకుడు (హెబ్రీయులు 4:14). ఆయన మాత్రమే మన విమోచకుడు (గలతీయులకు 3:13) మరియు దేవునికి, మనిషికి మధ్య ఉన్న ఏకైక మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఆ పదవులను హస్తగతం చేసుకోవడానికి లేదా వాటిలో భాగస్వాములు కావడానికి చేసే ప్రయత్నం ఒక దూషణపూరితమైన అహంకారం. ఆ పాత్రలను వేరొకరికి (ఉదాహరణకు మరియకు) కేటాయించడం కూడా అంతే అనుచితం. క్రీస్తు మాత్రమే, కేవలం క్రీస్తు మాత్రమే రక్షిస్తాడు.
మన నీతి మనలను రక్షించదు; అది కేవలం క్రీస్తు నీతి మాత్రమే. "ఆయన మనలను రక్షించెను, మనము చేసిన నీతి క్రియల వలన కాదు గాని తన కరుణ వలన" (తీతు 3:5). "యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారందరికిని ఈ నీతి అనుగ్రపించబడును" (రోమీయులు 3:22). మనం చేసే మంచి పనులు ఎంతైనా, మన విశ్వాసం ఎంత గొప్పదైనా, చివరికి "మేము నిష్ప్రయోజకులమైన దాసులము" (లూకా 17:10). క్రీస్తు మాత్రమే ఆర్హుడు (ప్రకటన 5:9). సోలో క్రిస్టో.
మొదలు నుండి చివరి వరకు, సువార్త క్రీస్తును, కేవలం క్రీస్తును మాత్రమే ఉన్నతీకరిస్తుంది. తప్పిపోయిన వారిని వెదకడానికి పరలోకము నుండి వచ్చిన వాడు ఆయనే (లూకా 19:10). ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా పాటించిన వాడు ఆయనే. సిలువ వేయబడిన వాడు ఆయనే, మరియు తిరిగి లేచిన వాడు కూడా ఆయనే. మనం ఆయన కృపకు కృతజ్ఞతతో కూడిన గ్రహీతలం. మనం భిక్షకులం, ఆయన దాత. మనం కుష్ఠులం, ఆయన స్వస్థపరిచేవాడు. మనం కల్లోలం, ఆయన సమాధానం. సొలో క్రిస్టో.
సువార్త అనేది మనం దేవుని కోసం ఏమి చేయాలనే సందేశం కాదు; సువార్త అనేది దేవుడు మన కోసం ఏమి చేశాడనే శుభవార్త. రక్షణ అనేది ముఖ్యంగా మన గురించి కాదు; అది యేసు గురించి. సోలో క్రిస్టో. అన్ని విషయాలలో క్రీస్తుకే ప్రధాన్యత ఉండాలి (కొలొస్సయులు 1:18), మరియు సంస్కర్తలు ఆ బైబిల్ సిద్ధాంతాన్ని సంఘానికి పునరుద్ధరించారు. లూథర్ రాసినట్లుగా, "నేను సువార్తను వినాలి. అది నేను ఏమి చేయాలనేది నాకు చెప్పదు, కానీ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నా కొరకు ఏమి చేసాడో చెబుతుంది" (మార్టిన్ లూథర్, గలతీయులకు వ్యాఖ్యానం, అధ్యాయం 2, వచనాలు 4–5).
English
సోలో క్రిస్టో ఎందుకు ముఖ్యం?