settings icon
share icon
ప్రశ్న

వివాహానికి ముందు సాన్నిహిత్యంగా ఉండుటకు తగిన స్థాయి ఏంటి?

జవాబు


“మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటిపేరైనను ఎత్తకూడదు. . . ఇదే పరిశుద్ధులకు తగినది” అని ఎఫెసీ 5:3 చెప్తుంది. జారత్వమును గూర్చిన “సూచన” ఏదైనా క్రైస్తవులకు తగనిది. “సూచన”నగా పరిగణించబడేదానిని గూర్చి బైబిల్ జాబితాను ఇవ్వదు లేదా వివాహమునకు ముందు దంపతులకు ఆమోదించబడిన భౌతిక కార్యాలను గూర్చి కూడా చెప్పదు. అయితే, బైబిల్ ఆ అంశమును గూర్చి ప్రత్యేకంగా చెప్పలేదు గనుక వివాహమునకు “ముందు లైంగిక చర్యను” దేవుడు ఆమోదిస్తున్నాడని కాదు అర్థం. సంగ్రహంగా చెప్పాలంటే, సంభోగప్రేరణ అనేది లైంగిక చర్యకు ఒకర్ని సిద్ధపరచుటకు యేర్పరచబడింది. సతర్కంగా అప్పుడు, వివాహ దంపతులకు సంభోగ ప్రేరణ పరిమితం కావాలి. సంభోగన ప్రేరణగా పరిగణింపబడేదేనినైనా వివాహము వరకు నివారించాలి.

అవివాహిత దంపతులకు ఏవిధమైన చెర్యయైనా సరియైనది కాదు అని అనుమానంతో ఉన్నప్పుడు, దానిని నివారించాలి (రోమా. 14:23). ఏ విధమైన మరియు అన్ని లైంగిక చర్యలు మరియు ముందు – లైంగిక చర్య వివాహ దంపతులకు మాత్రమే పరిమితి కావాలి. జారత్వముగా లేదా సంభోగ ప్రేరణగా పరిగణింపబడే లైంగిక చర్యవైపు నడిపించే దేనినైనా, అవివాహిత దంపతులు నివారించాలి. వివాహమునకు ముందు చేతులు పట్టుకోవడాన్ని, కౌగలించుకోవడాన్ని, మరియు చిన్నగా ముద్దుపెట్టుకోవడాన్ని అధిగమించకూడదని చాలా మంది సేవకులు మరియు క్రైస్తవ కౌన్సిలర్లు (counselers) దంపతులకు గట్టి సలహా ఇస్తున్నారు. ఎంత ఎక్కువగాయైతే వివాహ దంపతులు వారి మధ్య ప్రత్యేక భాగాస్వామ్యనును పంచుకొంటారో అంతే ఎక్కువగా వారి లైంగిక సంబంధం ప్రత్యేకంగా మరియు అపూర్వంగా ఉంటుంది.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

వివాహానికి ముందు సాన్నిహిత్యంగా ఉండుటకు తగిన స్థాయి ఏంటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries