నేను ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు?


ప్రశ్న: నేను ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు?

జవాబు:
ఆత్మహత్య ద్వారా తమ జీవితాలను ముగించాలని ఆలోచిస్తున్న వారిని గూర్చి మేము హృదయాలలో ప్రార్థించుచున్నాము. ఒకవేళ ఇప్పుడు అది మీరైతే, దానిలో చాలా భావాలు ఉండవచ్చు, నిరాశ మరియు నిస్పృహ వంటివి. మీరు ఒక లోతైన గుంటలో ఉన్నట్లు, పరిస్థితులు మరే ఆశ ఉందా అని ఆనుకొనవచ్చు. మీ జీవిత పరిస్థితులను గూర్చి ఎవరు అర్థం చేసుకొనుచున్నట్లు అనిపించుటలేదు. జీవితం జీవించుటకు యోగ్యంగా లేదు...లేక ఉందా?

ఇప్పుడే మీ జీవితంలో దేవుడు నిజమైన దేవుడు అగునట్లు మీరు కొన్ని క్షణాలు తీసుకొన్న యెడల, ఆయన ఎంత గొప్పవాడో మీకు నిరూపించగలడు, “దేవుని అసాధ్యమైనది ఏది లేదు” (లూకా 1:37). గత గాయముల నుండి కలిగిన మచ్చలు మీలో గొప్ప నిరాకరణ లేక విడిచిపెట్టబడిన భావన కలిగించియుండవచ్చు. అది స్వయం-దయకు, కోపమునకు, ద్వేషమునకు, ప్రతీకార ఆలోచనలకు, లేక అనారోగ్యకరమైన భయములకు దారితీస్తుంది మరియు అవి మీ అతి ప్రాముఖ్యమైన అనుబంధాలలో కొన్ని సమస్యలు కలిగించియుండవచ్చు.

మీరు ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు? స్నేహితుడా, నీ జీవితములో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ, నీ నిరాశ అను గుహలో నుండి ఆయన గొప్ప వెలుగులోనికి నడిపించు ప్రేమించు దేవుడు నిన్ను నడిపించుటకు ఎదురుచూస్తున్నాడు. ఆయన మీకు నిజమైన ఆశ. ఆయన పేరు యేసు.

పాపములేని దేవుని కుమారుడైన ఈ యేసు, నీ నిరాకరణ మరియు అవమాన సమయంలో నీతో గుర్తించుకొనగలడు. ఆయన అందరి ద్వారా “తిరస్కరించబడి నిరాకరించబడెను” అని ప్రవక్తయైన యెషయా, యెషయా 53:2-6లో వ్రాస్తున్నాడు. ఆయన జీవితం దుఖముతోను వేదనతోను నిండియుండెను. ఆయన పొందిన దుఖము ఆయన కొరకు కాదు; మన కొరకు. ఆయన పొడవబడెను, గాయపరచబడెను, మరియు అణగద్రొక్కబడెను, అంతా మన పాపము కొరకు. ఆయన పడిన శ్రమల వలన, మన జీవితములు విమోచించబడి పరిపూర్ణం చేయబడగలవు.

స్నేహితుడా, నీ పాపములన్ని క్షమించబడుటకు యేసు క్రీస్తు దీనినంతటిని అనుభవించెను. మీరు ఎంత పాప భారమును మోయుచున్నప్పటికీ, మీరు వినయంగా ఆయనను మీ రక్షకునిగా అంగీకరించినయెడల ఆయన మిమ్మును క్షమించును. “ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను.....” (కీర్తనలు 50:15). మీరు చేసిన ఏది కూడ యేసు క్షమించలేనిది కాదు. ఆయనకు ఇష్టమైన దాసులలో కొన్ని ఘోరమైన పాపములు అనగా హత్య (మోషే), హత్య మరియు వ్యభిచారం (రాజైన దావీదు), శారీరక మరియు మానసిక వేదింపులు (అపొస్తలుడైన పౌలు) చేసారు. అయినను వారు ప్రభువులో క్షమాపణను మరియు నూతన జీవమును పొందారు. “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను!” (2 కొరింథీ. 5:17).

మీరు ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు? స్నేహితుడా, “విరిగిన” దానిని అనగా నీవు ఇప్పుడు కలిగియున్న జీవితము, ఆత్మహత్య ద్వారా నీవు ముగించుకోవాలనుకుంటున్న జీవితమును సరిచేయుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. యెషయా 61:1-3లో ప్రవక్తయైన యెషయా వ్రాస్తున్నాడు, “ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును.”

యేసు యొద్దకు రండి, మరియు మీ జీవితములో ఒక నూతన కార్యము ఆరంభించుటకు మరియు మీ ఆనందమును పునరుద్ధరించుటకు ఆయనకు అవకాశమిమ్ము. మీరు కోల్పోయిన ఆనందమును పునరుద్ధరించి మిమ్మును నడిపించుటకు ఒక నూతన ఆత్మను ఇస్తానని వాగ్దానం చేసాడు. మీ విరిగిన హృదయం ఆయనకు విలువైనది: “నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము” (కీర్తనలు 51:12, 15-17).

మీ రక్షకునిగా మరియు కాపరిగా ప్రభువును మీరు అంగీకరించాలని అనుకుంటున్నారా? ఆయనా మీ అడుగులను ఆలోచనలను-ప్రతి రోజు-ఆయన వాక్యమైన బైబిల్ ద్వారా నడిపిస్తాడు. “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” (కీర్తనలు 32:8). “నీకాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును యెహోవా భయము వారికి ఐశ్వర్యము” (యెషయా 33:6). క్రీస్తులో కూడ మీకు సంఘర్షణ ఉంటుంది, కాని మీకు ఇప్పుడు నిరీక్షణ ఉంటుంది. ఆయన “సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు” (సామెతలు 18:24). మీరు నిర్ణయం తీసుకొను సమయంలో ప్రభువైన యేసు యొక్క కృప మీతో ఉండును గాక.

మీ రక్షకునిగా యేసు క్రీస్తును విశ్వసించాలని మీరు ఆశించినయెడల, మీ హృదయాలలో దేవునితో ఈ మాటలు చెప్పండి: “దేవా, నా జీవితంలో నీవు నాకు కావాలి. నేను చేసినవాటన్నిటిని బట్టి నన్ను క్షమించుము. నేను యేసు క్రీస్తుపై విశ్వాసముంచి ఆయన నా రక్షకుడని నమ్ముచున్నాను. నన్ను కడుగుము, స్వస్థపరచుము, మరియు నా జీవితంలో ఆనందమును పునరుద్ధరించుము. నా జీవితంలో నీ ప్రేమ కొరకు మరియు నా నిమిత్తం యేసు యొక్క మరణం కొరకు వందనములు.”

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
నేను ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి