సాతాను ఎవరు?ప్రశ్న: సాతాను ఎవరు?

జవాబు:
సాతాను గురించిన నమ్మకాలు చిన్న విషయమునుండి చాల గూఢమైన విషయము వరకు- పాపము చేయమని అడుగుతూ నీ భుజములపై కూర్చుండే రెండుకొమ్ములు కలిగిన ఒక ఎఱ్ఱవ్యక్తినుండి, చెడు ఆత్మను వివరించుటకు వ్యక్తీకరించటానికి ఉపయోగించే సారూప్యము వరకు. బైబిలు, ఏదిఏమైనప్పటికి, మనకు ఎవరు సాతాను మరియు ఏవిధంగా జీవితాలపై ప్రాభావమును చూపిస్తాడో సంక్లిష్టముగా వర్ణిస్తుంది. క్లుప్తముగా కూర్చినట్లయితే, బైబిలు వివరిస్తుంది సాతాను ఒక ప్రధాన దూత పరలోకముండి పాపము చేయుటవలన పడద్రోయబడినన దూత మరియు అది పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనది, తన శక్తినంతటిని ఉపయోగిస్తూ దేవుని వుధ్దేశ్యములను ధిక్కరించటంలో పూనుకొనియున్నాడు.

సాతాను ఒక పరిశుద్దమైనదూతగా సృష్టించబడ్డాడు. యెషయా 14:2 లో సాతానుకు పడద్రోయబడకముందు లూసిఫర్ గా పిలువబడింది. యెహెజ్కేలు 28:12-14 సాతాను ఒక సెరూఫుగా సృష్టించబడినదై, చూడడానికి ప్రధానంగా సృష్టించబడిన దూత అని వివరిస్తుంది. అతడు తన అందమును గూర్చి, తన స్థితిని బట్టి పొగరుబట్టినవాడై మరియు దేవుని కంటె పై స్థాయిలో సింహాసనము మీద కూర్చూండవలెనని ఆశ కలిగినవాడాయెను (యెషయా 14:13-14; యెహెజ్కేలు 28:15; 1 తిమోతి 3:6). సాతాను గర్వము పతనానికి దారితీసింది. గమనించండి చాలసార్లు "నేను" అని యెషయా 14:13-14 ప్రకటించడం. పాపమునుబట్టి సాతాను పరలోకమునుండి బహిష్కరించబడినాడు.

సాతాను ఈ ప్రపంచాన్ని పాలిస్తున్న లోక నాథుడు మరియు వాయుమండల అధిపతి ( యోహాను 12:31; 2 కొరింథీయులకు 4:4 ఎఫెసీయులకు 2:2). నేరముమోపువాడు (ప్రకటన 12:10), శోధకుడు (మత్తయి 4:3; 1 థెస్సలోనీకయులకు 3:5), మరియు మోసపుచ్చువాడు (ఆదికాండం 3; 2 కొరింథీయులకు 4:4; ప్రకటన 20:3). అతని పేరే శత్రువు" లేక "విరోధి." అతనికున్న వేరే నామకరణములు, దయ్యము, అనగా అర్థం "నిందకుడు."

అతడు పరలోకమునుండి త్రోయబడినప్పటికి, ఇంకా దేవుడున్న అతిపరిశుధ్దసింహాసనమును ఆక్రమించాలని ప్రయత్నిస్తూనేవున్నాడు. దేవుడు చేస్తున్నవాటన్నిటిపైన వ్యతిరేకతలేపుతాడు, లోకము అంతా అతనిని ఆరధిస్తారని ఆశిస్తూ మరియు దేవునికి వ్యతిరేకమైన రాజ్యముగురించి అందరిని ప్రోత్సాహిస్తున్నాడు. ప్రపంచములోని ఉన్న తప్పుడు మత విధానములకు, మతాలకు సాతానే మూలకరకుడు. సాతాను దేనినైనా మరియు ఎంతటిదానినైనా అతని శక్తితో దేవుడు చేసేదానిని మరియు ఆయనను వెంబడించేవారిని వ్యతిరేకిస్తాడు. ఏదిఏమైనప్పటికి, సాతాను నిట్యనరకములో అగ్ని గంధకములుగల గుండములో పడద్రోయబడి బంధింపబడెను (ప్రకటన 20:10).


తెలుగు హోం పేజికు వెళ్ళండి


సాతాను ఎవరు?