సంఘము అంటే ఏమిటి?


ప్రశ్న: సంఘము అంటే ఏమిటి?

జవాబు:
నేడు అనేక మంది ప్రజలు సంఘము అంటే భవనము అని ఆలోచిస్తారు. అయితే ఇది సంఘమును గూర్చిన బైబిల్ అవగాహన కాదు. “సంఘము” అనే పదము గ్రీకు పదమైన ekklesia నుండి వస్తుంది, మరియు “సభ” లేక “బయటకు-పిలువబడినవారు” అని దీని అర్థము. “సంఘము” యొక్క ములార్థము భవనము కాదు, ప్రజలు. మీరు ఏ సంఘమునకు వెళ్తున్నారు అని ప్రజలను అడిగినప్పుడు ప్రజలు సాధారణంగా భవనం పేరు చెప్పుట వ్యంగ్యము. “…వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి” అని రోమా 16:5 చెబుతుంది. వారి గృహములో ఉన్న సంఘమును పౌలు సంబోధిస్తున్నాడు గాని, సంఘ భవనమును కాదు, విశ్వాసుల శరీరమును.

సంఘము క్రీస్తు శరీరమైయుంది, మరియు ఆయన దాని శిరస్సు. “మరియు సమస్త మును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది” అని ఎఫెసీ. 1:22-23 చెబుతుంది. క్రీస్తు శరీరములో పెంతెకొస్తు దినము (అపొ. 2 వ అధ్యాయం) మొదలు క్రీస్తు రాక వరకు యేసు క్రీస్తు నందలి విశ్వాసులందరు భాగమైయుంటారు. క్రీస్తు శరీరములో రెండు విషయములు ఉన్నాయి:

1) సార్వత్రిక సంఘములో యేసు క్రీస్తుతో వ్యక్తిగత అనుబంధము కలిగియున్న వారందరు ఉంటారు. “ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు” (1 కొరింథీ. 12:13). నమ్మిన ప్రతివాడు క్రీస్తు శరీరములో భాగమని మరియు దానికి రుజువుగా క్రీస్తు ఆత్మను పొందుకున్నాడని ఈ వచనం చెబుతుంది. యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షణను పొందుకున్న వారందరు దేవుని యొక్క సార్వత్రిక సంఘము.

2) గలతీ. 1:1-2లో స్థానిక సంఘము వివరించబడింది: “...అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును, నాతో కూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది.” గలతీ ప్రాంతములో అనేక సంఘములు ఉన్నాయని ఇక్కడ మనం చూస్తాము-వీటిని స్థానిక సంఘములు అంటాము. బాప్టిస్టు సంఘము, లూథరన్ సంఘము, కాథలిక్ సంఘము, మొ., సార్వత్రిక సంఘములోని సంఘము కాదు, కాని అవి స్థానిక విశ్వాసుల శరీరము కలిగిన స్థానిక సంఘము. సార్వత్రిక సంఘములో క్రీస్తుకు చెందినవారు మరియు రక్షణ కొరకు అయనను నమ్మినవారు ఉంటారు. సార్వత్రిక సంఘములోని ఈ సభ్యులు స్థానిక సంఘములో సహవాసము మరియు క్షేమాభివ్రుద్ధి కొరకు వెదకాలి.

సారాంశంగా, సంఘము ఒక భవనము లేక డినామినేషన్ కాదు. బైబిల్ ప్రకారం, సంఘము క్రీస్తు శరీరము-రక్షణ కొరకు యేసు క్రీస్తుపై విశ్వాసముంచిన ప్రజలు (యోహాను 3:16; 1 కొరింథీ. 12:13). స్థానిక సంఘములు సార్వత్రిక సంఘములోని సభ్యుల యొక్క కూడిక. స్థానిక సంఘములో సార్వత్రిక సంఘములోని సభ్యులు 1 కొరింథీ. 12వ అధ్యాయములోని “శరీర” నియమాలను అన్వయించవచ్చు” ప్రోత్సహించుట, బోధించుట, ప్రభువైన యేసు క్రీస్తు కృపలో ఒకరినొకరు కట్టుకొనుట.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
సంఘము అంటే ఏమిటి?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి