దేవుని స్వరమును ఏవిధంగా గుర్తించగలను?ప్రశ్న: దేవుని స్వరమును ఏవిధంగా గుర్తించగలను?

జవాబు:
యుగాలనుండి లెక్కలేనంతమంది ప్రజలు ఈ ప్రశనను అడుగుతూనేయున్నారు. సమూయేలు దేవుని స్వరమును విన్నాడు, గాని ఏలి తనకు శిక్షణిచ్చేంతవరకు ఆస్వరమును ఎవరిదో గుర్తించలేదు. (1 సమూయేలు 3:1-10). గిద్యోను దేవునినుండి శారీరక ప్రత్యక్షతను పొందుకున్నాడు, మరియు అతడు ఇంకా సూచనకొరకు అడిగినపుడు ఆసమయములో విన్న స్వరాన్ని అనుమానించాడు, ఒకసారి కాదు, గాని మూడుసార్లు (న్యాధిపతులు 6:17-22, 36-40). మనము దేవుని స్వరము వినుటకు వేగిరపడినపుడు, ఆయ్నే మనతో మాట్లాడుతున్నాడని మనమే విధంగా తెలిసికొనగలము? మొట్టమొదటిగా, మనకున్నది అది సమూయేలు మరియు గిద్యోనుకు లేనిది. మనకు సంపూర్తియైన బైబిలు, దైవావేశములవలన కల్గిన దేవుని వాక్యము, చదువుటకు, అధ్యయించుటకు, మరియు ధ్యానించుటకు. “దైవజనుడు సన్నద్దుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్దపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకు ప్రయోజనకరమైయున్నది" (2 తిమోతి 3:16-17). మనజీవితాలలో ఒక సంధర్భమునుగూర్చి లేక జీవితానికి సంభంధించి నిర్ణయాలను తీసుకొనే విషయాలలో ప్రశ్నలున్నట్లయితే, దాని గూర్చి బైబిలు ఏమి చెప్తున్నదో చూడవలెను. దేవుడు ఎన్నడు మనలను నడిపించడు లేక ఆయన భోధించినదానికి విరుద్దముగా సూటిగా లేక ఆయన లేఖనాలలో వాగ్ధానము చేసినదానికి చెప్పడు (తీతుకు 1:2).

రెండవది, మనము దేవుని స్వరమును వినాలి అంటే దానిని గుర్తించగలగాలి. యేసు చెప్పెను, " నా గొఱ్ఱెలు నా స్వరము వినును. నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును" (యోహాను 10:27). ఎవరు దేవుని స్వరమును వింటారో వారే ఆయనకు చెందినవారు - ఎవరైతే యేసునందు విశ్వాసముంచి ఆయన కృపవలన రక్షింపబడినారో వారు ఆయనకు చెందినవారు. ఈ గొఱ్ఱెలే ఆయన స్వరాన్ని వినేవారు మరియు ఆయన స్వరాన్ని గుర్తిస్తారు, ఎందుకంటే వారికి ఆయన గొఱ్ఱెలకాపరిగా తెలుసు మరియు వారికి ఆయన స్వరము తెలుసు. అయితే మనము దేవుని స్వరమును వినాలంటే ఆయనకు చెందినవారై యుండాలి.

మూడవది, మనమెప్పుడు ప్రార్థనలో, బైబిలు అధ్యాయనములో, మరియు మౌన ధ్యానములో సమయాన్ని గడుపుతామో అప్పుడు ఆయన స్వరమును వింటాము. మనము ఎక్కువ సమయాన్ని సాన్నిహిత్యముగా ఆయనతోను మరియు ఆయన వాక్యములోను గడిపినట్లయితే, ఆయన స్వరాన్ని గుర్తించటానికి మరియు ఆయన నడిపింపును మనజీవితములో తెలుసుకొనుటకు ఎంతో సులభతరమౌతాది. బ్యాంకు ఉద్యోగులు ఏదైనా వంచకుల సృష్ఠించిన నోటులను గుర్తించుటకు వారు నాణ్యమైన రూపాయలు ఏవిధంగా ఉంటాయో గుర్తించుటకై అధ్యయనము చేస్తూ తర్ఫీదు పొందుతారు ఎందుకంటే నకిలీ నోటులను వెంటనే గుర్తించుటకు. అందుకే మనము దేవుని వాక్యముతో అలవాటుపడినప్పుడు మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మరియు ఆయన మనలను నడిపిస్తున్నాడని, అప్పుడు స్పష్ఠముగా అర్థమవుతుంది అది దేవుడేనని. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము సత్యాన్ని గ్రహిస్తాము. దేవుడు ప్రజలతో వినగలిగేటట్లు మాట్లాడినపుడు, ప్రాధమికముగా ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతాడు, మరియు కొన్నిసార్లు మన మనస్సాక్షితో పరిశుధ్దాత్మ దేవుని ద్వారా,పరిస్థితులద్వారా, మరియు ఇతర ప్రజల ద్వారా మట్లాడుతాడు. లేఖన సత్యాలను మనము విని వాటిని జీవితానికి అన్వయించినపుడు, ఆయన స్వరాన్ని గుర్తించుటకు నేర్చుకుంటాం.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


దేవుని స్వరమును ఏవిధంగా గుర్తించగలను?