దేవుడు ఇంకను ఈదినాలలో కూడ ప్రజలకు దర్శనములు ఇచ్చునా? విశ్వాసులు వారి క్రైస్తవ అనుభవములో దర్శనముల కొరకు కనిపెట్టవచ్చా?ప్రశ్న: దేవుడు ఇంకను ఈదినాలలో కూడ ప్రజలకు దర్శనములు ఇచ్చునా? విశ్వాసులు వారి క్రైస్తవ అనుభవములో దర్శనముల కొరకు కనిపెట్టవచ్చా?

జవాబు:
దేవుడు ఇంకను ఈదినాలలో కూడ ప్రజలకు దర్శనములు ఇస్తాడా? అవును! దేవుడు ఈదినాలలో కూడ ప్రజలకు దర్శనములు ఇస్తాడా? సాధ్యమయియుండవచ్చు. సామాన్యమైన రీతిలో సంభవించినట్లు దర్శనములను కనిపెట్టవచ్చా? లేదు. బైబిలులో రచించినట్లు, దేవుడు అనేకమంది ప్రజలతో దర్శనముల అనే పద్దతి ద్వారా మాట్లాడుట మనకు తెలుసు. ఉదాహరణకు యోసేపు, యాకోబు కుమారుడు; యోసేపు , మరియ భర్త; సొలోమోను; యెషయా: యెహెజ్కేలు; డేనియేల్; పేతురు; మరియు పౌలు. ప్రవక్తయైన యోవేలు ముందుగానే దర్శనములు కుమ్మరించబడతాయని ప్రవచించెను, మరియు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో అపోస్తలుడైన పేతురుచే రూఢిచేయఁబడినది. ప్రాముఖ్యముగ గ్రహించవల్సింది ఏంటంటే ఒక దర్శనమునకు మరియు కలకు ఉన్న మధ్య భేధాన్ని, దర్శనమునము అనేది ఒక వ్యక్తి మెలకువగా నున్నప్పుడు కలిగేది అయితే ఒక వ్యక్తి నిద్రావస్థలో నున్నప్పుడు కలిగేది కల.

ప్రపంచములోని చాలా భాగాలలో, దేవుడు ఈ దర్శనములను మరియు కలలను విస్తృతముగా వాడుకుంటున్నాడు. ఎక్కడైతే కొద్దిగా లేక అసలు సువార్తను అందని స్థలలున్నయో, మరియు ఎక్కడైతే బైబిలులు అందని ప్రాంతాలున్నాయో, ఆ స్థాలములకు దేవుడు సూటిగా దర్శనములు మరియు కలలు ద్వారా తన వర్తమానమును తీసుకెళ్తున్నాడు. ఆదిమ సంఘ క్రైస్తవులలో ప్రజలకు తన సత్యాన్ని తెలియపరచుటకు దేవుడు తరచుగా దర్శనముల ద్వారా ప్రత్యక్షముచేసెను, ఇది యావత్తు దర్శనములను గురించి బైబిలులోని ఉదాహరనలతో అనుగుణ్యమైనది. ఒక వ్యక్తికి దేవుడు తన వర్తమానమును అందించుటకు ఇష్టపడినట్లయితే, అది ఎలాంటి పద్దతినైన అత్యవసరమయితే ఉపయోగించికొనును- ఒక ప్రేషితునినో, ఒక దూతనో, ఒక దర్శనమునో, లేక ఒక కలనో. అయినా, సిధ్దంగా తన సువార్త సమృధ్ధిగా అందుతున్న ప్రాంతాలలో కూడా దర్శనములు చూపించుటకు దేవునికి అంతాగా సామర్ధ్యత నున్నది. దేవుడు చేయవల్సిన దానికి పరిమితులు లేవు.

అదే సమయములో, దర్శనములకు మరియు వాటికి భాష్యము చెప్పునప్పుడు అతి జాగృతితో నూండవలెను. మన మనస్సులో నుంచుకోవాలి బైబిలు అంతయు సమాప్తి చేయబడినది, మరియు మనము తెలుసుకోవాల్సిన వాటన్నిటిని అది వివరించును. కీలకమైన సత్యము ఏంటంటే ఒక వేళ దేవుడు దర్శనములను ఉపయోగించుకోవాలంటే దేవుడు తన వాక్యములో ఏదైతే రాచియుంచారో దానికి అనుగుణంగా నుంటుంది. దేవుని వాక్యం కన్నా దర్శనములకు సమానమైన లేక అతిగొప్ప అధికారమును ఎన్నడూ ఇవ్వలేదు. క్రైస్తవ విశ్వాసమునకైనను మరియు అభ్యాసమునకైనను దేవుని వాక్యమునకే అంతిమమైన అధికారము కలిగినది. ఒకవేళ నీకు దర్శనము కలిగినట్లు నీవు నమ్మితే మరియు భావిస్తే అది దేవుడే నీకు కలిగించి యుండవచ్చు, ప్రార్థనపూర్వకముగా దేవుని వాక్యముతో పరీక్షించు మరియు లేఖనభాగలతో ఆ దర్శనము సరితూగుతుందో లేదో చూచుకో. ఆ దర్శనము దృష్టిలోనుంచుకొని ని ప్రతిస్పందన ఎలా వుండాలో అనేదానిని ప్రార్థనపూర్వకముగా ఆలోచించు (యాకోబు 1:5). ఒక వ్యక్తికి దర్శనమిచ్చి దాని అర్థాన్ని అతనితొ దాచుకొనేటటువంటి దేవుడు కాడు. లేఖనభాగాలలో, ఒక వ్యక్తి దర్శనమునకు అర్థాన్ని అడిగినపుడెల్ల, దేవుడు ఆ వ్యక్తికి తప్పనిసరిగ్గ విశదీకరించెను(దానియేలు 8:15-17).


తెలుగు హోం పేజికు వెళ్ళండి


దేవుడు ఇంకను ఈదినాలలో కూడ ప్రజలకు దర్శనములు ఇచ్చునా? విశ్వాసులు వారి క్రైస్తవ అనుభవములో దర్శనముల కొరకు కనిపెట్టవచ్చా?