నా క్రైస్తవ జీవితంలో పాపమును ఎలా అధిగమించగలను?


ప్రశ్న: నా క్రైస్తవ జీవితంలో పాపమును ఎలా అధిగమించగలను?

జవాబు:
పాపమును అధిగమించుటకు మనం చేయు ప్రయత్నాలకు బైబిల్ అనేక నిధులను ఇస్తుంది. ఈ జీవితకాలంలో, మనం పాపముపై పరిపూర్ణ విజయము పొందలేము (1 యోహాను 1:8), అయినప్పటికీ అది మన గురిగా ఉండాలి. దేవుని సహాయంతో, ఆయన మాట యొక్క నియమాలను అనుసరించుటతో, మనం పాపమును అంచెలంచెలుగా జయించి మరింత ఎక్కువగా క్రీస్తు వలె మారగలం.

మనం పాపమును అధిగమించుటకు బైబిల్ ఇచ్చు మొదటి నిధి పరిశుద్ధాత్మ. మనం క్రైస్తవ జీవితములో జయించినవారిగా ఉండుటకు దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. గలతీ 5:16-25లో దేవుడు ఆత్మ ఫలములను మరియు శరీర కార్యములను వేరుచేస్తున్నాడు. ఆ వాక్యభాగంలో ఆత్మలో నడచుటకు మనం పిలువబడితిమి. విశ్వాసులందరి యొద్ద ఆత్మ ఉంటుంది గాని, ఆ ఆత్మ ఆధీనమునకు స్పందిస్తూ ఆత్మలో మనం నడవవలెనని ఈ వాక్యభాగం చెబుతుంది.

పరిశుద్ధాత్మ చేయదగిన మార్పు పేతురు యొక్క జీవితంలో మనం చూడవచ్చు, అతడు, ఆత్మతో నింపబడక ముందు యేసును యెరుగనని మూడు సార్లు బొంకాడు-మరియు క్రీస్తును మరణంలో కూడ అనుసరిస్తానని చెప్పిన తరువాత. ఆత్మతో నింపబడిన తరువాత, పెంతెకోస్తు దినమున యూదులతో బహిరంగంగా బలముగా మాట్లాడాడు.

ఆత్మ ప్రేరేపణలను ఆర్పుటకు ప్రయత్నించకుండా మనం ఆత్మలో నడుస్తాము (1 థెస్స. 5:19లో చెప్పినట్లు) మరియు ఆత్మలో నింపబడుటకు ప్రయత్నిస్తాము (ఎఫెసీ. 5:18-21). ఒకడు ఆత్మతో ఎలా నింపబడగలడు? మొదటిగా, పాత నిబంధన వలెనె ఇది దేవుని యొక్క నిర్ణయం. తాను చేయవలసిన పనిని చేయుటకు ఆయన కొందరు వ్యక్తులను ఎన్నుకున్నాడు మరియు వారిని అయన ఆత్మతో నింపాడు (ఆది. 41:38; నిర్గమ. 31:3; సంఖ్యా. 24:2; 1 సమూ. 10:10). తమను తాము దేవుని వాక్యముతో నింపుకొనువారిని దేవుడు ఆత్మతో నింపుతాడని ఎఫెసీ. 5:18-21లో మరియు కొలస్సి. 3:16లో రుజువులు ఉన్నాయి. ఇది మనలను రెండవ నిధిలోనికి నడిపిస్తుంది.

మనలను ప్రతి సత్ క్రియలో బలపరుచుటకు దేవుడు మనకు తన వాక్యము ఇచ్చెనని దేవుని వాక్యమైన బైబిల్ చెబుతుంది (2 తిమోతి. 3:16-17). మనం ఎలా జీవించాలి మరియు దేనిని నమ్మాలి అది మనకు నేర్పిస్తుంది, సరైన మార్గములో తిరిగి వచ్చుటకు అది మనకు సహాయం చేస్తుంది, మరియు మార్గములో నిలిచియుండుటలో అది మనకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యము జీవముగలది మరియు బలమైనది అని, మన హృదయం మరియు స్వభావంలోని లోతైన పాపములను తీసివేయుటకు మరియు జయించుటకు అది మన హృదయాలలోనికి చొచ్చుకుపోతుందని హెబ్రీ. 4:12 చెబుతుంది. దాని జీవితమును మార్చు శక్తిని గూర్చి కీర్తనకారుడు 119వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. తన శత్రువులను జయించుటలో సఫలత కొరకు ఈ నిధిని మరచిపోక దానిని పగలు రాత్రి ధ్యానించి దానిని అంగీకరించాలని యెహోషువాకు చెప్పబడెను. సైన్యం పరంగా దేవుని ఆజ్ఞ భావ్యంగా లేనప్పటికీ, ఆయన దానిని చేసాడు, మరియు వాగ్దాన దేశము కొరకు తాను చేసిన యుద్ధములలో జయముకు ఇది ఒక మూలముగా ఉంది.

మనం చాలా సార్లు సులువుగా భావించు నిధి బైబిల్. బైబిల్ ను సంఘమునకు తీసుకువెళ్లుట ద్వారా లేక రోజుకొక అధ్యాయమును చదువుట ద్వారా దానికి ఒక గుర్తింపు సేవ చేయుటకు ప్రయత్నిస్తాముగాని, దానిని వల్లించుటలో, ధ్యానించుటలో, లేక మన జీవితములలో అన్వయించుటలో విఫలమవుతాము; అది బయలుపరచు పాపములను ఒప్పుకొనుటలో లేక అది మనకు బయలుపరచు వరముల కొరకు దేవుని స్తుతించుటలో విఫలమవుతాము. బైబిల్ విషయంలో, మనం చాలా సార్లు అసలు ఆకలి లేకుండా ఉంటాం లేక అధికంగా భుజిస్తాం. మనలను ఆత్మీయంగా సజీవంగా ఉంచుటకు కావలసినంత దేవుని వాక్యము మాత్రమే మనం తీసుకొంటాం (కాని బలమైన, ఎదుగు క్రైస్తవులుగా ఉండుటకు కావలసినంత తీసుకొనము), లేక మనం తరచుగా తీసుకుంటాం గాని దానిలో నుండి ఆత్మీయ బలమును పొందుటకు కావలసినంత సమయం ధ్యానించము.

మీరు అనుదినము దేవుని వాక్యమును చదివి ధ్యానించు అలవాటు లేనివారైతే, అలా మీరు చేయుట ఆరంభించుట చాలా ముఖ్యం. కొందరు ఒక జర్నల్ వ్రాయుట ఆరంభించుటను ఉపయోగకరంగా భావిస్తారు. మీరు వాక్యములో నుండి పొందుకొనిన దానిని వ్రాసేంత వరకు విడిచిపెట్టకుండా ఉండే అలవాటును చేసుకోండి. వారు మార్చుకోవాలని దేవుడు వారితో మాట్లాడిన విషయములలో ఆయన సహాయం కోరుతూ కొందరు ప్రార్ధనలను రికార్డు చేస్తారు. ఆత్మ మన జీవితాలలో ఉపయోగించు పరికరం బైబిల్ (ఎఫెసీ. 6.17), మన ఆత్మీయ యుద్ధాలను పోరాడుటకు దేవుడు మనకిచ్చు కవచంలో ముఖ్యమైన అతి పెద్ద భాగం (ఎఫెసీ. 6:12-18).

పాపమునకు విరోధముగా మన పోరాటంలో మూడవ ముఖ్యమైన నిధి ప్రార్థన. మరలా, ఈ నిధిని క్రైస్తవులు కేవలం మాటలలో ఉపయోగించి తక్కువగా ఉపయోగిస్తారు. మనకు ప్రార్థనా కూడికలు, ప్రార్థనా సమయములు, మొదలగునవి ఉంటాయి గాని, ఆదిమ సంఘము వలె మనం ప్రార్థనను ఉపయోగించము (అపొ. 3:1; 4:31; 6:4; 13:1-3). తాను సేవ చేయువారిని గూర్చి తను ఏ విధంగా ప్రార్థించెనో పౌలు మరలా మరలా చెబుతున్నాడు. ప్రార్థనను గూర్చి దేవుడు మనకు అద్భుతమైన వాగ్దానములు ఇచ్చాడు (మత్తయి 7:7-11; లూకా18:1-8; యోహాను 6:23-27; 1 యోహాను 5:14-15), మరియు ఆత్మీయ పోరాటం కొరకు సిద్ధపాటును గూర్చిన ప్రార్థనను పౌలు తాను వ్రాసిన లేఖనాలలో జతపరచాడు (ఎఫెసీ. 6:18).

మన జీవితంలో పాపమును జయించుటకు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది? పేతురు యేసును యెరగనని బొంకక మునుపు, గెత్సేమనే తోటలో క్రీస్తు పేతురుతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. యేసు ప్రార్థించుచుండగా, పేతురు నిద్రించుచున్నాడు. యేసు అతనిని లేపి అంటున్నాడు, “ మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము” (మత్తయి 26:41). పేతురు వలె మనం కూడ సరైనది చెయ్యాలని ఆశిస్తాం కని తగిన బలమును పొందలేకపోవుచున్నాము. అడుగుటకు, వెదకుటకు, మరియు తట్టుటకు మనం దేవుని హెచ్చరికను పాటిస్తూ ఉండాలి-మరియు మనకు కావలసిన శక్తిని ఆయన ఇస్తాడు (మత్తయి 7:7). ప్రార్థన ఒక మ్యాజిక్ నియమము కాదు. ప్రార్థన అంటే కేవలం మన బలహీనతలను మరియు దేవుని యొక్క అంతముకాని శక్తిని ఒప్పుకొని, మనం చేయుగోరువాటిని చేయుట కొరకు గాక, ఆయన కోరువాటిని చేయుటకు కావలసిన శక్తి కొరకు ఆయన వైపు తిరుగుట (1 యోహాను 5:14-15).

పాపమును జయించుటకు మన యొద్ద ఉన్న నాల్గవ నిధి విశ్వాసుల సహవాసమైన సంఘము. యేసు తన శిష్యులను బయటకు పంపినప్పుడు, వారిని ఇద్దరిద్దరుగా పంపెను (మత్తయి 10:1). అపొస్తలుల కార్యములులోని సేవకులు ఒక్కొకరిగా బయటకు వెళ్లలేదుగాని, ఇద్దరు లేక ఎక్కువ మందిగా గుంపులో వెళ్లారు. మనం సమాజముగా కూడుకొనుట మానక ఆ సమయమును ఒకరినొకరు సత్ క్రియలు మరియు ప్రేమలో ప్రోత్సహించుకొనుటకు ఉపయోగించుకోవాలని యేసు ఆజ్ఞ ఇచ్చాడు (హెబ్రీ. 10:24). మనం ఒకరికొకరు తమ బలహీనతలను ఒప్పుకోవాలని ఆయన చెప్పుచున్నాడు (యాకోబు 5:16). పాత నిబంధనలోని జ్ఞాన సాహిత్యంలో, ఇనుము ఇనుమును పదును చేయునట్లు, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పదును చేస్తాడు (సామెతలు 27:17). సంఖ్యలో బలముంది (ప్రసంగి 4:11-12).

కఠినమైన పాపములను జయించుటకు ఒక లెక్క అడుగు సహచరుడు కలిగియుండుట ఉత్తమమని చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు. మీతో మాట్లాడు, కలిసి ప్రార్థించు, ప్రోత్సహించు, మరియు గద్దించు ఒక వ్యక్తిని కలిగియుండుట చాలా ఉపయోగకరం. శోధన మనందరికీ కలుగుతుంది (1 కొరింథీ. 10:13). లెక్క అడుగు సహచరుడు లేక లెక్క అడుగు గుంపును కలిగియుండుట అతి కఠినమైన పాపములను కూడ జయించుటకు కావలసిన ఆఖరి ప్రోత్సాహమును మరియు పురికొల్పును ఇస్తుంది.

కొన్ని సార్లు పాపముపై విజయం త్వరగా వస్తుంది. మరికొన్ని సార్లు, విజయం చాలా నిదానంగా వస్తుంది. ఆయన నిధులను మనం ఉపయోగించుచుండగా, ఆయన మన జీవితాలలో ఒక ప్రక్రియ రూపంలో మార్పును తీసుకొనివస్తాడని దేవుడు వాగ్దానం చేసాడు. ఆయన తన వాగ్దానములలో నమ్మదగినవాడు కాబట్టి పాపమును జయించు మన కృషిలో మనం సహనంతో ఉండవచ్చు.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
నా క్రైస్తవ జీవితంలో పాపమును ఎలా అధిగమించగలను?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి