settings icon
share icon
ప్రశ్న

నిజమైన సువార్త ఏమిటి?

జవాబు


నిజమైన సువార్త ఏమిటంటే, దేవుడు పాపులను రక్షిస్తాడు అనే శుభవార్త. మనిషి సహజంగా పాపి మరియు ఆ పరిస్థితిని సరిదిద్దే ఆశ లేకుండా దేవుని నుండి వేరుగా ఉన్నాడు. కానీ దేవుడు తన శక్తివల్ల, రక్షకుడైన యేసు క్రీస్తు మరణం, సమాధి మరియు పునరుత్థానంలో మనిషి విమోచనకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు.

"సువార్త" అనే పదానికి అక్షరాలా అర్థం "శుభవార్త". కానీ ఈ వార్త ఎంత శుభమైనదో నిజంగా గ్రహించాలంటే, మనం ముందుగా చెడ్డవార్తను అర్థం చేసుకోవాలి. ఏదెన్ తోటలో మానవుడు పతనమైన ఫలితంగా (ఆదికాండము 3:6), మానవుని ప్రతి భాగం—అతని మనస్సు, చిత్తం, భావాలు మరియు శరీరం—పాపం ద్వారా కలుషితమయ్యాయి. మానవుని పాపపు స్వభావం వలన, అతను దేవుని వెదకడు మరియు వెదకలేడు. దేవునియొద్దకు రావాలనే కోరిక అతనికి లేదు, నిజానికి, అతని మనస్సు దేవునికి విరోధముగా ఉంది (రోమీయులకు 8:7). దేవుడు ప్రకటించినదేమనగా, మనిషి పాపం అతన్ని దేవుని నుండి వేరుపడి, నరకంలో శాశ్వతంగా ఉండేలా చేస్తుంది. పరిశుద్ధుడైన మరియు నీతిమంతుడైన దేవునికి విరోధంగా చేసిన పాపానికి మనిషి నరకంలోనే శిక్ష అనుభవిస్తాడు. దీనికి పరిష్కారం లేకపోతే ఇది నిజంగా చెడ్డ వార్త అవుతుంది.

కానీ సువార్తలో, దేవుడు తన కరుణతో, ఆ నివారణను, మనకు బదులుగా ఒక ప్రత్యామ్నాయాన్ని—యేసు క్రీస్తును—అందించాడు. ఆయన సిలువపై తన త్యాగం ద్వారా మన పాపమునకు శిక్షను చెల్లించడానికి వచ్చాడు. కొరింథీయులకు పౌలు ప్రకటించిన సువార్త యొక్క సారాంశం ఇదే. 1 కొరింథీ 15:2-4లో, ఆయన సువార్త యొక్క మూడు అంశాలను వివరిస్తాడు—అవి మన కొరకు క్రీస్తు మరణం, సమాధి మరియు పునరుత్థానం. మన పాత స్వభావం క్రీస్తుతో పాటు శిలువపై మరణించి, ఆయనతో పాటు సమాధి చేయబడింది. ఆ తర్వాత మనం ఆయనతో పాటు ఒక కొత్త జీవానికి పునరుత్థానం చేయబడ్డాము (రోమా 6:4-8). రక్షణను ఇచ్చే ఏకైకమైన ఈ నిజమైన సువార్తను "దృఢముగా పట్టుకొనవలెనని" పౌలు మనకు చెబుతున్నాడు. మరే ఇతర సువార్తను నమ్మడం వ్యర్థమైనది. రోమా 1:16-17లో, పౌలు నిజమైన సువార్త "విశ్వసించే ప్రతి ఒక్కరి రక్షణ కొరకు దేవుని శక్తి" అని కూడా ప్రకటిస్తాడు, దీని ద్వారా అతను ఉద్దేశించేది ఏమిటంటే, రక్షణ మానవుని ప్రయత్నాల ద్వారా కాకుండా, విశ్వాసం అనే వరము ద్వారా దేవుని కృప వలన లభిస్తుంది (ఎఫెసయులు 2:8-9).

సువార్త వలన, దేవుని శక్తి ద్వారా, క్రీస్తును విశ్వసించే వారు (రోమీయులు 10:9) నరకం నుండి విమోచించబడటమే కాదు. వాస్తవానికి, మనకు పూర్తిగా కొత్త స్వభావం ఇవ్వబడింది (2 కొరింథీయులు 5:17), అది మారిన హృదయం, మరియు మంచి పనులలో వ్యక్తమయ్యే కొత్త ఆశ, చిత్తం, మరియు వైఖరిని కలిగి ఉంటుంది. పరిశుద్ధాత్మ తన శక్తి ద్వారా మనలో ఫలించే ఫలం ఇదే. క్రియలు ఎప్పుడూ రక్షణకు సాధనం కాదు, కానీ అవి దానికి రుజువు (ఎఫెసయులు 2:10). దేవుని శక్తి ద్వారా రక్షించబడిన వారు ఎల్లప్పుడూ మార్పు చెందిన జీవితం ద్వారా రక్షణ యొక్క సాక్ష్యాన్ని చూపిస్తారు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

నిజమైన సువార్త ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries