క్రమబద్ద వేదాంత శాస్త్రము అనగానేమి?


ప్రశ్న: క్రమబద్ద వేదాంత శాస్త్రము అనగానేమి?

జవాబు:
“క్రమబద్ధమైన” అనే పదము ఏదైనా ఒకటి క్రమములో పెట్టబడుటను సూచిస్తుంది. కాబట్టి, క్రమబద్ద వేదాంతశాస్త్రము అనగా వేదాంతశాస్త్రమును భాగములుగా విభజించి వాటిలోని వివిధ అంశాలను వివరించుట. ఉదాహరణకు, పరిశుద్ధ గ్రంథములోని అనేక పుస్తకములు దూతలను గూర్చి అక్కడక్కడా మాట్లాడుతుంటాయి. దూతలను గురించి ఏ ఒక్క పుస్తకమూ పూర్తి సమాచారమును ఇవ్వదు. ఇట్లుండగా, క్రమబద్ద వేదాంతశాస్త్రము పరిశుద్ధ గ్రంథములో దూతలను గూర్చి ఉన్న సమాచారము అంతటిని సేకరించి దానినంతటిని దూతల శాస్త్రము అనే ఒక క్రమములో పెడుతుంది. ఇదే క్రమబద్ద వేదాంతశాస్త్రము అంటే – పరిశుద్ధ గ్రంథములోని వివిధ బోధలను విభజించి క్రమపరచునది.

మూల వేదాంతశాస్త్రము లేదా తండ్రి వేదాంతశాస్త్రము(పటేరోలజీ) అనగా తండ్రియైన దేవుని గూర్చిన అధ్యయనం. క్రీస్తు వేదాంతశాస్త్రము (క్రిష్టాలజీ) అనగా కుమారుడైన దేవుడు, అనగా యేసుక్రీస్తును గూర్చిన అధ్యయనం. పరిశుద్ధాత్మ వేదాంతశాస్త్రము (న్యూమటాలజీ) అనగా పరిశుద్ధ ఆత్మయైన దేవుని గూర్చిన అధ్యయనం. లేఖన వేదాంతశాస్త్రము (బిబ్లియాలజీ) అనగా పరిశుద్ధ గ్రంథమును గూర్చిన అధ్యయనం. రక్షణ వేదాంతశాస్త్రము (సొటీరియాలజీ) అనగా రక్షణను గూర్చిన అధ్యయనం. సంఘ వేదాంతశాస్త్రము(ఎక్లీషియాలజీ) అనగా సంఘమును గూర్చిన అధ్యయనం. దూతల వేదాంత శాస్త్రము(ఏంజిలాలజీ) అనగా దూతలను గూర్చిన అధ్యయనం. క్రైస్తవదయ్యముల వేదాంతశాస్త్రము (క్రిస్టియన్ డీమనాలజీ) అనగా క్రైస్తవ దృక్పథం నుండి దయ్యములను గూర్చిన అధ్యయనం. క్రైస్తవ మానవ వేదాంతశాస్త్రము (క్రిస్టియన్ యాంత్రోపాలజీ) అనగా క్రైస్తవ దృక్పథం నుండి మానవుని గూర్చిన అధ్యయనం. పాప వేదాంతశాస్త్రము (హమార్టియాలజీ) అనగా పాపమును గూర్చిన అధ్యయనం. పరిశుద్ధ గ్రంథమును అర్ధము చేసుకొని ఒక క్రమబద్ధమైన విధములో విశదపరచుటకు మనకు సహాయ పదేదే ఈ క్రమబద్ద వేదాంతశాస్త్రము.

ఈ క్రమబద్ద వేదాంత శాస్త్రముతో పాటు,వేదాంతశాస్త్రమును వేరే విధంగా కూడా విభజించవచ్చు. పరిశుద్ధగ్రంథ వేదాంతశాస్త్రము అనగా పరిశుద్ధ గ్రంథములోని ఒక పుస్తకమును (లేదా పుస్తకములను) గూర్చి అధ్యయనం చేస్తూ ఆ పుస్తకము ప్రస్తావించే వివిధ వేదాంతశాస్త్ర అంశాలను ప్రత్యేకంగా ఉద్ఘటించడం. ఉదాహరణకు, యోహాను సువార్త చాలా క్రిష్టాలాజికల్ గా(అంటే క్రీస్తు కేంద్రీకృతముగా) ఉంటుంది ఎందుకంటే అది క్రీస్తు యొక్క దైవత్వముపై ఎక్కువగా మొగ్గు చూపుతుంది (యోహాను 1:1, 14; 8:58; 10:30; 20:28). చారిత్రిక వేదాంతశాస్త్రము అంటే క్రైస్తవ సిద్ధాంతములను క్రమబద్దీకరించిన కొన్ని క్రైస్తవ గుంపుల యొక్క క్రైస్తవ సిద్ధాంతముల అధ్యయనం – ఉదాహరణకు, కాల్విన్ యొక్క వేదాంతశాస్త్రము మరియు యుగములను గూర్చిన వేదాంతశాస్త్రము. సమకాలీన వేదాంతశాస్త్రము అనగా ఇటీవల కాలములలో వెలుగులోనికి వచ్చిన లేదా అభివృద్ధి చెందిన కొన్ని కొన్ని సిద్ధాంతముల యొక్క అధ్యయనం. ఏ విధానములో వేదాంతశాస్త్ర అధ్యయనమును చేపట్టినప్పటికీ కూడా, వేదాంతశాస్త్రము అధ్యయనం చేయడమే అసలు ముఖ్యమైన విషయం.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
క్రమబద్ద వేదాంత శాస్త్రము అనగానేమి?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి