ఆత్మీయ పోరాటమును గూర్చి బైబిలు ఏమని భోదిస్తుంది?ప్రశ్న: ఆత్మీయ పోరాటమును గూర్చి బైబిలు ఏమని భోదిస్తుంది?

జవాబు:
ఆత్మీయ పోరాట విషయము వచ్చేసరికి రెండు ప్రాధమికమైన తప్పులు వున్నాయి- ఎక్కౌవగా నొక్కి వాకాణించటం గాని లేక తక్కువ చేసి ఉధ్ఘాటించడం గాని వుంటుంది. కొంతమంది ప్రతీ పాపాన్ని, ప్రతీ సంఘర్షణని, మరియు ప్రతీ సమస్యను దయ్యములపై నెట్టివేసి వాటిని వదలగొట్టవలెనని తలస్తారు. ఇతరులైతే వారి అత్మీయ పరిధిలో దానిని సంపూర్తిగా కొట్టివేసి మరియు బైబిలు చెప్తున్నరీతిగా ఆత్మీయ శక్తులపై వ్యతిరేకముగా యుద్దము చేయవలెనని వాస్తవాన్ని కొట్టివేయలేము. విజయవంతమైన ఆత్మీయ పోరాటముకు కీలకమైనది బైబిలుపరమైన సమతుల్యత. యేసు కొన్నిసార్లు ప్ర్జలనుండి దయ్యములను వెళ్ళగొట్టి మరియు దయ్యము ప్రశక్తి యెత్తకుండానే ప్రజలను వారి రోగములనుండి స్వస్ఠపరచెను. అపోస్తలుడైన పౌలు క్రైస్తవులను వారిలో నున్న పాపపు స్వభావమునకు వ్యతిరేకముగా పోరాడవలెననియు (రోమా 6) మరియు చెడు ఆత్మకు వ్యతిరేకముగా పోరాడవలెనని కూడా హెచ్చరించెను (ఎఫేసీయులకు 6:10-18).

ఎఫెసీ 6:1-12 ప్రకటిస్తుంది, "తుదకు ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాముతోను పోరాడుచున్నాము." ఈ పాఠ్యభాగము కొన్ని అతిప్రాధానమైన సత్యాలను భోదిస్తుంది:కేవలము దేవుని శక్తితో మాత్రమే బలవంతులముగావుందుము, అధి ఆయన దేవుని కవచముచే మనలను భద్రపరుస్తుంది, మరియు ఈ లోకానికి చెందిన దుష్టాత్మ ప్రభావముపై మనము పోరాడవల్సివుంది.

ఒక బలీయమైన ఉదాహరణేంటంటే మిఖాయేలు, ప్రధాన దూత మాత్రమే దేవుని శక్తితో బలవంతుడుగావుండటము అనేది యూదా9 లో ప్రశంసించింది. మిఖాయేలు, దేవుని దూతలన్నింటిలో చాల శక్తివంతమైన దూత, తన స్వంత శక్తితో సాతానును ఎదిరించలేదుగాని, ఇట్లు చెప్పెను, "ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను!" ప్రకటన 12:7-8లోరాసినట్లు అంత్యదినాలలో మిఖాయేలు సాతానును ఓడించును. అయినా, అతడు సాతానుతో సంఘర్షణలోనున్నపుడు, మిఖాయేలు దేవుని నామములో మరియు ఆయన అధికారముతో గద్దించెను గాని తన స్వంత శక్తితో కాదు. అది కేవలము యేసుక్రీస్తుతో మనకున్న వ్యక్తిగత సంభంధమునుబట్టి మాత్రమే క్రైస్తవులు ఏదైనా సాతానుపై మరియు దయ్యములపై అధికారమును కల్గియుంటారు. కేవలము ఆయన నామములోనే మనము గద్దించిన ఏదైనా దానికి శక్తివుంది.

ఎఫెసీయులకు 6:13-18 ఆత్మీయ కవచమునుగూర్చి మనకు వివరణిస్తుంది. ఏలగనగా మీనడుముకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్దమనస్సును జోడుతొడుగుకొని, విశ్వాసమను డాలు పట్టుకొని, రక్షణయను శిరస్త్రాణము,దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొని మరియు ఆత్మవలన ప్రార్థనచేయుడి. ఆత్మ కవచములోని భాగాలు ఆత్మీయపోరాటములో దేనిని అగుపరస్తుంది? మనము సాతాను అబద్దములకు వ్యతిరేకముగా సత్యాన్ని మాట్లాడవలసి వున్నది. క్రీస్తు మనకొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనము నీతిమంతులుముగా ప్రకటించబడ్డామనే వాస్తవాన్ని నమ్మి విశ్రంతినొందవలెను. ఎటువంటి అవరోధాన్ని ఎదుర్కొంటున్నప్పటికి మనము అంగీకరించిన సువార్తను నిరాటంకముగా ప్రకటించవలెను. కుండామానకూడదు. ఎటువంటి విధంగానైన బలంగా పైబడ్డప్పటికి మనము విశ్వాసములో సంకోచించకూడదు. మనము పొందుకున్న రక్షణే మన అంతిమ దిక్కు, మనకున్న నిశ్చయత ఎతువంటి ఆత్మీయ శక్తి మనలను దూరముచేయలేవు. మనకున్న ఉపద్రవకరమైన ఖడ్గము ఏంటంటే దేవుని వాక్యము, గాని మనకున్న స్వంత అభిప్రాయాలు మరియు భావములు కావు. మనము యేసుని ఉదాహరణను వెంబడిస్తూన్నట్లయితే కొన్ని ఆత్మీయ విజయాలు కేవలము ప్రార్థనవలనే సాధ్యమవుతుంది.

యేసుక్రీస్తే మన ఆత్మీయ పోరాటానికి అంతిమ ఉదాహరణ. యేసు అరణ్యములో సాతానుచేత శోధింపబడినపుడు ఏవిధంగా సూతిగా వాడిని ఎదిరించెనో గమనించండి (మత్తయి 4:1-11). ప్రతీ శోధన అదే విధముగా జవాబిచ్చెను- మాYఅలతో "ఇలా వ్రాయబడియున్నది."యేసు జీవముగలిగిన దేవుని వాక్యాన్ని బాగుగా ఎరిగినవాడుగా ఆ ఆయుధాన్నే సాతాను శోధనకుతంత్రాలకు వ్యతిరేకముగా ఉపయోగించెను. యేసుక్రీస్తే దేవుని వాక్యాన్ని సాతానును ఎదిరించుటకు ఉపయోగించినప్పుడు, దానికంటే తక్కువదానిని దేనినైన ఉపయోగించవచ్చా?

స్కెవయను ప్రధానయాజకుని ఏడుగురు కుమారులు ఏవిధంగా ఆత్మీయపోరాటములో పాల్గొనలేదో ఇధి ఒక అంతిమ ఉదాహరణ . "అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు- "పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటున చేయుచున్నాను మాట చెప్పి, దయ్యముపట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు" పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము 'నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును గాని మీరెవరని అడుగగా ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింతనుండి పారిపోయిరి" (అపోస్తలులైన కార్యములు 19:13-16). స్కెవ యొక్క ఏడుగురు కుమారులు యేసు నామమును ఉపయోగించెను. అది సరిపోలేదు. స్కెవ ప్రధానయాజకునియొక్క ఏడుగురు కుమారులు యేసుతో వ్యక్తిగత సంభంధములేదు; అందుచేత, వారి మాటలలో ఎటువంటి శక్తి లేక అధికారములేక వట్టి మాటలుగా వ్యర్థమయిపోయినవి. స్కెవ యొక్క ఏడుగురు కుమారులు వారునుపయోగించే పద్దతిపైన ఆధారపడియున్నారు. వారు ప్రభువును మరియు రక్షకుదైన యేసునియందు ఆధారపడలేదు, మరియు వారి ఆత్మీయ పోరాటములో దేవుని వాక్యమును ప్రయోగించలేదు. అందుకు కారణముగా, వారు కించపరచిన విధముగా దిగంబరులై గాయము దెబ్బలు తిన్నారు. ఈ చెడ్డ ఉధాహరణ దీనినుండి మనము పాఠము నేర్చుకొందామా మరియు బైబిలు హెచ్చరించిన విధముగా మన ఆత్మీయ పోరాటాన్ని అలవర్చుకొందామా.

చివరిగా, ఆత్మీయ పోరాటములో కీలక పాత్రను పోషించే మూలముఏంటి? మొదటిది, మనము దేవుని శక్తిపైనే ఆధారపడియుంటాము, గాని మన స్వంత శక్తి కాదు. రెండవది, యేసు నామములో గద్దిస్తాము గాని మన స్వంత నామము కాదు. మూడవది, మనలను మనము దేవుని సంపూర్తియైన యుద్ధ కవచముతో రక్షించుకుంటాము. నాల్గవది, దేవుని వాక్యము -అనే ఆత్మీయ ఖడ్గముచేత మనము పోరాడవలెను. తుదకు, మనము ఙ్ఞప్తిలోకి తెచ్చుకోవాల్సింది సాతాను మరియు అతని అనుచరులైన దయ్యములతోను ఆత్మీయ యుద్ధము పోరాడవల్సిఉంది, ప్రతీ పాపము కాదు లేక దయ్యము కలిగించే ప్రతీ సమస్యను గద్దించాల్సిన అవసరత ఎంతైనా వుంది.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


ఆత్మీయ పోరాటమును గూర్చి బైబిలు ఏమని భోదిస్తుంది?