ఆత్మీయ అభివృద్ధి అంటే ఏమిటి?


ప్రశ్న: ఆత్మీయ అభివృద్ధి అంటే ఏమిటి?

జవాబు:
ఆత్మీయ అభివృద్ధి అనేది యేసుక్రీస్తు వలే మరిఎక్కువగా మారే ప్రక్రియ. మనము మన విశ్వాసమును యేసులో ఉంచినప్పుడు, పరిశుద్ధాత్మ ఆయన వలే మనలను తయారుచేయుటకు, ఆయన రూపములోనికి మనలను తెచ్చు ప్రక్రియను ఆరంభించును. ఆత్మీయ అభివృద్ధి బాగుగా 2 పేతురు 1:3-8లో వర్ణించబడెను, అది మనకు దేవుని శక్తిచే “మనకు అవసరమైనవన్నియు” ఆత్మీయ అభివృద్ధికి గమ్యమైన, దైవభక్తి గల జీవితమును జీవించడానికి మనకు ఉండెనని చెప్పును. మనకు అవసరమైనవి “దేవుని గూర్చిన జ్ఞానమును బట్టి” వచ్చునని, అది మనకు కావలసిన వాటినన్నిటిని పొందుటకు తాళం అని మనం గుర్తించాలి. ఆయన గూర్చిన జ్ఞానము వాక్యము ద్వారా వచ్చి, మన క్షేమాభివృద్ధికి మరియు వృద్ధిపొందుటకు ఇవ్వబడెను.

గలతీ. 5:19-23లో రెండు జాబితాలు ఉండెను. వచనములు 19-21 “శరీర క్రియల” జాబితా ఇచ్చును. ఇవి క్రీస్తు నొద్దకు రక్షణ కొరకు రాకముందు మన జీవితాలలో గుర్తించబడినవి. శరీర క్రియలనగా మనము ఒప్పుకొని, పశ్చాత్తాపపడి, మరియు దేవుని సహాయముతో అధిగమించే క్రియలు. మనము ఆత్మీయ అభివృద్ధిని అనుభవిస్తుండగా, “శరీర క్రియలు” కొద్ది కొద్దిగా మన జీవితాలలో స్పష్టమగును. రెండవ జాబితా “ఆత్మీయ ఫలాలు” (వచనములు 22-23). యేసుక్రీస్తులో రక్షణ అనుభవించిన తర్వాత మన జీవితాలలో ఇవి లక్షణాలుగా ఉండాలి. ఆత్మీయ అభివృద్ధి ఒక విశ్వాసి జీవితంలో ఆత్మీయ ఫలాలు స్పష్టముగా పెరుగుతూ ఉండడం ద్వారా గుర్తించబడును.

రక్షణ అనే రూపాంతరము జరిగినప్పుడు, ఆత్మీయ అభివృద్ధి ప్రారంభమగును. పరిశుద్ధాత్మ మనలో నివాసము చేయును (యోహాను 14:16-17). క్రీస్తులో మనము నూతన సృష్టి (2 కొరింథీ 5:17). క్రీస్తు వంటి స్వభావమునకు, పాత, పాప స్వభావము క్రొత్త వాటికి మార్గము ఇచ్చును (రోమా 6-7). ఆత్మీయ అభివృద్ధి అనేది దేవుని వాక్యముపై మన ధ్యానము మరియు అన్వయముపై (2 తిమోతి 3:16-17) మరియు ఆత్మలో మన నడకపై (గలతీ 5:16-26) ఆధారపడిన ఒక జీవితకాల ప్రక్రియ. మనము ఆత్మీయ వృద్ధిని వెదుకుచుండగా, ఆయన మనము వృద్ధిచెందాలని కోరుకొనే ప్రాంతాలను గూర్చి జ్ఞానముకై దేవుని ప్రార్థించాలి. మనము మన విశ్వాసం మరియు ఆయన గూర్చిన జ్ఞానము అభివృద్ధి చేయుమని దేవునిని అడుగవచ్చు. దేవుడు మనము ఆత్మీయంగా ఎదగాలని కోరుచుండెను, మరియు ఆత్మీయ వృద్ధిని అనుభవించుటకు మనకు కావలసినవన్నియు ఆయన ఇచ్చెను. పరిశుద్దాత్మ సహాయముతో, మనము పాపమును జయించి మరియు మన రక్షకుడైన, ప్రభువైన యేసుక్రీస్తు వలే స్థిరముగా మరిఎక్కువగా మారుదుము.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
ఆత్మీయ అభివృద్ధి అంటే ఏమిటి?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి