క్రైస్తవ వివాహ దంపతులు లైంగికంగా చేయతగినవి/చేయతగనివి ఏవి?


ప్రశ్న: క్రైస్తవ వివాహ దంపతులు లైంగికంగా చేయతగినవి/చేయతగనివి ఏవి?

జవాబు:
“వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును” అని బైబిల్ చెప్తుంది (హెబ్రీ. 13:4). లైంగికంగా భార్య భర్తలు ఏమి చేయుటకు అనుమతించబడ్డారు మరియు ఏమి చేయుటకు అనుమతించబడలేదు అని వాక్యం ఎప్పుడూ కూడా చెప్పాడు.“కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి” అని భార్యాభర్తలు హెచ్చరింపబడ్డారు (1 కొరింథీ. 7:5a). వివాహంలో లైంగిక సంబంధాల విషయమైన సూత్రాలను బహుశా ఈ వచనము నిర్దేశిస్తుంది. ఏదిజరిగినను, పరస్పర అంగీకారంపై జరగాలి. అతడు/ఆమెకు అసౌకర్యంగా ఉన్నప్పుడు లేదా తప్పు అని అనుకొన్నప్పుడుదానిని చేయమని ప్రోత్సహించడం లేదా నిర్బంధితం చేయకూడదు. ఒకవేళ భార్యాభర్తలు పరస్పర అంగీకారంపై దేనినైనా ప్రయత్నించాలి అనుకొంటే (ఉదా., అస్యమైథునము, వివిధ స్థానాల్లో, సెక్స్ (సెక్స్) బొమ్మలు, మొదలగునవి.), వారు ఎందుకు చేయకూడదో బైబిల్ ఏ కారణమునూ ఇవ్వదు.

వివాహ దంపతులకు లైంగిక పరంగా అనుమతించని కొన్ని విషయాలు ఉన్నవి. “ఇచ్చిపుచ్చుకోవడం” లేదా “అదనంగా తీసుకురావడం” (ముగ్గురు, నలుగురు వ్యకక్తులు మొదలైనవి.) వంటివి చేయడం కఠోర వ్యభిచారం (గలతీ. 5:19; ఎఫెసీ. 5:3; కొలస్సీ. 3:5; 1 థెస్స. 4:3). మీ భర్త అనుమతించిన, ఆమోదించిన, లేదా దానిలో పాల్గొన్నా వ్యభిచారం అనేది పాపం. “శరీరాశయు నేత్రాశను” (1 యోహా. 2:16) అశ్లీత చిత్రములు నివేదిస్తాయి కాబట్టి దేవుని చేత కూడా ఖండించబడ్డాయి. భార్యాభర్తలు వారి లైంగిక సంబంధంలోకి అశ్లీత చిత్రములను తీసుకురాకూడదు. ఈ రెండు విషయాలను మినహాయించి, భార్యాభర్తలిరువురు ఒకరినొకరు ఎడబాయుటను వాక్యము నిరాకరించదు.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
క్రైస్తవ వివాహ దంపతులు లైంగికంగా చేయతగినవి/చేయతగనివి ఏవి?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి