settings icon
share icon
ప్రశ్న

సంఘము ఎత్తబడుట అనగానేమి?

జవాబు


ఎత్తబడుట అనే పదము పరిశుద్ధ గ్రంధములో మనకు కనబడదు. ఈ పదము “మోయబడుట, రవాణా చేయబడుత, లేదా పట్టుకొని వెళ్లిపోబడుట” అను అర్థములనిచ్చు లాటిన్ పదము నుండి తీసుకొనబడింది. “మోయబడుట” అను భావన లేదా సంఘము ఎత్తబడుట అనునవి లేఖనములలో చాలా స్పష్టముగా బోధించబడినవి.

సంఘము ఎత్తబడుట అనునది శ్రమల కాలములో ఈ భూమిపై దేవుడు క్రుమ్మరించబోయే నీతిగల తీర్పునకు దారితీయులాగున ఈ భువిపై నుండి విశ్వాసులందరినీ దేవుడు “పట్టుకొని వెళ్ళిపోయే” ఒక సంఘటనను సూచిస్తుంది. ఈ ఎత్తబడుట అనునది ప్రధానంగా 1 థెస్సలొనీకయులకు 4:13-18 మరియు 1 కొరింథీయులకు 15:50-54 వచనములలో వివరించబడింది. చనిపోయిన విశ్వాసులందరికి దేవుడు పునరుత్థానమును అనుగ్రహించి, వారికి ఆ సమయములోనే మహిమా శరీరములను కూడా దయచేస్తాడు. “ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము” (1 థెస్స. 4:16-17).

మనము నిత్యత్వమునకు సరిపడులాగున మన శరీరములు అకస్మాత్తుగా రూపాంతరము చెడుట ఈ ఎత్తబడుటలో భాగము. “. . . ఆయన (క్రీస్తు) ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము” (1 యోహాను3:2). ఈ ఎత్తబడుటను రెండవ రాకడ నుండి కొంచెం విబేధించి చూడాలి. ఎత్తబడుటలో, ప్రభువు మనలను “మధ్యాకాశములో” ఎదుర్కొనుటకు “మేఘముల మీద” వచ్చును (1 థెస్స. 4:17). రెండావ రాకడలో, ప్రభువు ఒలీవ కొండపై నిలిచుండటానికి భూలోకము వరకు దిగి వస్తాడు, మరియు దీని తరువాత గొప్ప భూకంపమును మరియు దేవుని శత్రువుల అపజయమును ఉందును (జెకర్యా 14:3-4).

ఎత్తబడుటను గూర్చిన సిద్ధాంతము పాతనిబంధనలో బోధింపబడలేదు, అందుకనే పౌలు దీనిని “మర్మము” అని బయలుపరుస్తున్నాడు: “ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము” (1 కొరింథీ. 15:51-52).

మనందరమూ ఆశతో ఎదురుచూడవలసిన ఒక మహిమాయుక్తమైన సంఘటన ఈ ఎత్తబడుట అనునది. మనము ఆఖరుకు పాపవిముక్తులమై ఉంటాము. నిత్యమూ దేవుని సన్నిధిలో మనము ఉంటాము. ఈ ఎత్తబడును గూర్చిన అర్థము మరియు దాని పరిణామములను గూర్చి చాలా వివాదము కొనసాగుతుంది. ఇది దేవుని ఆలోచన అయితే కాదు. కాని, ఈ ఎత్తబడుట అనునది నిరీక్షణతో నిండుకొనిన ఒక ఆదరణకరమైన సిద్ధాంతముగా ఉండాలి; “ఈ మాటలచేత ఒకరినొకరు ఆదరించు”కోవాలని దేవుడు ఆశిస్తున్నాడు (1 థెస్స. 4:18).

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

సంఘము ఎత్తబడుట అనగానేమి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries