శ్రమలకాలము సంభంధించిన ఎత్తబడుట ఎప్పుడు జరుగును?ప్రశ్న: శ్రమలకాలము సంభంధించిన ఎత్తబడుట ఎప్పుడు జరుగును?

జవాబు:
శ్రమలకాలము సంభంధించిన ఎత్తబడుట వ్యవధి విషయము ఈ దినాలలో చాలా వివాదాస్పదమైనది. ప్రాధానమైన మూడు ధృక్పధాలు పూర్వ శ్రమలకాలము ( అంటే ఎత్తబడుట శ్రమలకాలము ముందు జరుగును), మధ్యమ శ్రమలకాలము (అంటే ఎత్తబడుట శ్రమలకాలము మధ్యలో జరుగును) మరియు పూర్వాంతరా శ్రమలకాలము (శ్రమలకాలము తర్వాత ఎత్తబడుట). నాల్గవ దృక్పధము, సామాన్యముగా దానిని పూర్వోత్తర ఉగ్రత అంటారు, ఇది కొద్దిగా మధ్యాంతర శ్రమలకామునుండి పరిణామము చెందినది.

మొదటిగా, శ్రమలకాలపు ఉద్దేశ్యమును గుర్తించుట ప్రాముఖ్యమైనది. దానియేలు 9:27 ప్రకారము, డెబ్బది "ఏడు" ( ఏడేండ్లు) ఇంకా రావాల్సి వుంది. దానియేలు మొత్తం డెబ్బైయేడును గూర్చిన ప్రవచనము (దానియేలు 9:27) ఇది ఇశ్రాయేలు దేశమునుగూర్చి ప్రస్తావిస్తుంది. ఈ సమయము ఇశ్రాయేలీయులమీద ప్రత్యేకంగా దేవుడు కనుదృష్ఠిపెట్టినాడు. డెబ్బై ఏడు, శ్రమలకాలము, అదే సమయములో విశేషముగా ఇశ్రాయేలీయుఅలతో దేవుడు వ్య్వహరించిన సమయం. ఇదేమి తప్పనిసరిగ్గా సంఘము ఆక్కడ లేదు అని సూచించుటలేదు, గాని అది ఒక ప్రశ్నను తలెత్తుతుంది ఎందుకని సంఘము ఈ భూమిమీద ఆ సమయములో ఉండాలీ.

ఎత్తబడుటను గూర్చిన ప్రాధమికమైన లేఖనభాగము 1 థెస్సలోనీకయులకు 4:13-18 లో వున్నది. అక్కడ చెప్పేదేంటంటే విశ్వాసులందరు, మరణించిన విశ్వాసులతో పాటు, మధ్యాకాశములో ప్రభువైన యేసును కలిసి మరియు అయనతో ఎల్లపుడు నివసించెదరు. ఎత్తబడుట అనేది దేవుడు తన ప్రజలను తోడ్కొనిపోయే సన్నివేశము. తరువాతి కొన్ని వచనములు, 1 థెస్సలోనికయులకు 5:9లో, పౌలు చెప్తున్నాడు, " ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు." ప్రకటన గ్రంధం, ప్రాధమికంగా శ్రమలకాలములో వ్యవధి గురించి చెప్తుంది, ప్రవక్తల సందేశమేంటంటే దేవుడు ఏ రీతిగా శ్రమల కాలమునందు తన ఉగ్రతను భూమిమీద కుమ్మరింపును గురించి చెప్తుంది.. విశ్వాసులను ఉగ్రతకు గురిచేయనని దేవుడు ఏమి అసంగతముగా వాగ్ధానము చేసినట్లు కనబడుటలేదు మరియు వారిని శ్రమలకాలమునందు కలిగే ఉగ్రతకు గురిచేసి వారిని విడిచి పెడ్తానని చెప్పలేదు. వాస్తావానికి త్వరలోనే క్రైస్తవులను ఉగ్రతనుండి విమోచనకలిగించునని దేవుడు వాగ్ధానము చేసెను. మరియు తన ప్రజలను భూమిమీదనుండి తీసివేసి ఈ రెండు సంఘటనలను పొందుపరచినట్లు చూపిస్తుంది.

ఎత్తబడుట గురించి మరొక అతికష్ఠమైన పాఠ్యభాగము ప్రకటన 3:10లో వుంది, అందులో క్రీస్తు భూనివాసులను శోధించుటకు రాబోవు "శోధనకాలములో" విశ్వాసులనందరిని కాపాడెదను అని వాగ్ధానముచేసెను. ఇది రెండు అర్థములనివ్వవచ్చును. అయితే క్రీస్తు పరిశుధ్దులను శోదనలగుండా వెళ్ళునపుడు వారిని కాపాడును , లేక వారు శోధనలనుండి బయటకువచ్చుటకు వారిని తోడ్పడును. గ్రీకు అర్థం చూచినట్లయితే "నుండి" అనే పదమును తర్జుమాచేసినపుడు రెండర్థములు సరియైనవే అన్నట్లు కనబడును. ఏదిఏమైనా, విశ్వాసులు ముఖ్యముగా ఙ్ఞప్తికి తెచ్చుకోవాల్సినదేంటంటే దేవుడు దేనినుండి కాపడతానని వాగ్ధానమును చేసాడో. అది ఒక పరీక్ష మాత్రమే కాదు, గాని అది శోధన "కాలం." క్రీస్తు విశ్వాసులను శోదనలగుండా వెళ్ళునపుడు వారిని కాపాడతానని వాగ్ధానము చేయటం, దానినే శ్రమలకాలమని అంటారు. శ్రమలకాలపు ఉద్డేశ్యము, ఎత్తబడుట ఉద్డేశ్యము, 1 థెస్సలోనికయులకు 5:9 అర్థం, ప్రకటన 3:10 దాని భాష్యం, అన్ని ఖచ్చితంగా పూర్వాంతర శ్రమలకాలమును గూర్చిన స్థితిని చూపిస్తున్నాయి. ఒకవేళ బైబిలును ఉన్నదున్నట్లుగా మరియు అనుగుణంగా తర్జుమా చేసినట్లయితే, పూర్వాంతర శ్రమలకాలపు స్థితియే బైబిలు ఆధారమైన భాష్యం అని చెప్పవచ్చు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


శ్రమలకాలము సంభంధించిన ఎత్తబడుట ఎప్పుడు జరుగును?