జీవిత ఉద్దేశమును కనుగొనుటను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?


ప్రశ్న: జీవిత ఉద్దేశమును కనుగొనుటను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

జవాబు:
మన జీవిత ఉద్దేశము ఎలా ఉండాలో బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన పురుషులు జీవిత లక్ష్యం కొరకు ఎదురుచూచి కనుగొన్నారు. జ్ఞానవంతుడైన సొలొమోను ఈ లోకము కొరకు బ్రతికినప్పుడు జీవితం అనేది వ్యర్థమని గ్రహించాడు. ప్రసంగి పుస్తకము ముగింపులో ఆయన ఈ మాటలను ఇచ్చాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదేగాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును” (ప్రసంగి 12:12-14). జీవితమంటే మన ఆలోచనలతో మరియు జీవితాలతో దేవునిని గౌరవించుటయే మరియు తద్వారా ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఒకరోజు తీర్పులో ఆయన యెదుట మనము నిలుతము. మన జీవితంలో సగ భాగమంతా దేవునికి భయపడుట మరియు ఆయనకు విధేయత చూపుట.

మరొక భాగం ఏంటంటే ఈ లోకంలో మన జీవితంపై దృష్టి పెట్టుట. ఈ జీవితంపై దృష్టి పెట్టేవారికి వ్యతిరేకంగా రాజైన దావీదు రాబోయే కాలంలో వచ్చు తృప్తి కొరకు ఎదురుచూసాడు. ఆయన ఇలా చెప్పాడు “నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును” (కీర్తనలు 17:15). దావీదు తాను దేవుని ముఖదర్శనము చేసి (ఆయనతో సహవాసము కలిగి) మరియు ఆయన స్వరూపదర్శనమును (1 యోహాను 3:2) చేసుకొనుటకు లేచినప్పుడు పరిపూర్ణ తృప్తి కలుగుతుంది.

కీర్తనలు 73లో, పట్టించుకొనే స్వభావం లేకుండ మరియు ప్రయోజనమును కోరుకునే వారి యొక్క వెనుక తమ అదృష్టాన్ని నిర్మించుకునే దుష్టుల పట్ల అసూయ కలుగుటను గూర్చి ఆసాపు మాట్లాడెను, కానీ వారి అంతము గూర్చి కూడా చెప్పెను. వారు చూచిన దానికి విరుద్ధంగా, వచనము 25లో ఆయనకు ముఖ్యమైనది చెప్పాడు: “ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు.” జీవితంలో అన్నిటికంటే దేవునితో సంబంధము ఆసాపుకు ముఖ్యమైనది. అటువంటి సంబంధం లేకుండా జీవితంలో నిజమైన లక్ష్యం లేదు.

పునరుద్ధాన క్రీస్తు దర్శనము అపొస్తలుడైన పౌలుకు కలుగక మునుపు ఆయన ధార్మికంగా తాను సంపాదించిన విజయాలను గూర్చి చెప్పి, మరియు క్రీస్తు యేసును ఎరుగుట యొక్క శ్రేష్టతతో పోలిస్తే అవన్నీ పెంట కుప్పతో సమానం అని చెప్పాడు. ఫిలిప్పీ 3:9-10లో, ధర్మశాస్త్రమూలమైన ఆయన నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతిగా అగుపడుటకు, మరణమైన శ్రమయైనను సరే. పౌలు లక్ష్యం ఏంటంటే క్రీస్తును తెలిసుకొని, ఆయనయందు విశ్వాసముంచుటద్వార పొందుకొనే నీతిని కలిగి ఆయనయందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించువారందరు హింసపొందుదురు (2 తిమోతి 3:12). చివరగా,“మృతులలో నుండి తిరిగి లేచినవారితో” కలసియుండు సమయము కొరకు ఎదురుచూచెను.

దేవుడు మొదటిగా మానవుని చేసినప్పుడు, మన జీవిత లక్ష్యం ఏంటంటే 1) దేవునిని మహిమపరచి మరియు ఆయనతో సహవాసమును కలిగియుండుటకు, 2) ఇతరులతో మంచి సంబంధం కలిగియుండాలి, 3) పని, మరియు 4) భూమిని యేలుట. కానీ మానవుడు పాపంలో పడిపోయినప్పుడు, దేవునితో సంబంధం తెగిపోయెను, ఇతరులతో సహవాసం తెగిపోయెను, పని ఎల్లప్పుడును విసుగగా ఉంటుంది, మరియు సృష్టిపై అధికారమును సమానంగా నిర్వహించడానికి పోరాటపడుతున్నాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసము చేత దేవునితో సహవాసమును తిరిగి కట్టుకొనుట ద్వారానే జీవిత లక్ష్యముమును తిరిగి కనుగొనగలుగుతాము.

మానవుని లక్ష్యం దేవునిని మహిమపరచి మరియు ఆయనతో ఎల్లప్పుడు ఆనందించడం. దేవునికి భయపడుట ద్వార మరియు ఆయనకు లోబడుట ద్వారా, మన భవిష్యత్తు గృహమైన పరలోకంపై మన కనులను కేంద్రీకరించుట ద్వార మరియు ఆయనతో సన్నిహితంగా ఉండుట ద్వారానే దేవునిని మనం మహిమపరచగలం. మన జీవితంలో దేవుని లక్ష్యాలను అనుసరించుట ద్వార మనం ఆనందించగలం, ఇది నిజమైన మరియు నిత్యముండే ఆనందమును అనుభవించుటకు తోడ్పడుతుంది అదేదనగా – మన పట్ల ఆయన కోరుకునే సమృద్ధి జీవం.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
జీవిత ఉద్దేశమును కనుగొనుటను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?