పూర్వవెయ్యేండ్లపరిపాలన అంటే ఏంటి?ప్రశ్న: పూర్వవెయ్యేండ్లపరిపాలన అంటే ఏంటి?

జవాబు:
పూర్వవెయ్యేండ్లపరిపాలన అనేది క్రీస్తు రెండవరాకడ సమయంలో వెయ్యేండ్ల రాజ్యపరిపాలనకు ముందు కన్పడేది, మరియు వెయ్యేండ్ల పరిపాలన అనేది ఖఛ్చితమైన 1000- సంవత్సరాల క్రీస్తు భూమిమీద పరిపాలనయే. అంత్యకాలపు దినాలగురించిన సన్నివేశాల విషయమై లేఖనములోని పాఠ్యభాగాలను బాగుగా అర్థంచేసుకొనుటకు గాను మరియు భాష్యంచెప్పటానికి, అక్కడ రెండు విషయాలను ముఖ్యముగా అర్థం చేసుకోవాలి: ఇశ్రాయేలీయులకు (యూదులు) మరియు సంఘము (యేసుక్రీస్తునందు, శరీరము అనే విశ్వాసులందరి) మధ్య తారతమ్యమును యోగ్యమైన పద్దతిలో లేఖనాలను భాష్యంచెప్పటం.

మొదటిది, లేఖనములను సరియైన పద్దతిలో భాష్యంచెప్పుటకు కావల్సింది లేఖనములు దాని సంధర్భముతో అనుగుణ్యముగా ఉండునట్లు భాష్యంచెప్పలి. దీని అర్థం ఈ పాఠ్యభాగమునునకు భాష్యంచెప్పల్సినరీతి అది ఆకాలములో పాఠ్యభాగస్థులకు ఎవరికొరకైతే వ్రాయబడిందో, దేని గురించి , ఎవరిద్వారా, ఎవరిద్వారా వ్రాయబడిందో ఇంకా మొదలగునవి దృష్ఠీకరిస్తూ వారికి అనుగుణ్యముగా ఉండునట్లు భాష్యంచెప్పలి. రచయిత ఎవరు అనేది కొంచెం కుశలమైనప్పటికి, పాఠ్యభాగస్థులను దృష్ఠీకరిస్తూ, మరియు ఒక పాఠ్యాభాగాన్ని ఒకడు వెనుకటి చరిత్రను బట్టి చారిత్రాత్మకంగా భాష్యంచెప్పవచ్చు. చారిత్రాత్మకంగా మరియు సంస్కృతిక పరిస్థితిలో తరచుగా పాఠ్యభాగము యొక్క అర్థం ప్రత్యక్షపరచబడుతుంది. ఙ్ఞప్తిలోకి తెచ్చుకోవాల్సిన చాల ప్రాముఖ్యమైనది ఏంటంటే లేఖనములు లేఖనములతోనే భాష్యంచెప్పుతుంది. అంటే, తరచుగా ఒక పాఠ్యభాగము సాధరణముగా బైబిలులో ఎక్కడో చర్చించిన ఒక అంశాన్నో లేక విషయాన్నో వివరిస్తుంది. చాల ప్రాముఖ్యమైనది పాఠ్యభాగములన్నిటిని ఒకదానితో పొందుపరచినట్లు అనుగుణ్యంగా భాష్యంచెప్పటం.

చివరిగా, మరి ముఖ్యముగా, పాఠ్యభాగమును ఎప్పుడు వాటిని సహజముగా, నియమముగానున్నట్లు, సాపైనరీతిలో, ఉన్నదున్నట్లుగా అర్థం తిసుకోకపోతే ఆ పాఠ్యభాగము అది ఏదో ఉపమానవిశిష్టములోనున్నట్లు దాని స్వభావము కన్పడుతున్నట్లు సూచించును. ఉన్నదున్నట్లుగా భాష్యంచెప్పుతున్నప్పుడు ఉపమానవిశిష్టములోనున్నట్లు చెప్పకుండా ఉండటం అది సాధ్యమైనదికాదు. మనఃపూర్వకముగా, అది పాఠ్యభాగములోని అర్థంను ఉపమానమైన రీతిలో భాషను చదవకుండా, సంధర్భమునకు అది రూఢియైనది అని గమనిస్తేనేగాని భాష్యంచెప్పే వారిని ప్రోత్సాహించును. చాల కుశలమైనదేటంటే అక్కడ ఉన్నదనికంటే ఎన్నడూ "లోతైన, ఇంకా ఆత్మీయమిన" అర్థంను కొరకు వెదకకూడదు. ఒక పాఠ్యభాగమునకు అత్మీయతను జోడించినట్లైతే అది అపాయకరమైనది ఎందుకంటే లేఖనములనుండి ఖఛ్చితమైన భాష్యాన్ని ఆధారముచేసుకొని దానిని చదువరి మనస్సుకు దోహదపడుతుంది. తరువాత, మరి ఎలాంటి విశేషమైన జీవన ప్రమాణములకు అంతు లేదు, దానికి బదులు, ఒక వ్యక్తి తనకున్న లేఖనములలో ఏదైతే అర్థాన్ని గ్రహిస్తాడో అదే తనకున్న చిహ్ననికే లోబడుతాడు. రెండవ పేతురు 1:20-21 ఙ్ఞాపకము చేస్తుంది "ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇఛ్చనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుధ్దాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి.

బైబిలుపరమైన భాష్యం యొక్క సూత్రాలను జీవితానికి వర్తించినట్లైయితే, అది తప్పక ఇశ్ర్హాయేలీయులలోను ( అబ్రాహాము యొక్క శారీరక సంతానము) మరియు సంఘము ( అందరు నూతన విశ్వాసులు) వీరు రెండు భిన్నమైన గుంపులుగా నున్నారు. ఇశ్రాయేలీయులలోను మరియు సంఘము వీరు రెండు భిన్నమైన గుంపులని గుర్తించటం చాల కుశలమైనది, ఒకవేళ ఇది తప్పుగా అర్థంచేసుకున్నట్లయితే, లేఖనములు తప్పుగా భాష్యంచెప్తారు. ప్రత్యేకముగా ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్ధానములను (రెండును నెరవేర్చబడినవి మరియు నెరెవేర్చబడబోవునవి)తప్పుగా అర్థంచేసుకోవడానికి ఇఛ్చయించటం . అలాంటి వాగ్ధానములు సంఘమునకు వ్యక్తీకరించకూడదు. ఙ్ఞాపకముంచుకోండి, పాఠ్యభాగము యొక్క సంధర్భమున్ను నిశ్చయించుతుంది అది ఎవరికి రాయబడిందో మరియు అది సరియైన భాష్యంచెప్పడానికి దోహదపడుతుంది.

ఈ తలంపులను మనస్సులో ఉంచుకొని, మనము లేఖనములోని అనేక వేర్వేరు పాఠ్యభాగములు ఏవైతే పూర్వవెయ్యేండ్ల పరిపాలన దృక్పధమును చూపిస్తాయో వాటిని చూడవలెను. ఆదికాండం 12:1-3 " యెహోవా 'నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులనుండియు నీ తండ్రి ఇంటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును; నీవు ఆశీర్వదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువానిని శపించెదను; భూమియొక్క సమస్త వంశములు నీయమ్ధు ఆశీర్వదించబ్డునని' అబ్రాముతో అనగా."

దేవుడు అబ్రాముతో మూడు విషయములను వాగ్ధానము: అబ్రాహాముకు చాలమంది సంతానము ఉండి ఉండేవచ్చు, ఈ దేశము దానికదే భూమిని స్వతత్రించుకొని మరియు దానిని స్వాధీనపరచుకొనియుండెదరు, మరియు ఆ సార్వత్రిక ఆశీర్వాదము అబ్రాహాము సంతతినుండి ఉధ్భవించిన మానవజాతికంతటికి (యూదులకు) వచ్చును. ఆదికాండములో 15:9-17, దేవుడు అబ్రాహాముతో తన నిబంధను ఆమోదించెను. ఇలాగు చేయుటవలన దేవుడే నిబంధనకు సంభంధించిన మొత్తం భాధ్యతనంతా తనపైవేసుకొనెను. అది,అబ్రాహాము చేయవలసినది ఏమిలేదు లేక చేయకపోవటము వలన దేవుడు తనతో చేసిన నిబందనను కోల్పోవచ్చును. ఇంకా ఈ పాఠ్యభాగములో, యూదులు ఖఛ్చితముగా కడకు స్వాధీనపరచుకొంటారని భూమికి సరిహద్దులు నియమించెను. సరిహద్దుల జాబితాను చూచినట్లయితే, ద్వితీయోపదేశకాండం 34ను చూడండి. ఇతర పాఠ్యభాగాలు భూమిని గూర్చిన వాగ్ధానములుఅన్నియు ద్వితీయోపదేశకాండం 30:3-5 మరియు యెహెజ్కేలు 20:42-44.

2 వ సమూయేలు 7:10-17, రాజైన దావీదుకు చేసిన వాగ్ధానమును చూడవచ్చు. ఇక్కడ, దేవుడు దావీదుకు వాగ్ధానము చేసెను తనకు సంతాననుమును నిచ్చెదనని, ఆ సంతాననుమునుండియే దేవుడు తన నిత్యమైన రాజ్యమును స్థాపించును. ఇది క్రీస్తు యొక్క వేయ్యేండ్ల పరిపాలనను మరియు నిరంతరము పరిపాలించే దానిని సూచిస్తుంది. మనస్సులో చాలా ప్రాముఖ్యముగా ఙ్ఞాపకముంచుకోవాల్సింది వాగ్ధానము ఇంకా ఉన్నదున్నట్లుగా నెరవేర్చబడవలసిఉన్నది మరియు ఇంకను అది జరగలేదు. సొలొమోను పరిపాలించినపుడు ఉన్నదున్నట్టుగా ప్రవచనము నెరవేర్చబడినదని కొంతమంది నమ్ముతారు, గాని దానితో ఒక సమస్య ఉన్నది. సొలొమోను పరిపాలించిన రాజ్యముపైన అధిపత్యము ఈ దినము ఇశ్రాయేలీయులకు లేదు, సొలొమోనుకు కూడ ఇశ్రాయేలీయులపైన అధిపత్యము లేదు. ఙ్ఞప్తిలోకి తెచ్చుకోండి దేవుడు అబ్రాహాముతో తన సంతానమంతయు భూమిని ఎల్లపుడూ స్వాధీనపరచుకొంటారన్న వాగ్ధానము చేసెను. ఇంకా, 2 సమూయేలు 7 చెప్తున్నది దేవుడు తన రాజును స్థాపించునని అతడు నిరంతరము రాజ్య పరిపాలన చేయునని చెప్పెను. సొలొమోను దావీదుకు చేసిన వాగ్ధానమునకు నెరవేర్పు కాదు. అందుచేత, ఈ వాగ్ధానము ఇంకా నెరవేర్చబడవలసి ఉన్నది.

ఇప్పుడు, వీటన్నిటిని మనస్సులో దృష్ఠిలోనుంచుకొని, ప్రకటన 20:1-7 ను పరీక్షించండి. తరచుగా ఇక్కడ ప్రశంసించిన ఒక వెయ్యె సంవత్సరములు ఎల్లప్పుడు క్రీస్తు భూమిమీద పరిపాలించే నిజమైన వేయ్యేండ్ల పరిపాలనను గుర్తిస్తుంది. దావీదుకు దేవుడు రాజుగా యధార్థముగా పరిపాలిస్తాడని చేసిన వాగ్ధానమును ఒక సారి ఙ్ఞప్తిలోకితెచ్చుకొనండి మరియు అది ఇంకా ఆ క్రియ జరగలేదు. పూర్వవెయ్యేండ్లపరిపాలన విషయము వివరించే ఈ పాఠ్యభాగము భవిష్యత్తులొ క్రీస్తు సింహాసనముమీద కూర్చుండి పరిపలిస్తాడనే వాగ్ధానమును సూచిస్తుంది. అబ్రాహాము మరియు దావిదులతో దేవుడు షరతులులేని నిబంధనను చేసెను. ఏఒక్క నిబంధన కూడా పూర్తిగా లేక శాశ్వతంగా గాని నెరవేర్చబడలేదు. దేవుడు వాగ్ధానమును చేసినట్లు ఉన్నరీతినే, క్రిస్తు శారీరుడుగా వచ్చి పాలిస్తాడనేదే ఒకే ఒక్క నిబంధన ఇంకా నెరెవేర్చబడవలసి ఉన్నది.

లేఖనములను ఉన్నది ఉన్నట్లుగానే భాష్యంచెప్పే పద్దతి ఒక విడికధ అంతయు కలసి దగ్గరకు చేకూర్చినట్లే. పాతనిబంధనలోని యేసు మొదటి రాకడగురించిన ప్రవచనములన్నియు నిజంగా నెరవేర్చబడినవి. అందుచేత, రెండవరాకడగూర్చిన ప్రవచనములన్నియు అదేవిధంగా ఉన్నదున్నట్టుగా నెరవేర్చబడుతాయని మనము ఎదురుచూడవలెను. పూర్వవెయ్యేండ్ల పరిపాలన ఇది ఒక పద్దతి అందులో అంత్యదినమును గురించిన ప్రవచనములు యదాతధంగా భాష్యంచెప్పడన్ని ఒప్పుకుంటుంది.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


పూర్వవెయ్యేండ్లపరిపాలన అంటే ఏంటి?