settings icon
share icon
ప్రశ్న

నా ప్రార్థనలు దేవునిచే ఎలా సమాధానం ఇవ్వబడును?

జవాబు


చాలామంది ప్రజలు ప్రార్థనకు జవాబు అంటే దేవుడు ఆయనకు మనము అర్పించిన విన్నపమును అనుగ్రహించడం అని నమ్మును. ఒకవేళ ఒక ప్రార్థన విన్నపము మంజూరు కాకపోతే, అది ఒక “సమాధనమివ్వబడని” ప్రార్థనగా అర్థము చేసుకోబడును. అయితే, ప్రార్థనకు ఇది ఒక తప్పుడు అవగాహన. దేవుడు ఆయనకు చేయబడిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చును. కొన్నిసార్లు దేవుడు “వద్దు” లేక “ఎదురుచూడు” అని సమాధానమిచ్చును. దేవుడు మనము కేవలం ఆయన చిత్తప్రకారం ప్రార్థిస్తేనే మన ప్రార్థనలను మంజూరు చేయునని వాగ్ధానమిచ్చు చుండెను. “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము” (1 యోహాను 5:14-15).

దేవుని చిత్తానుసారము ప్రార్థించుట అనగా అర్థమేమిటి? దేవుని చిత్తానుసారము ప్రార్థించుట అనగా బైబిలు స్పష్టంగా బహిర్గతం చేసిన దేవుని చిత్తము కొరకు అలాగే దేవుని మహిమ పరిచే మరియు ఘనపరిచే విషయాలను ప్రార్థించుట. ఒకవేళ మనము దేవునికి మహిమ కలిగించనవి మరియు మన జీవితాలకు దేవుని చిత్తము కానివి మనము ప్రార్థిస్తే, దేవుడు మనము అడిగే విషయాలను మనకివ్వడు. దేవుని చిత్తమేమిటో మనము ఎలా తెలిసికొందుము? దేవుడు మనము జ్ఞానమునడిగితే ఇస్తానని మనకు వాగ్దానం చేసెను. యాకోబు 1:5 ప్రకటిస్తూ, “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును.” ప్రారంభించుటకు మంచి స్థానము 1 థెస్సలొనీకయులు 5:12-24, మనపట్ల దేవుని చిత్తానికి సంబంధించిన చాలా విషయాలను చూపును. దేవుని వాక్యము మనకు ఎంతబాగుగా అర్థమగునో, దేని గూర్చి ప్రార్థించాలో మనకు బాగుగా తెలియును (యోహాను 15:7).మనకు ఎంతబాగుగా దేని గూర్చి ప్రార్థించాలో తెలిస్తే, అంత తరచుగా దేవుడు మన విన్నపములకు “అవును” అని సమాధానమిచ్చును.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

నా ప్రార్థనలు దేవునిచే ఎలా సమాధానం ఇవ్వబడును?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries