యేసు నామములో ప్రార్థించుట అనగా అర్థమేమిటి?


ప్రశ్న: యేసు నామములో ప్రార్థించుట అనగా అర్థమేమిటి?

జవాబు:
యోహాను 14:13-14లో యేసు నామములో ప్రార్థించుట నేర్పింపబడెను, “మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినాను నేను చేతును.” కొందరు ఈ వచనమును తప్పు స్థానములో నుంచి, ప్రార్థన చివరిలో“యేసు నామములో” అని చెప్తే మనమేది అడిగితే అది ఎల్లప్పుడు దేవుడు ఫలితంగా ఇచ్చునని ఆలోచించును. ఇది“యేసు నామములో” అనే పదములను తప్పనిసరిగా మాయా సూత్రముగా భావిస్తున్నట్లే. అది ఖచ్చితంగా బైబిలు సంబంధమైనది కాదు.

యేసు నామములో ప్రార్థించుట అనగా ఆయన అధికారముతో ప్రార్థించి మరియు ఆయన కుమారుడైన యేసు నామములో మనము వచ్చియున్నాము గనుక తండ్రియైన దేవునిని మన ప్రార్థనలపై స్పందించమని అడుగుట. యేసు నామములో ప్రార్థించుట అనగా అదే విషయమును దేవుని చిత్తానుసారముగా ప్రార్థించుట, “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము” (1 యోహాను 5:14-15). యేసు నామములో ప్రార్థించుట అనగా యేసుకు మహిమ మరియు ఘనత కలిగించే విషయాలను ప్రార్థించుట.

ప్రార్థన చివరిలో “యేసు నామములో” అని చెప్పడం ఒక మాయా సూత్రము కాదు. ఒకవేళ ప్రార్థనలో మనము చెప్పేది లేక అడిగేది దేవునికి మహిమ మరియు అది దేవుని చిత్తానుసారం కాకపోతే, “యేసు నామములో” అని చెప్పడం అర్థరహితం. ప్రార్థన చివరిలో నిర్దిష్టమైన పదాలను అతకకుండా, యేసు నామములో మరియు ఆయన మహిమ కొరకు స్వచ్చంగా ప్రార్థించుట ముఖ్యము. ప్రార్థనలో పదాలు కాదు ప్రాముఖ్యం, ఆ ప్రార్థన వెనుక ఉద్దేశ్యం.దేవుని చిత్తానికి అంగీకారముగానున్న విషయాలను ప్రార్థించడం యేసు నామంలో ప్రార్థించడం యొక్క సారాంశం.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
యేసు నామములో ప్రార్థించుట అనగా అర్థమేమిటి?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి