settings icon
share icon
ప్రశ్న

అశ్లీల (అసభ్యత) చిత్రములను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

జవాబు


చాలా వరకు, అంతర్జాలంలో (internet) అనేక మంది వెతికే పదాలే అశ్లీల చిత్రాలకు సంబంధించినవి. నేడు ప్రపంచంలో అశ్లీల చిత్రాలు ప్రబలంగా ఉన్నాయి. బహుశా, అన్నిటికంటే కూడా, సాతానుడు వంచుటలో మరియు వక్రీకరణ లైంగిక సంబంధములో విజయం సాధించాడు. అతడు మంచిది మరియు సరైనదానిని (భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం) మోహముతో, అశ్లీల చిత్రాలతో, వ్యభిచారముతో, అత్యాచారముతో, మరియు స్వలింక సంబంధాలతో భర్తీ చేసాడు. అనైతికతను మరియు దుష్టత్వమును అభివృద్ధి చేసే జారే వాలు మీద ప్రధమ మెట్టే అశ్లీల చిత్రాలు (రోమా 6:19). అశ్లీల చిత్రాల యొక్క వ్యసనపరుని స్వభావం చక్కగా చెప్పబడింది. ఏ విధంగానైతే మత్తు పదార్థాలకు బానిసగా నున్నవాడు అదే “ఎత్తును” పొందుకోడానికి మత్తు పదార్థాలను అతిగా ఆస్వాదించుట ఇష్టపడతాడో, అశ్లీల చిత్రాలకు బానిసగా నున్నవ్యక్తిని అది తీవ్రమైన లైంగిక వ్యసనాలకు మరియు చెడ్డ కోరికలకు లోతుగా లాక్కు వెళ్తుంది.

పాపం యొక్క మూడు ప్రథానమైన విభాగాలు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, మరియు జీవపుడంబం (1 యోహాను 2:16). అశ్లీల చిత్రాలు ఖచ్చితంగా నేత్రాశలోకి నడుపుతాది, అది ఖచ్చితంగా నేత్రాశే. ఫిలిప్పీ 4:8 ప్రకారంగా, మనం ఆలోచించే విషయాలను అది అర్హతగా భావించదు. అశ్లీల చిత్రాలు వ్యసనాత్మకమైనవి (1 కొరింథీ 6:12; 2 పేతురు 2:19), మరియు నాశనకరమైనది (సామెతలు 6:25-28; యెహేజ్కేలు 20:30; ఎఫెసీ 4:19). ఇతర వ్యక్తులపై మన ఆలోచనల్లో అభిలాష కలిగి యుండడం అనేది అశ్లీల చిత్రాలకు మూలం అది దేవునికి వ్యతిరేకం (మత్తయి 5:28). అశ్లీల చిత్రాలకు అలవాటు పడడం ఒక వ్యక్తి యొక్క జీవితమును వర్ణిస్తుంది, ఆ వ్యక్తి రక్షించబడలేదని తెలియజేస్తుంది (1 కొరింథీ. 6:9).

అశ్లీల చిత్రాలను చూచుటలో మునిగిపోయిన వాడు, దేవుడు వారికి విజయం ఇస్తాడు మరియు ఇవ్వగలదు. నీవు అశ్లీల చిత్రాలలో మునిగి మరియు వాటినుండి విడుదలను కోరుకుంటున్నారా? ఇక్కడ విజయముకు కొన్ని సూత్రాలు ఉన్నాయి: (1 దేవునికి యెదుట నీ పాపమును ఒప్పుకొనుము (1 యోహాను 1:9). (2 నీ మనసును మార్చుటకు, పవిత్రపరచుటకు, పునరుద్ధరణ చేయమని దేవునిని అడగాలి (రోమా 12:2). 3) ఫిలిప్పీ 4:8లో వాటితో మన మనసు నింపుమని దేవునిని అడగాలి. 4). నీ శరీరము పరిశుద్ధంగా ఉండాలి (1 థెస్స 4:3-4). 5) లైంగిక సంబంధం గురించి ఒక క్రమమైన అర్థానికి వచ్చి మరియు ఆ కోరికను తీర్చుకొనుటకు కేవలం మీ భాగస్వామిపైనే ఆధారపడాలి (1 కొరింథీ 7:1-5). 6). ఒకవేళ నీవు ఆత్మలో నడిస్తే, శరీరాశను నీవు నెరవేర్చలేవని గ్రహించాలి (గలతీ 5:16). 7) గ్రాఫిక్ చిత్రాలపై మన మనసు ఎక్కువగా వెళ్లకుండా కొన్ని ఆచరణాత్మక పద్ధతులు పాటించాలి. మీ గణక యంత్రంలో (computer) అశ్లీల చిత్రాల నిరోధకమును ఏర్పాటు చేయాలి, టి.వి తక్కువగా చూడాలి, మరియు వీదియోలి తక్కువగా ఉపయోగించాలి, మరియు నీ కొరకు ప్రార్థన చేసే లెక్క అప్పగించుటలో నీకు సహాయము చేయు వేరే క్రైస్తవుని వెతకాలి.

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

అశ్లీల (అసభ్యత) చిత్రములను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries