settings icon
share icon
ప్రశ్న

పెంపుడు జంతువులు/జంతువులు పరలోకం వెళ్తాయా? పెంపుడు జంతువులకు/జంతువులకు ఆత్మ ఉంటుందా?

జవాబు


పెంపుడు జంతువులకు/జంతువులకు “ఆత్మలు” ఉంటాయా లేదా లేక అవి పరలోకమునకు వెళ్తాయా అను విషయమును గూర్చి బైబిల్ స్పష్టంగా ఏమి బోధించదు. అయినా, ఈ అంశమును గూర్చి కొంత అవగాహన పొందుటకు మనం సామాన్య బైబిల్ నియమాలను ఉపయోగించవచ్చు. మానవులకు (ఆది. 2:7) మరియు జంతువులకు (ఆది. 1:30; 6:17; 7:15, 22) “జీవ వాయువు” ఉందని బైబిల్ చెబుతుంది; మానవులకు మరియు జంతువులకు మధ్య ఉన్న ప్రాథమిక తేడా ఏమిటంటే మానవులు దేవుని రూపంలో చేయబడ్డారు (ఆది. 1:26-27), జంతువులు చేయబడలేదు. దేవుని రూపులో మరియు పోలికలో చేయబడుట అంటే మానవులు దేవుని వలె ఉన్నారు, ఆత్మీయత శక్తి కలిగియున్నారు, మనస్సు, భావాలు కలిగియున్నారు మరియు మరణం తరువాత కొనసాగే భాగం కూడా వారిలో ఉంది. ఒకవేళ పెంపుడు జంతువులు/జంతువులకు “ఆత్మ” ఉంటె, అది కొంత తక్కువ “నాణ్యత” కలిగినది కావచ్చు. ఈ తేడా వలన పెంపుడు జంతువులు/జంతువుల యొక్క “ఆత్మలు” మరణం తరువాత కొనసాగవు.

ఆదికాండములో జంతువులు దేవుని యొక్క క్రియాశీల సృష్టి ప్రక్రియలో భాగమని గమనించుట మరొక విషయం. దేవుడు జంతువులను చేసి అవి మంచివని చెప్పెను (ఆది. 1:25). కాబట్టి, క్రొత్త భూమిపై జంతువులు ఉండవు అనుటకు కారణాలు లేవు (ప్రకటన 21:1). వెయ్యేళ్ళ పరిపాలనలో ఖచ్చితంగా జంతువులు ఉంటాయి (యెషయా 11:6; 65:25). వీటిలో కొన్ని జంతువులు మనం భూమిపై కలిగియున్న పెంపుడు జంతువులు అని నిర్థారించి చెప్పుట అసాధ్యము. దేవుడు నీతిమంతుడని మనకు తెలుసు మరియు మనం పరలోకానికి వెళ్లినప్పుడు ఈ సమస్యను గూర్చి దేవుని నిర్ణయమును గూర్చి, అదే ఏమైనప్పటికీ, మనకు పరిపూర్ణ సమ్మతి తెలుస్తుంది.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

పెంపుడు జంతువులు/జంతువులు పరలోకం వెళ్తాయా? పెంపుడు జంతువులకు/జంతువులకు ఆత్మ ఉంటుందా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries