యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించడం అంటే ఏంటి?


ప్రశ్న: యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించడం అంటే ఏంటి?

జవాబు:
మీరు యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారా? ఈ ప్రశ్నను సరిగా అర్ధం చేసుకోవాలంటే, ముందుగా “యేసు క్రీస్తు,” “వ్యక్తిగత,” మరియు “రక్షకుడు” అను పదములకు గల అర్ధములను ముందు మీరు అర్ధం చేసుకోవాలి.

యేసుక్రీస్తు ఎవరు? చాలా మంది యేసు క్రీస్తును ఒక మంచి మనిషిగా, ఒక గొప్ప బోధకునిగా, లేదా ఒక దేవుని ప్రవక్తగా కూడా గుర్తిస్తారు. యేసును గూర్చిన ఈ విషయములు వాస్తవమే, కాని ఆయన నిజముగా ఎవరో ఈ పదములు పూర్తిగా నిర్వచించలేవు. పరిశుద్ధ గ్రంధము యేసును శరీరధారియైన దేవునిగా చెప్తుంది (యోహాను 1:1, 14 చూడండి). దేవుడు ఈ భూమిపైకి మనకు బోధించుటకు, మనలను స్వస్థపరచుటకు, సరిదిద్దుటకు, క్షమించుటకు – మరియు మనకొరకు మరణించుటకు వచ్చాడు! యేసు క్రీస్తు దేవుడు, సృష్టికర్త, సార్వభౌమత్వము కల ప్రభువు. మీరు యేసును అంగీకరించారా?

రక్షకుడు అంటే ఏంటి, మనకు రక్షకుడు ఎందుకు కావాలి? పరిశుద్ధ గ్రంధము చెప్తుంది మనమందరమూ పాపము చేశాము; మనమందరమూ దుష్ట క్రియలు చేశాము అని (రోమా. 3:10-18). మన పాప కారణముగా, దేవుని కోపము మరియు తీర్పుకు మనము యోగ్యులముగా ఉన్నాము. అనంతమైన మరియు నిత్యమైన దేవునికి విరుద్ధంగా పాపము చేస్తే వచ్చే న్యాయమైన శిక్ష అనంతమైన శిక్ష (రోమా. 6:23; ప్రకటన 20:11-15). అందుకే మనకు రాక్షకుడు అవసరం.

యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి మన స్థానంలో మరణించాడు. మన పాపముల కొరకు యేసు చేసింది అనంతమైన చెల్లింపు (2 కొరింథీ. 5:21). మన పాపముల కొరకైన క్రయధనమును చెల్లించుటకు యేసు మరణించాడు (రోమా. 5:8). మనము చెల్లించనవసరం లేకుండా యేసు వేల చెల్లించాడు. మరణమునుండి యేసు పునరుద్ధానము మన పాపముల యొక్క మూల్యమును చెల్లించుటకు చాలినది. అందుకే యేసు ఒకేఒక్క మరియు ఏకైక రక్షకుడు (యోహాను 14:6; అపొ.కా. 4:12). యేసును మీ రక్షకునిగా నమ్ముతున్నారా?

యేసు మీ “సొంత” రక్షకుడా? చాలా మంది క్రైస్తవ్యాన్ని సంఘమునకు హాజరు కావడం, ఆచారములను చేయడం, మరియు/లేదా కొన్ని పాపములను చేయకుండా ఉండటం అనుకుంటారు. అది క్రైస్తవ్యం కాదు. నిజమైన క్రైస్తవ్యం యేసు క్రీస్తుతో వ్యక్తిగత సంబంధము. యేసును మీ సొంత రక్షకునిగా అంగీకరించడం అంటే మీ వ్యక్తిగత విశ్వాసమును మరియు నమ్మకమును ఆయనపై పెట్టడం. రక్షించబడుటకు గల ఏకైక మార్గము వ్యక్తిగతంగా యేసును నీ రక్షకునిగా అంగీకరించి, మీ పాపములకు ఆయన మరణమును వెలగా నమ్మి మరియు నీకు నిత్యజీవితము రావడానికి ఆయన పునరుత్ధానమును ఆధారముగా విశ్వసించడం (యోహాను 3:16). యేసు వ్యక్తిగతంగా నీ రక్షకుడేనా?

యేసుక్రీస్తును నీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించాలనుకుంటే, ఈ క్రింది దేవుని మాటలను చెప్పండి. గుర్తుంచుకోండి, ఈ ప్రార్ధన చెప్పడమో లేక వేరే ప్రార్ధన చెప్పడము వలననో మీరు రక్షింపబడలేరు. యేసును నమ్మడం మరియు నీ కొరకు ఆయన శిలువపై ముగించిన కార్యమును విశ్వసించడం ద్వారా మాత్రమే మీ పాపము నుండి మిమ్మును కాపాడగలదు. ఈ పార్ధన కేవలం దేవుని యందు మీకున్న విశ్వాసమును తెలపడం మరియు మీ రక్షణను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడమే. “దేవా, నీకు విరోధంగా నేను పాపము చేశాను అని నాకు తెలుసు కాబట్టి నేను శిక్షార్హుడను. కాని నేను పొందవలసిన శిక్షను యేసుక్రీస్తు తీసివేశాడు కాగా ఆయన యందు విశ్వాసము ద్వారా నేను క్షమింపబడగలను. క్షమాపణ అనే నీ బహుమానాన్ని నేను అందుకుంటున్నాను మరియు నా రక్షణ కొరకు నీపై నా నమ్మకమును ఉంచుతున్నాను. యేసును నా వ్యక్తిగత రక్షకునిగా అంగీకరిస్తున్నాను! ఆశ్చర్యకరమైన మీ కృపను బట్టి మరియు క్షమాపణను బట్టి – నిత్య జీవాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు! ఆమెన్!”

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించడం అంటే ఏంటి?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి