క్రైస్తవులు దేశపు న్యాయసూత్రము విధేయత చూపించవలసిన అవసరత వుందా?ప్రశ్న: క్రైస్తవులు దేశపు న్యాయసూత్రము విధేయత చూపించవలసిన అవసరత వుందా?

జవాబు:
రోమా 13:1-7 చెప్తుంది, “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే తప్ప నియమింపబడియున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకే గాని మంచి కార్యములకు భయంకారులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండకోరితివా, మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు. కాబట్తి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్తి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడి. ఎవనియెడల భయముండవలెనో వానియెడల సన్మానమును వానియెడల సన్మానమును కలిగియుండి,అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.”

ఈ పాఠ్యభాగము వివైంచేది మనమీద దేవుడు నియమించిన గవర్నమెంటు అధికారులకు విధేయత చూపించవలెనని స్పష్టముగా చెప్తున్నది. దేవుడు గవర్నమెంటును క్రమమును స్థాపించుటకు, చెడును శిక్షించుటకు మరియు న్యాయమును వృద్ధిపరచుటకును (ఆదికాండము 9:6; 1 కొరింథీయులకు 14:33; రోమా 12:8). మనము గవర్నమెంటు అధికారులకు ప్రతిదానియందును లోబడవలెను - పన్నులు చెల్లించుటయందును, క్రమబద్దమైన మరియు న్యాయసూత్రాలను మరియు గౌరవమును చూపించుటయందును. మనము చేయలేని పక్షమున, మనము అంతిమముగా అమర్యాదను దేవుని పట్ల చూపిస్తున్నట్లే, ఎందుకంటే ఆయనే మనమీద గవర్నమెంటును నియమించాడు. రోమాకు అపోస్తలుడైన పౌలు రాసినపుడు, నీరో చక్రవర్తి పరిపాలనలో అతడు రోమా గవర్నమెంటు అధికారుల పాలనలో నున్నాడు. పౌలు ఇంకను గవర్నమెంటు పరిపాలన?

మరి తరువాతి ప్రశ్న“మనము దేశపు న్యాయసూత్రములకు మనఃపూర్వకముగా విధేయత చూపించగలమా? ఆప్రశ్నకు జవాబు అపోస్తలుల కార్యములు 5:27-29, “వారిని తిసుకొనివచ్చి సభలో నిలువబెట్తగా ప్రధానయాజకుడు వారిని చూచి -మిరు ఈ నామమునుబట్తి భోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆఙ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరుషలేమును మీ భోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురు అపోస్తలులను-మనుష్యులకు కాదు దేవునికే కదా మేము లోబడవలెను గా!'“ దీనినుండి మనకు అర్థమవుతుందేంటంటే, దేవుని న్యాయవిధిని ఈ దేశపు న్యాయసూత్రము విధేయత చూపించనంతకాలము, మనము దేశపు న్యాయసూత్రము విధేయత చూపించబద్దులమైయున్నాము. ఏదిఏమైనా, ఆసారికి కూడ మనపైనున్న గవర్నమెంటు అధికారమును విధేయతచూపించవలసివుంది. పేతురు మరియు యోహాను వారిని కొరడా దెబ్బలతో కొట్టినపుదు వారు ఆక్షేపించక పోని సాత్యాన్ని బట్టి, దానికి బదులు వారు దేవుని మాటకు విధేయత చూపించుటలో వారి శ్రమను బట్టి సంతోషించిరి(అపోస్తలుల కార్యములు 5:40-42).


తెలుగు హోం పేజికు వెళ్ళండి


క్రైస్తవులు దేశపు న్యాయసూత్రము విధేయత చూపించవలసిన అవసరత వుందా?