క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ఏవి?ప్రశ్న: క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ఏవి?

జవాబు:
నిజమైన పరలోకము ఎలాగుంటుందోనని తప్పుడు అభిప్రాయాలుంటారు. ప్రకటన 21-22 అధ్యాయాలు మనకు విశ్లేషించి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి వివరిస్తుంది. అంత్యకాలమున జరిగే సంగతులు తర్వాత, ప్రస్తుతమున్న ఆకాశము మరియు భూమి గతించిపోయి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిచే భర్తీచేయబడును. విశ్వాసులు నిత్యత్వములో నివసించదగ్గ ప్రాంతమే క్రొత్త భూమి. క్రొత్త భూమియే "పరలోకము" మన నిత్యత్వాన్ని గడిపేస్థలము. అదియే నూతన భూమి అక్కడ క్రొత్త యెరూషలేము, పరలోకపట్టణము ఉన్నది. ఆ క్రొత్తభూమిమీద ఆక్కడ ముత్యపు గుమ్మములు మరియు బంగారపు వీధులు కలవు.

పరలోకము- క్రొత్త భూమి- మహిమకరమైన భౌతిక శరీరములతో నివసించు భౌతికమైన స్థలము (1 కొరింథీయులకు 15: 35-58). పరలోకమనే భావన "మేఘాలలో" నున్నదన్నది బైబిలుపరమైనది కాదు. "పరలోకము చుట్టూ ఆత్మలు సంచరించుననే భావన కూడ బైబిలుకు వ్యతిరేకమైనదే. విశ్వాసులు అనుభవించాల్సిన పరలోకము నూతనమైనది మరియు సంపూర్ణమైన గ్రహము అక్కడ మనము నివసించుటకు వీలైన ప్రదేశము. క్రొత్త భూమి పాపమునుండి, చెడునుండి, రోగములనుండి, శ్రమలనుండి, మరియు మరణమునుండీ స్వతంత్రమైనది. అది మన ప్రస్తుతమున్న భూమి వలె , లేక బహుశా ప్రస్తుతమున్న విలాసకరమైన పరిస్థితినుండినది, గాని పాపపు ఉగ్రత లేనిది.

క్రొత్త ఆకాశము సంగతేంటీ? చాలా ప్రాముఖ్యంగా ఙ్ఞాపకముంచుకోవల్సిన విషయమేమంటే పురాతన కాలపు ఆలోచన పరలోకము అనగానే ఆకాశము లేక విశాలమైన ప్రదేశము, అదేవిధముగా దేవుడు నివసించేగల ప్రాంతము. గనుక , ప్రకటన 21:1 వ వచనములో క్రొత్త ఆకాశమును సూచిస్తుంది, అది సుమారుగా విశ్వమంతా సృష్ఠించబడిందని సూచిస్తుంది- క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, మరియు నూతన గగనతలము. అది ఇంకా దేవుని పరలోకము మరల సృష్ఠించబడుతుందని ,అదేవిధముగా విశ్వములోని ప్రతిదానికి ఒక "క్రొత్త మలుపు" ను ఇస్తుందని సూచిస్తుంది. నిత్యత్వములోనున్న క్రొత్త ఆకాశములో మనము ప్రవేశించుటకు అవకాశముందా? సాధ్యమేనేమో, గాని మనము కనుగొనుటకు వేచివుండాల్సిందే. మనమందరం ఆకాశమునుగూర్చి అవగాహనకల్గేంతవరకు దేవుని వాక్యమును చదివి గ్రహించుటకు సంసిద్దపడుదామా.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ఏవి?