settings icon
share icon
ప్రశ్న

యేసును గూర్చి ఎన్నడు విననివారికి ఏమి జరుగుతుంది?

జవాబు


“ఆయనను గూర్చి వినినా” వినకపోయినా ప్రజలందరు దేవునికి జవాబుదారులైయున్నారు. దేవుడు తన్ను తాను సృష్టిలో (రోమా. 1:20) మరియు ప్రజల యొక్క హృదయాలలో (ప్రసంగి 3:11) బయలుపరచుకున్నాడని బైబిల్ చెబుతుంది. సమస్య ఏమిటంటే మానవ జాతి పాపముతో నిండియున్నది; మనమంతా ఆయనను గూర్చిన ఈ జ్ఞానమును తిరస్కరించి ఆయనకు తిరుగుబాటు చేస్తాము (రోమా. 1:21-23). దేవుని కృపలేని పక్షమున, మన హృదయముల యొక్క పాపపు ఆశలకు మనం ఇవ్వబడి, ఆయనకు వేరుగా జీవితం ఎంత నిరుపయోగంగాను ఘోరముగాను ఉంటుందో కనుగొనున్నట్లు చేస్తుంది (రోమా. 1:24-32).

వాస్తవానికి, కొందరు దేవుని గూర్చి వినలేదు అని కాదు. కాని, వారు వినినదానిని మరియు సృష్టిలో కనిపించువాటిని తిరస్కరించుట అనేది సమస్య. “అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మ తోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును” అని ద్వితీ. 4:29 ప్రకటిస్తుంది. ఈ వచనము ఒక ముఖ్యమైన నియమమును బోధిస్తుంది-దేవుని హృదయపూర్వకముగా వెదకువారు ఆయనను పొందుతారు. ఒక వ్యక్తి నిజముగా దేవుని తెలుసుకోవాలని ఆశించినయెడల, దేవుడు వారికి కనుపరచుకొంటాడు.

సమస్య ఏమిటంటే, “గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు” (రోమా. 3:11). సృష్టిలో మరియు వారి హృదయాలలో ఉన్న దేవుని జ్ఞానమును ప్రజలు తిరస్కరించి, వారు స్వయంగా సృష్టించిన “దేవతలను” ఆరాధిస్తున్నారు. క్రీస్తు సువార్త విననివారిని దేవుడు నరకమునకు పంపుటలోని నిజాయితీని గూర్చి తర్కించుట మూర్ఖత్వము. దేవుడు వారికి ముందుగానే బయలుపరచినవాటికి దేవునికి ప్రజలు బాధ్యులైయున్నారు. ప్రజలు ఇట్టి జ్ఞానమును తిరస్కరిస్తున్నారు కాబట్టి వారిని నరకమునకు పంపుటలో దేవుడు నీతిమంతుడు.

ఇప్పటి వరకు విననివారి యొక్క భవిష్యత్తును గూర్చి తర్కించుట కంటే, క్రైస్తవులమైన మనము వారు వినునట్లు మనం చేయగలిగినది చేయాలి. సమస్త దేశములలో సువార్తను వ్యాపింపజేయుటకు మనం పిలువబడితిమి (మత్తయి 28:19-20; అపొ. 1:8). సృష్టిలో బయలుపరచబడిన దేవుని జ్ఞానమును ప్రజలు తిరస్కరిస్తారని మనకు తెలుసు కాబట్టి, యేసు క్రీస్తులో రక్షణ సువార్తను ప్రకటించుటకు అది మనలను పురికొల్పాలి. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇవ్వబడిన దేవుని కృపను అంగీకరించుట ద్వారా మాత్రమే ప్రజలు పాపముల నుండి రక్షణ పొందుతారు మరియు ఆయనకు వేరుగా నిత్యమును తప్పించుకుంటారు.

ఇప్పటి వరకు సువార్త వినని వారు దేవుని కరుణను పొందుతారని మనం ఊహించిన యెడల, మనం గొప్ప సమస్యను ఎదుర్కొంటాము. సువార్త విననివారు రక్షణపొందినట్లయితే, ఎవరు ఎన్నడు రక్షణ పొందకుండా మనం చూడడానికి ప్రయత్నిస్తాము. ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించి అతడు లేక ఆమె దానిని తిరస్కరించుట మనం చేయదగిన అతి చెడ్డ పని. అలా జరిగినయెడల, అతడు లేక ఆమె శిక్షించబడును. సువార్తను విననివారు శిక్షించబడాలి, లేనియెడల సువార్త ప్రకటనకు ప్రేరణ ఉండదు. ప్రజలు సువార్త వినకుండా రక్షణపొందుతుంటే, ప్రజలు సువార్తను విని దానిని తిరస్కరించి శిక్షార్హులు అయ్యే అవకాశం ఉంటె అట్టి ప్రమాదకరమైన పని ఎందుకు చెయ్యాలి?

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

యేసును గూర్చి ఎన్నడు విననివారికి ఏమి జరుగుతుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries