ఆత్మ యొక్క అద్భుత వరములు నేటికి కూడా వర్తిస్తాయా?


ప్రశ్న: ఆత్మ యొక్క అద్భుత వరములు నేటికి కూడా వర్తిస్తాయా?

జవాబు:
మొదటిగా, దేవుడు నేడు కూడా అద్భుత కార్యములు చేస్తాడా అని ఈ ప్రశ్న కాదని గుర్తించుట ముఖ్యము. నేడు దేవుడు ప్రజలను స్వస్థపరచడు, ప్రజలతో మాట్లాడడు, మరియు అద్భుత కార్యములు చిహ్నములు చేయడు అనుట మూర్ఖత్వము మరియు బైబిల్ కు విరోధము. ఆత్మ యొక్క అద్భుత వరములు, ముఖ్యముగా 1 కొరింథీ. 12-14లో వివరించబడినవి, నేడు సంఘములో ఉన్నాయా లేదా అనునది ప్రశ్న. ఈ ప్రశ్న పరిశుద్ధాత్ముడు ఒకనికి ఒక విశేష అద్భుత వరము ఇవ్వగలడా అని కూడా కాదు. అన్నిటికంటే పైగా, ఆయన చిత్తనుసారంగా పరిశుద్ధాత్మ ఉచ్చితముగా వరములను ప్రజలకు ఇస్తాడని మేము పూర్తిగా గుర్తిస్తున్నాము (1 కొరింథీ. 12:7-11).

అపొస్తలుల కార్యములు పుస్తకము మరియు పత్రికలలో, ఎక్కువ అద్భుతాలు అపొస్తలులు మరియు వారి అనుచరులు ద్వారా చేయబడినవి. దానికి కారణమును పౌలు మనకు ఇస్తున్నాడు: “సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను” (2 కొరింథీ. 12:12). క్రీస్తులో ప్రతి విశ్వాసి చిహ్నములు, అద్భుతములు మరియు ఆశ్చర్య కార్యములను చేస్తే, వాటిని అపొస్తలుల యొక్క గురుతులుగా గుర్తించలేము. యేసు “అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, మరియు చిహ్నములు” చూపెనని అపొ. 2:22 చెబుతుంది. అదే విధంగా వారు చేయు అద్భుతముల ద్వారా అపొస్తలులు దేవుని యొక్క నిజమైన సందేశకులుగా “ముద్రించబడితిరి.” పౌలు మరియు బర్నబా చేసిన అద్భుతముల ద్వారా సువార్త సందేశము “నిర్థారించబడెను” అని అపొ. 14:3 వివరిస్తుంది.

1 కొరింథీ. 12–14 ముఖ్యముగా ఆత్మ వరముల యొక్క పాత్రులతో వ్యవహరిస్తుంది. “సాధారణ” క్రైస్తవులకు కొన్ని సార్లు అద్భుత వరములు ఇవ్వబడెనని ఈ వాక్యభాగం చెబుతుంది (12:8-10, 28-30). అయితే అవి ఎంత సాధారణమో మనకు చెప్పబడలేదు. మనం పైన నేర్చుకొన్నవాటి ఆధారంగా, అపొస్తలులు చిహ్నములు మరియు అద్భుతముల ద్వారా “ముద్రించబడితే,” సామాన్య క్రైస్తవులకు అద్భుత వరములను ఇచ్చుట సామాన్య విషయముగా గాక, ఒక ప్రత్యేకతగా పరిగణించబడుతుంది. అపొస్తలులు మరియు వారి అనుచరుల మినహా, వ్యక్తులు ఆత్మ యొక్క అద్భుత కార్యములను ప్రదర్శించుట క్రొత్త నిబంధనలో విశేషంగా ఎక్కడా వివరించబడలేదు.

నేడు మన యొద్ద ఉన్నట్లు, ఆరంభ సంఘము యొద్ద సంపూర్ణ బైబిల్ లేదని మనం గమనించుట చాలా ముఖ్యము. (2 తిమోతి 3:16-17). కాబట్టి, ప్రవచనం, జ్ఞానం, వివేకము మొదలగు వరములు దేవుడు వారి ద్వారా ఏమి చేయగోరుచున్నాడో తెలుసుకొనుటకు ఆదిమ క్రైస్తవులకు అవసరమైయుంది. నూతన సత్యమును మరియు దేవుని ప్రత్యక్షతను వివరించుటకు ప్రవచన వరం విశ్వాసులకు శక్తిని ఇచ్చింది. దేవుని ప్రత్యక్షత బైబిల్ లో పూర్ణమైనది కాబట్టి, “ప్రత్యక్ష” వరముల యొక్క అవసరత ఇప్పుడు లేదు, కనీసం క్రొత్త నిబంధన కాల పరిమాణంలో అవసరం లేదు.

దేవుడు ప్రతి రోజు ప్రజలను అద్భుతముగా స్వస్థపరుస్తున్నాడు. దేవుడు నేడు కూడా మనతో మాట్లాడుతున్నాడు, వినిపించు స్వరముతో కావచ్చు, మన మనస్సులలో కావచ్చు, లేక భావముల ద్వారా. దేవుడు నేడు కూడా అద్భుతములు, ఆశ్చర్యములు మరియు చిహ్నములు చేస్తాడు మరి కొన్ని సార్లు ఆ అద్భుతములను ఓక్ క్రైస్తవుని ద్వారా చేస్తాడు. అయితే, ఇవి ఆత్మ యొక్క ఆద్భుత వారములు అయ్యుండవలసిన పని లేదు. సువార్త సత్యమని మరియు అపొస్తలులు నిజముగా దేవుని సందేశకులని రుజువుచేయుటకు అద్భుత వరముల యొక్క ముఖ్య ఉద్దేశము. అద్భుత వరములు ఆగిపోయాయని బైబిల్ చెప్పదుగాని, క్రొత్త నిబంధన కాలములో జరిగిన విధముగా నేడు జరగకుండుటకు పునాదిని మాత్రం వేస్తుంది.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
ఆత్మ యొక్క అద్భుత వరములు నేటికి కూడా వర్తిస్తాయా?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి