settings icon
share icon
ప్రశ్న

క్రైస్తవులు సైన్యంలో సేవచేయుటను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

జవాబు


సైన్యంలో పని చేయుటను గూర్చి బైబిల్ ఎక్కువ సమాచారమును తెలియజేస్తుంది. బైబిల్ లోనున్న సైనిక సేవలకు సంబంధించిన అనేక వాక్యభాగాలు సారూప్యాలు మాత్రమే అయినప్పటికీ, అనేక వచనాలు ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సంబంధించి మాట్లాడతాయి. ఒకడు సైనికదళంలో పని చేయవచ్చా అనేది బైబిల్ ఖచ్చితంగా చెప్పదు. అదే సమయంలో, సైనికులుగా ఉండడం వాక్యంలో అత్యంతగా గౌరవించబడింది మరియు బైబిల్ దృష్టిలో అలాటి సేవ తరచు జరిగేది.

ఏలాము రాజైన కదొర్లాయోమెరు మరియు అతని మిత్రుల చేత అబ్రాహాము కొడుకుకైన (సహోదరుని కుమారుడైన) లోతు చెరపట్టబడినప్పుడు సైనిక సేవ యొక్క మొదటి ఉదాహరణ మనకు కనిపిస్తుంది (ఆది. 14). లోతును రక్షించుటకొరకు అబ్రాహాము తన యింట పుట్టి అలవరచబడిన 318 పురుషులను ప్రోగుచేసి మరియు ఏలామీయులను ఓడించెను. ఒక దివ్యమైన పని –అమాయకులను రక్షించి మరియు కాపాడుటలో సైనికులు నిమగ్నమై యుండటం మనం ఇక్కడ చూస్తాం.

తరువాత చరిత్రలో, ఇశ్రాయేలు రాజ్యం ఒక బలమైన సైన్యంగా అభివృద్ధి చెందింది. ఇశ్రాయేలీయులకు సైనికదళం ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ప్రజలను రక్షించడానికి దైవికమైన యోధుడుగా పనిచేసాడనే ఆలోచన ఇశ్రాయేలు సైన్యాన్ని అభివృద్ధి చేసుకొనుటలో ఎందుకు నిదానంగా ఉన్నారనడానికిగల కారణం కావచ్చు. ఇశ్రాయేలులో ఒక సాధారణ నిలబడగలిగిన సైన్యం యొక్క అభివృద్ధి అనేది సౌలు, దావీదు మరియు సొలోమోను ద్వార ఒక బలమైన కేంద్రీకృత రాజకీయ వ్యవస్థ యేర్పరచబడిన తరువాతే జరిగినది. శాశ్వత సైన్యమును నెలకొల్పుటలో సౌలు మొదటివాడు (1 సమూ 13:2; 24:2; 26:2).

సౌలు ప్రారంభించిన దానిని దావీదు కొనసాగించెను. ఆయన సైన్యమును అధికము చేసి మరియు ఆయనకు విధేయులైన ఇతర ప్రాంతాల నుండి దళాలను అద్దెకు తీసుకొని (2 సమూ 15:9-22) మరియు వారి యొక్క నాయకత్వము కొరకు సైన్యాధిపతియైన యోవాబుకు ఇచ్చెను. దావీదు పాలనలో ఇశ్రాయేలీయులు సైనిక పోరాటంలో మరింత శక్తివంతంగా మారెను, పొరుగు రాష్ట్రాల వంటి అమ్మోనును సంహరించెను (2 సమూ 11:1; 1 దిన. 20:1-3).24,000 మంది పురుషుల చొప్పున పండ్రెండు గుంపులను చేసి సంవత్సరంలో నెలకోసారి తిరిగే వ్యవస్థను ఏర్పాటు చేసాడు (1 దిన 27). సొలొమోను పాలన శాంతవంతంగా ఉన్నప్పటికీ, ఆయన తరువాత సైన్యమును పొడిగించి, రథములను మరియు రౌతులను సమకూర్చెను (1 రాజులు 10:26). ఇశ్రాయేలు (యూదా) ఒక రాజ్య వ్యవస్థగా ఉండుట రద్దు అయినప్పుడు బలమైన సైన్యం (సొలొమోను మరణం తరువాత రాజ్యం విభజింపబడినను) క్రీ.పూ 586 వరకు కొనసాగింది.

క్రొత్త నిబంధన గ్రంథంలో రోమా సెతాధిపతి (వందమంది సైనికులకు అధిపతి) ఆయన యొద్దకు వస్తున్నప్పుడు యేసు అర్చర్యపడ్డాడు. యేసుతో సెతాధిపతి యొక్క సమాధానం అధికారము పట్ల అతనికున్న గ్రహింపును మరియు యేసులో అతనికున్న విశ్వాసమును సూచిస్తుంది (మత్తయి 8:5-13). ఆయన యొక్క వృత్తిని యేసు బహిరంగం చేయలేదు. క్రొత్త నిబంధనలో చెప్పబడిన సెతాధిపతులు క్రైస్తవుల వలే, దేవునికి భయపడువారిగా, మరియు మంచి ప్రవర్తనగల వారిగా మెచ్చుకోబడ్డారు (మత్తయి 8:5; 27:54; మార్కు 15:39-45; లూకా 7:2; 23:47; అపొ.కా. 10:1; 21:32; 28:16).

స్థలములు మరియు పేర్లు మారియుండవచ్చు, కానీ మన సైనికదళాలు మాత్రం బైబిల్లో చెప్పబడిన సెతాధిపతుల వలె విలువైనది. సైనికుల యొక్క స్థితి అత్యంత గౌరవించబడింది. ఉదాహరణకు ఎపఫ్రోదీతును పౌలు జతపనివాడని మరియు “తోటి యోధుడని” చెప్పెను (ఫిలిప్పీ. 2:25). సర్వాంగ కవచమును అనగా సైనికుడు ధరించు వస్తువులు – శిరస్త్రాణము, దట్టము, మరియు డాలును ధరించుకొనుట ద్వార ప్రభువుయందు బలంగా ఉండుటను వివరించుటకు బైబిల్ సైనిక పదములను ఉపయోగించింది (ఎఫెసీ. 6:10-20).

అవును, సైన్యంలో పనిచేయుటను గూర్చి బైబిల్ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా చెప్తుంది.క్రైస్తవ స్త్రీలు మరియు పురుషులు తమ ప్రవర్తన, గౌరవం మరియు కీర్తి చేత దేశముకు సేవ చేయువారు తాము నిర్వర్తించే పౌర బాధ్యతలు సార్వభౌమ దేవునిచే గౌరవించబడతాయి అని చెప్పవచ్చు. సైన్యంలో గౌరవంగా పనిచేయువారు మన గౌరవమును మరియు కృతజ్ఞతకు పాత్రులు.

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

క్రైస్తవులు సైన్యంలో సేవచేయుటను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries