settings icon
share icon
ప్రశ్న

వివాహం ఎక్కువ కాలం ఉండాలంటే – మూలం ఏమిటి?

జవాబు


వివాహ దంపతులు తమ వివాహం నిలిచియుండాలంటే ఏమి చేయాలి? మొదట మరియు అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునికి మరియు ఆయన వాక్యానికి విధేయత చూపడం. వివాహం మొదలయ్యేముందు పరిగణలో ఉండాల్సిన సూత్రం ఇదే. దేవుడు చెప్పాడు, “సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడతురా?” (ఆమోసు 3:3). తిరిగి- జన్మించిన విశ్వాసికి, అవిశ్వాసియైన వారెవరితోనైనసరే దగ్గర సంబంధమును మొదలుపెట్టడం కాదు దీని అర్థం. “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?” (2 కొరింథీ. 6:14). ఈ ఒక్క నియమమును పాటిస్తే, వివాహంలో తదుపరి వచ్చే గుండెపోటులను మరియు శ్రమలన నుండి ఇది రక్షిస్తుంది.

వివహము ఎక్కువ కాలం ఉండుటకు మరొక సూత్రం ఏంటంటే భర్త దేవునికి విధేయత చూపి మరియు తనను తాను ప్రేమించుకున్నట్లే భార్యను ప్రేమించి, గౌరవించి మరియు కాపాడాలి (ఎఫెసీ. 5:25-31). “ప్రభువునకువలె” భార్య తన సొంత భర్తకు లోబడాలిసరియైన సూత్రం (ఎఫెసీ. 5:22). పురుషునికి మరియు స్త్రీకి మధ్య సంబంధం క్రీస్తుకు మరియు సంఘముకు మధ్య సంబంధమును గూర్చిన చిత్రము. క్రీస్తు తన సంఘము కొరకు తనను తాను అప్పగించుకొనెను, మరియు తన “వధువు” వలె దానిని ప్రేమించి, గౌరవించి, మరియు రక్షించును (ప్రకటన. 19:7-9).

దైవిక వివాహము అను పునాదిపై కట్టబడి, అనేకమంది దంపతులు తమ వివాహం ఎక్కువ కాలం ఉండుటకు ప్రయోగాత్మక మార్గములు వెతుకుతుంటారు: విలువైన సమయం కలసి గడపడం; తరచు “నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం”; దయగా ఉండడం; అభిమానం చూపడం; అభినందనలు తెలుపడం; కాలయాపన చేయుటకు వెళ్లడం; నోట్సు వ్రాయడం; బహుమతులు ఇవ్వడం; మరియు క్షమాపణ చెప్పుటకు సిద్ధంగా ఉండడం, ఉదాహరణకు.భార్యాభర్తలకుఈ క్రియలు బైబిల్ లోని సూచనలతో చుట్టబడియుంటాయి.

మొదటి వివాహంలో ఆదాము నొద్దకు హావ్వను దేవుడు తీసుకువచ్చినప్పుడు, ఆమె తన “యెముకలలో మరియు మాంసములో నుండి” తీయబడింది (ఆది. 2:21) మరియు వారు “ఏకశరీరమైతిరి” (ఆది. 2:23-24). ఏక శరీరమగుట అంటే భౌతిక సంబంధం కంటే ఎక్కువ. ఇది ఒక ప్రత్యేక విభాగమును ఏర్పాటు చేయుటకు మనసు మరియు ప్రాణము యొక్క కలయిక అని అర్థం. ఈ అనుబంధం ఇంద్రియాల మరియు ఉద్రేకాల ఆకర్షణ కంటే బహు దూరంగా ఉండి మరియు ఆత్మీయ “ఏకత్వం” లోకి ప్రవేశిస్తారు ఇది ఇరువురు దంపతులు దేవునికి మరియు ఒకరికొకరికి అప్పగించుకోవడం ద్వార ఇది కనిపిస్తుంది. ఈ అనుబంధం “నేను మరియు నాది” అను దానిపై కాదు గానీ “మేము మరియ మనము” అనుదానిపై కేంద్రీకృతమౌతుంది. వివాహ సంబంధం ఎక్కువ కాలం ఉండుటకు ఇది ఒక రహస్యం.

జీవితాంతం వివాహ సంబంధం ఉంచుకోవడం అనేది భాగస్వాములు ప్రధానం చేసుకోవలసిన విషయం. వివాహాలు జీవితకాలం కాపాడుకొన్న దంపతులు ఒకరియెడలఒకరి సమర్పణను వేడుకగా జరుపుకుంటారు.కోపంలోనైన సరే విడాకులు గురించి మాట్లాడకూడదని దీనిని ఒక విషయంగా తీసుకొంటారుఅనేక జంటలు. దేవునితో నిలువగా నున్న సంబంధమును పటిష్టం చేసుకోవడానికి భార్యాభర్తల మధ్య సంబంధము ఎక్కువ కాలం ఉండాలి, దేవుడు గౌరవించేదిగా ఉండాలి.

వివాహము బంధం ఎల్లకాలం నిలిచియుండాలని అనుకునే దంపతులు సమస్యలను ఎలా చర్చించాలో వారికి తెలియాలి. ప్రార్థన, బైబిల్ అధ్యయనం మరియు పరస్పర ప్రాత్సాహం మంచివి. వెలుపల సహాయం కోరుకొనుటలో తప్పేమీ లేదు; వాస్తవంగా, సంఘ కరాణాలలో ఒకటి ఏంటంటే “ప్రేమ చూపుటకును, సత్కార్యము చేయుటకును, ఒకనినొకడు పురికొల్పవలెను “ (హెబ్రీ.10:24). పోరాడుతున్న దంపతులు పెద్దవారైన క్రైస్తవ దంపతుల, సేవకుల, లేదా బైబిల్ పరమైన వివాహ న్యాయవాది సలహాలను కోరుకోవాలి.

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

వివాహం ఎక్కువ కాలం ఉండాలంటే – మూలం ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries