ఫిర్యాదు/జారీచేయుట గురించి బైబిలు ఏమని ప్రస్తావిస్తుంది?ప్రశ్న: ఫిర్యాదు/జారీచేయుట గురించి బైబిలు ఏమని ప్రస్తావిస్తుంది?

జవాబు:
అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములలోనున్న విశ్వాసులను ఒకరిపై నొకరు ఏవిషయమునకైనను తీర్పుతిర్చు స్థలమునకు వెళ్లవద్దని హెచ్చరించుచున్నాడు(1 కొరింథీయులకు 6:1-8). క్రైస్తవులు ఒకరినొకరు క్షమించుకోకుండా ఉండిపోవడం మరియు వారి స్వంత భేధాభిప్రాయముల బట్టి సమాధానపడకుండా వుండడం అనేదీఅత్మీయ ఓటమి. క్రైస్తవులే అనేకమైన సమస్యలతో నున్నప్పుడు మరియు వారి సమస్యలే తీర్చుకోవడం వారికి చేతగానపుడు ఎవరు ఎందుకని క్రైస్తవులుగా ఉండుటకు ఒప్పుకుంటారు? ఏదిఏమైనా, అక్కడక్కడ కొన్ని సంగతుల గురించి ఫిర్యాదుచేయడమే సరియైన క్రియను చేపట్టడమవుతుంది. ఒకవేళ సమాధానపడడానికి బైబిలుపరమైన పద్దతి వెంబడించినట్లయితే (మత్తయి 18:15-17) మరియు ప్రతివాది గుంపు ఎప్పటికి తప్పుగానే వుంటారు, మరి కొన్ని సంగతుల విషయములలో ఫిర్యాదు చేయడం అనేది న్యాయబద్దమైనది. ఇది కేవలము అతి ఎక్కువగా తెలివికొరకైన ప్రార్థనవలన మాత్రమే జరుగును (యాకోబు 1:5) మరియు ఆత్మీయ నాయకులను సంప్రదించటవలన సాధ్యమవును.

1 కొరింథీయులకు 6:1-6 లోని మొత్తము సంధర్భము ఇలాంటి సంఘములోని కలహములన్నింటిని తీర్చుదిద్దుతుంది, గాని పౌలు కోర్టు పద్దతిని ఈ జీవితానికి సంభంధీందించిన విషయాలు నిమిత్తమై న్యాయపరమైన తీర్పుగురించి సూచిస్తుంది. పౌలు ఈ జీవితానికి సంభంధిందించిన విషయాలు కొరకై ఈ కోర్టు పద్దతి వునికిలోనున్నదని అది సంఘము బయటి పరిష్కారమునకైనదని అర్థముచెప్తున్నాడు. సంఘ సమస్యలు కోర్టు వరకు తిసుకు వెళ్లకూడదు, గాని అవి సంఘములోపలే వాటికి న్యాయముతీర్చాలి. అపోస్తలుకార్యములు 21–22 ఈ అధ్యాయములు పౌలును ఆయనమీద ఆయన చేయకపోయిన తప్పుచేసినవానిగా నేరముమోపి అరెస్టు చేయడము గురించి ప్రస్తావించుచున్నది. రోమీయులు ఆయనను బంధిచారు మరియు “సహస్రాధిపతి పౌలును లోనికి తీసికొనివచ్చి మరియు తన నేరాన్ని ఒపూకొనేనంతవరకు కొరడాల్తో కొట్టమని ఆఙ్ఞాపించెను. అతడు జనసమూహమంతయు పౌలుపై ఎందుకు ఆగ్రహముగలవారై యున్నారో అని తెలుసుకొనగోరెను. పౌలును వారులకు కట్టి అతనిని కొరడాలతో కొట్టడానికి చూచుచుండగా, 'పౌలు ఆ అతని దగ్గర నిలిచియున్న సహస్రాధిపతిని చూచి, ‘శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టూటకు మీకు అధికారమున్నదా? అని అడిగెను.’” పౌలు రోమీయుల చట్టమును మరియు తన్నుతాను అతని పౌరసత్వమును భద్రపరచుకొనుటకు ఉపయోగించెను. మంచి ఉద్దేశ్యముతో మరియు శుద్ద హృదయముతోనున్నంతసేపు తీర్పుతీర్చే న్యాయపద్దతిని ఉపయోగించుకొనడము అనేది తప్ప్పు కాదు.

పౌలు ఇంకను ప్రకటిస్తున్నాడు, “ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీసొత్తుల నపహరింపబడుట నిచ్చుట మేలు కాదా?" (1 కొరింథీయులకు 6:7). విశ్వాసుల యొక్క సాక్ష్యమును బట్టి పౌలు చింతగలిగియున్నాడు. ఆ సమయమును మనము వినియోగించున్నట్లయితే అది మనకు మంచిది, లేక దూషించబడిన, లేక ఒక అతనిని/ఆమెను క్రీస్తునుండి దూరముచేసి కోర్టుకి తీసుకు వెళ్లడం అనేది ఒక వ్యక్తిని కేవలము బయటకు ద్రోసినట్లే. ఏది ప్రాముఖ్యము- న్యాయపరమైన యుద్దమా లేక ఒక వ్యక్తియొక్క నిత్యమైన అత్మ కొరకు పోరాడుట కొరకా?

సారాంశముగా, క్రైస్తవులు ఒకరినొకరు సంఘ విషయాలకు సహితము కోర్టుకు తీకువెళ్ళవచ్చా? అట్లనరాదు! క్రైస్తవులు ఒకరినొకరు పౌరహక్కుల విషయాలకు సహితము కోర్టుకు తీకువెళ్ళవచ్చా? ఒకవేళ ఏమార్గమైనా వాటిని నిరోధించవచ్చు, లేదు. క్రైస్తవులు క్రైస్తవేతరులను పౌరహక్కుల విషయాలకు సహితము కోర్టుకు తీకువెళ్ళవచ్చా? మరలా అదికూడ నిరొధించవచ్చు, లేదు. ఏదిఏమైనా కొన్ని సంగతులలో, మన పౌర హక్కులను సంరక్షించుట విషయాలలో ( అపోస్తలుడైన పౌలు ఉదాహరణలో చెప్పిన రీతిగా), న్యాయబద్దమైన పరిష్కారమును అన్వేషించుట అది రూఢియైనది.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


ఫిర్యాదు/జారీచేయుట గురించి బైబిలు ఏమని ప్రస్తావిస్తుంది?