settings icon
share icon
ప్రశ్న

నా జీవితము కొరకు దేవుని చిత్తమును నేను ఎలా తెలుసుకొనగలను?

జవాబు


దేవుని చిత్తమును యెరుగుట ముఖ్యము. తన నిజమైన బంధువులు తండ్రి చిత్తమును యెరిగి దానిని అనుసరించువారని యేసు చెప్పెను: “దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను” (మార్కు 3:35). ఇద్దరు కుమారుల ఉపమానంలో, దేవుని చిత్తమును చేయుటలో విఫలమైనందుకు దేవుడు ప్రథాన యాజకులను మరియు పెద్దలను గద్దించుచున్నాడు; విశేషంగా, వారు “పశ్చాత్తాపపడలేదు మరియు నమ్మలేదు” (మత్తయి 21:32). దేవుని చిత్తమనగా సాధారణంగా పాపము నుండి పశ్చాత్తాపపడి క్రీస్తుయందు నమ్మిక ఉంచుట. మనం ఈ మొదటి అడుగును తీసుకోనియెడల, మనం ఇంకను దేవుని చిత్తమును అంగీకరించలేదు.

విశ్వాసం ద్వారా క్రీస్తును మనం ఆహ్వానించినప్పుడు, మనం దేవుని పిల్లలమవుతాము (యోహాను 1:12), మరియు ఆయన మార్గంలో మనలను నడిపించుటకు ఆయన ఇష్టపడతాడు (కీర్తనలు 143:10). దేవుడు తన చిత్తమును మన యొద్ద నుండి దాయుటకు ప్రయత్నించుటలేదు; దానిని ఆయన బయలుపరచగోరుచున్నాడు. వాస్తవానికి, తన వాక్యంలో ఆయన మనకు చాలా చాలా దిశలు చూపించాడు. మనం “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము” (1 థెస్స. 5:18). మనం సత్ క్రియలు చేయవలెను (1 పేతురు 2:15). మరియు “మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము” (1 థెస్స. 4:3).

దేవుని చిత్తము తెలుసుకోవచ్చు మరియు రుజువు చేయవచ్చు. “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి,” అని రోమా. 12:2 చెబుతుంది. ఈ వాక్య భాగము మనకు ఒక ముఖ్యమైన వరుసను చూపుతుంది: దేవుని బిడ్డ లోకమునకు తలవంచుటకు నిరాకరించి ఆత్మ ద్వారా మార్పు చెందుటకు అవకాశం ఇస్తాడు. దేవుని విషయములకు అనుగుణంగా అతని మనస్సు నూతనపరచబడినప్పుడు, అతడు దేవుని పరిపూర్ణ చిత్తమును తెలుసుకొనగలడు.

మనం దేవుని చిత్తమును వెదకుతుండగా, మనం ఆలోచించునది లేఖనమునకు విరోధము కానిదిగా ఉండాలని మనం చూసుకోవాలి. ఉదాహరణకు, దొంగతనం చేయుటను బైబిల్ ఖండిస్తుంది; దేవుడు ఈ విషయమును గూర్చి స్పష్టముగా మాట్లాడెను కాబట్టి, మనం బ్యాంకు దోపిడి చేసేవారిగా ఉండుట ఆయన చిత్తము కాదని మనకు తెలుసు-దానిని గూర్చి మనం ప్రార్ధించవలసిన అవసరం కూడ లేదు. అంతేగాక, ఏది దేవునికి మహిమను తెస్తుంది మరియు ఏది మనకు మరియు ఇతరులకు ఆత్మీయ ఎదుగుదలలో సహాయం చేస్తుంది అని మనం జాగ్రత్తగా చూడాలి.

కొన్ని సార్లు దేవుని చిత్తమును తెలుసుకొనుట కష్టం ఎందుకంటే దానికి సహనం కావాలి. దేవుని చిత్తమంతటిని ఒకే సారి తెలుసుకోవాలనుకొనుట స్వాభావికం, కాని ఆయన పని చేయు విధానం అది కాదు. ఆయన మనకు ఒక అడుగు ఒక సారి బయలుపరుస్తాడు-ప్రతి అడుగు ఒక విశ్వాసపూ మెట్టు-మరియు మనలను ఆయనపై నమ్మిక ఉంచునట్లు చేస్తాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ముందు నడిపింపు కొరకు వేచియుంటుండగా, మనం యెరిగియున్న మంచిని మనం చేయుటలో వ్యస్థంగా ఉంటాము (యాకోబు 4:17).

చాలా సార్లు దేవుడు మనకు కొన్ని స్పష్టతలు ఇవ్వాలని కోరతాము-ఎక్కడ పని చెయ్యాలి, ఎక్కడ నివసించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ కారు కొనాలి మొదలగునవి. మనం నిర్ణయాలు తీసుకొనుటకు దేవుడు అవకాశం ఇస్తాడు, మరియు మనం ఆయన మాట వింటే, తప్పు నిర్ణయాలను నిరోధించే మార్గములు ఆయన యొద్ద ఉన్నాయి (అపొ. 16:6-7 చూడండి).

మనం ఒక వ్యక్తిని ఎంతగా తెలుసుకొంటే, అతడు/ఆమె యొక్క ఆశలను అంతగా మనం తెలుసుకొనవచ్చు. ఉదాహరణకు, ఒక రద్దీగా ఉన్న బజారులో బంతి వెళ్లుటను చూసిన బాలుడు , దాని వెనుక పరిగెత్తకపోవచ్చు, ఎందుకంటే, “నేను అలా చేయుట నా తండ్రికి ఇష్టం లేదని” అతనికి తెలుసు. ప్రతి సన్నివేశంలో అతడు తన తండ్రిని సలహా అడగవలసిన పని లేదు; అతని తండ్రి ఏమి చెబుతాడో అతనికి తెలుసు, ఎందుకంటే అతనికి అతని తండ్రి తెలుసు. దేవునితో మన అనుబంధం కూడ అంతే. మనం ప్రభువుతో నడుచుచుండగా, ఆయన మాట వినుచు ఆయన ఆత్మపై ఆధారపడుతూ, మనకు క్రీస్తు యొక్క మనస్సు ఇవ్వబడినదని మనకు తెలుస్తుంది (1 కొరింథీ. 2:16). అయన మనకు తెలుసు, మరియు ఆయన చిత్తమును యెరుగుటలో అది మనకు సహాయం చేస్తుంది. దేవుని నడిపింపు మన కొరకు లభ్యమగుట మనం చూస్తాము. “యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును” (సామెతలు 11:5).

మనం ప్రభువుకు దగ్గరగా నడుస్తూ మన జీవితము కొరకు ఆయన చిత్తమును నిజముగా ఆశించుచున్నయెడల, దేవుడు ఆయన చిత్తమును మన హృదయాలలో ఉంచుతాడు. మన సొంత చిత్తమును గాక, దేవుని చిత్తమును వెదకుట దీనికి మూలం. “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” (కీర్తనలు 37:4).

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

నా జీవితము కొరకు దేవుని చిత్తమును నేను ఎలా తెలుసుకొనగలను?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries