నేను ప్రేమలోపడ్డానని నాకు ఎలా తెలుస్తుంది?


ప్రశ్న: నేను ప్రేమలోపడ్డానని నాకు ఎలా తెలుస్తుంది?

జవాబు:
ప్రేమ అనేది ఒక శక్తివంతమైన భావోద్వేగం. ఇది మన జీవితాలను ఎక్కువ చైతన్యపరుస్తుంది. ఈ భావోద్వాగంపై ఆధారపడి మనం అనేక ప్రాముఖ్యమైన నిర్ణయాలను తీసుకొంటాం, మరియు మనం “ప్రేమలో పడ్డామనుకొని” పెండ్లి కూడా చేసుకొంటాం. అన్ని వివాహాలలో సగం వివాహాలు విడాకులతో ముగియడానికి ఇది కారణం కావచ్చు. నిజమైన ప్రేమ వచ్చి లేదా వెళ్లే భావోద్వాగం కాదు, కానీ నిర్ణయం అని బైబిల్ బోధిస్తుంది. కేవలం మనలను ప్రేమించే వారిని మాత్రమే మనం ప్రేమించకూడదు; మనలను ద్వేషించేవారిని కూడా మనం ప్రేమించాలి, అలాగే క్రీస్తు ప్రేమింపబడని వారిని ప్రేమించాడు (లూకా 6:35). “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నామమును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.” (1 కొరింథీ 13:4-7).

ఒకరితో “ప్రేమలోపడడం” చాల సులభం, కానీ నిర్ణయించుకొనేముందు నిజమైన ప్రేమలో మనం ఏమి భావిస్తున్నామో అని అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మొదట, ఈ వ్యక్తి క్రైస్తవుడేనా అంటే తన జీవితమును క్రీస్తుకు అప్పగించాడా? రక్షణ కొరకు కేవలం ఆయన/ఆమె క్రీస్తును నమ్ముకొన్నాడా? నీ హృదయమును మరియు భావోద్వేగాలను ఒక వ్యక్తికి ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్లైతే, ఆ వ్యక్తిని ఇతర ప్రజలందరి కంటే ప్రధమంగా ఉంచి మరియు సంబంధమును దేవుని క్రింద రెండవ స్థాయిలో ఉంచుతున్నామా అను ప్రశ్నను మనకు మనం అడగాలి. ఇద్దరు వివాహము చేసుకొన్నప్పుడు, వారు ఏకశరీరమగుదురు అని బైబిల్ బోధిస్తుంది (ఆది 2:24; మత్తయి 19:5).

ఆలోచించవలసిన మరో విషయం ఏంటంటే భాగస్వామిగా ఉండుటకు ప్రేమించిన వ్యక్తి మంచి వ్యక్తా కాదా అని మనం అడగాలి. ఆమె/అతడు దేవునిని ఆమె/అతని జీవితంలో ప్రధమంగా/అన్నిటికంటే ముందుగ ఉంచుతున్నారా? ఆమె/అతడు తమ సమయమును మరియు శక్తిని వివాహ సంబంధమును కట్టుకొని దానికి జీవితాంతం కట్టుబడి ఉండుటలో వెచ్చిస్తారా? మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు దాని పరిమాణమును కొలచుటకు కొలబద్ద లేదు కానీ, మనం మన జీవితంలో మన భావోద్వేగాలను అనుసరిస్తున్నామా లేదా దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నామా అని గ్రహించాలి. నిజమైన ప్రేమ నిర్ణయం, భావోద్వేగం కాదు. నిజమైన బైబిల్ ప్రకారమైన ప్రేమ అన్నిసమయాల్లో ఆ వ్యక్తిని ప్రేమిస్తుంది, “ప్రేమలోపడ్డానని” అనుకున్నప్పుడు మాత్రమే కాదు.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
నేను ప్రేమలోపడ్డానని నాకు ఎలా తెలుస్తుంది?