settings icon
share icon
ప్రశ్న

నరకమన్నది నిజమా? నరకమన్నది శాశ్వతమా?

జవాబు


ప్రజల్లో ఎక్కువ శాతం నరకం కంటే కూడా పరలోకం ఉందని నమ్ముతారని వినడం ఆసక్తికరంగా ఉంటుంది. బైబిల్ ప్రకారంగా పరలోకం ఉండడం ఎంత వాస్తవమో నరకం కూడా అంతే వాస్తవం. బైబిల్ ఖచ్చితంగా మరియు స్పష్టంగా యేమని బోధిస్తుందంటే మరణం తరువాత దుష్టులు/అవిశ్వాసులు పోవు నిజమైన స్థలం నరకం. మనందరం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాము (రోమా 3:23). అలాటి పాపమునకు న్యాయమైన శిక్ష మరణం (రోమా 6:23). మనందరి పాపాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవి కాబట్టి (కీర్తన. 51:4), మరియు దేవుడు అనంతమైనవాడు మరియు శాశ్వతంగా ఉండువాడు కాబట్టి, పాపమునకు, మరణమునకు జీతం కూడా అనంతం మరియు శాశ్వతం. నరకం అనేది మన పాపం ద్వార మనం పొందుకున్న అనంత మరియు శాశ్వత స్థలం.

నరకంలో మరణించిన దుష్టులు పడే శిక్ష బైబిల్ అంతటిలో “నిత్యాగ్ని” (మత్తయి 25:41), “ఆరని అగ్ని (మత్తయి 3:12), “నిందలపాలగు నిత్యము హేయులగు” (దానియేలు 12:2), అగ్ని ఆరని స్థలం (మార్కు 9:44-49), “యాతన” మరియు “జ్వాలలు” ఉండు స్థలము (లూకా 16:23-24), “నిత్యనాశనము” (2 థెస్స. 1:9), బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచు” స్థలము (ప్రకటన 14:10-11), మరియు దుష్టులు “యుయుగములు రాత్రింబగళ్లు బాధింపబడు” “అగ్ని గంధకముల గుండము” (ప్రకటన 20:10) అని వివరించబడింది.

నరకంలో దుష్టుల శిక్ష పరలోకంలో నీతిమంతుల యొక్క పరమానందం వలే ముగింపు లేనిదిగా ఉంటుంది. నరకంలో శిక్ష అనేది పరలోకంలో నీతిమంతుల వలే నిత్యము ఉంటుంది అని యేసు తానే చెప్పెను (మత్తయి 25:46). దుష్టులు ఎల్లప్పుడు ఆగ్రహమునకు మరియు దేవుని ఉగ్రతకు పాత్రులు. నరకంలో ఉన్నవారు దేవుని యొక్క న్యాయమైన తీర్పును అనుభవిస్తారు (కీర్తనలు 76:10). తమ శిక్ష న్యాయమైనదని మరియు వారే దోషులుగా పరిగణింపబడుటకు అర్హులని నరకంలోనున్న వారు గ్రహిస్తారు (ద్వితీయో. 32:3-5). అవును, నరకము అనేది నిజము. అవును, నరకమనేది ముగింపు లేకుండా యుయుగములు ఉండే బాధ మరియు శిక్ష అనుభవించు స్థలము. యేసు ద్వార, మనం ఈ నిత్య విధి నుండి తప్పించుకోగలము అందుకు దేవునికి స్తోత్రము (యోహాను 3:16, 18, 36).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

నరకమన్నది నిజమా? నరకమన్నది శాశ్వతమా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries