settings icon
share icon
ప్రశ్న

స్వస్థతను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది? క్రీస్తు ప్రాయశ్చిత్తంలో స్వస్థత ఉన్నదా?

జవాబు


1 పేతురులో 2:24లో యథాతథంగా చెప్పబడిన యెషయా 53:5దే స్వస్థతకు మూల వచనం, కానీ తరచు ఇది తప్పుడు అర్థం చెసుకొనబడుతుంది మరియు తప్పుగా రుద్దబడుతుంది. “మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.” స్వస్థత అని అనువదించబడిన పదం ఆత్మ సంబంధమైన మరియు భౌతిక సంబంధమైన స్వస్థతను తెలియజేస్తుంది. “మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన గాయములచేత స్వస్థత నొందితిరి” (1 పేతురు 2:24). ఈ వచనము పాపమును మరియు నీతిని గూర్చి మాట్లాడుతుంది, అనారోగ్యము మరియు రోగమును గూర్చి కాదు. అందుచేత, ఈ రెండు వచనాలలో స్వస్థతనొందుట అంటే క్షమింపబడుట మరియు రక్షింపబడుటను సూచిస్తుంది, భౌతిక స్వస్థత కాదు.

శరీరక స్వస్థతకు ఆత్మీయ స్వస్థతతో బైబిల్ ప్రత్యేక బంధం ఏర్పాటుచేయదు. కొన్నిసార్లు ప్రజలు వారి యొక్క విశ్వాసమును క్రీస్తుయందు ఉంచినప్పుడు శరీరకంగా స్వస్థపడతారు, కానీ అనిసార్లు ఈ విధంగా ఉండడు. కొన్నిసార్లు స్వస్థపరచడం దేవుని చిత్తం, కానీ కొన్నిసార్లు అది కాదు. అపోస్తులుడైన యోహాను మనకు సరియైన దృష్టని ఇస్తున్నాడు: “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగ మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునునదియే. మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనమెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకుకలిగినవని యెరుగుదుము” (1 యోహాను 514-15). దేవుడు ఇంకను అధ్భుతాలు చేస్తున్నాడు. దేవుడు ఇంకను ప్రజలను స్వస్థపరుస్తున్నాడు. ఆనారోగ్యం, రోగం, మరియు మరణం లోకంలో వాస్తవాలుగా ఉన్నాయి. దేవుడు తిరిగివస్తే తప్ప, నేడు సజీవంగానున్న ప్రతి ఒక్కరు చనిపోతారు, మరియు వారిలో ఎక్కువమంది (క్రైస్తవులతో సహా) శరీరక సమస్య (రోగం, అనారోగ్యం, దెబ్బల) వలన చనిపోతారు. మనలను ఎల్లప్పుడు శరీరకంగా బాగు చేయాలనికాదు దేవుని చిత్తం.

చివరకు, మన పరిపూర్ణ శరీర స్వస్థత పరలోకంలో మన కొరకు వేచియున్నది. పరలోకంలో, ఏ బాధ, అనారోగ్యం, రోగం, శ్రమ, లేదా మరణం ఉండదు (ప్రకటన 21). ఈ లోకంలోనున్న శారీరక పరిస్థితిని గూర్చి తక్కువగా అలోచించి మరియు ఆత్మీయ స్థితిపై ఎక్కువ దృష్టిని కలిగియుండాలి (రోమా 12:1-2). అప్పుడు మనం మన హృదయాలను శరీరక సమస్యలను ఎదుర్కొనవలసిన అవసరం లేని పరలోకంపై దృష్టి పెట్టవచ్చు. మన ఎదురుచూచే నిజమైన స్వస్థతను ప్రకటన గ్రంథం 21:4 వివరిస్తుంది:“ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడుచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

స్వస్థతను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది? క్రీస్తు ప్రాయశ్చిత్తంలో స్వస్థత ఉన్నదా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries