ధవళమైన మహా సింహాసనము యెదుట తీర్పు అంటే ఏంటి?ప్రశ్న: ధవళమైన మహా సింహాసనము యెదుట తీర్పు అంటే ఏంటి?

జవాబు:
ధవళమైన మహా సింహాసనము యెదుట తీర్పును గురించి ప్రకటన 20:11-15 లో మరియు మృతులు పాతాళలోకములో అగ్నిగుండములో పడవేయకబడకమునుపు జరిగిన అంతిమ తీర్పు. మనకు ప్రకటన 20:7-15 లో తెలిసికొనవచ్చును వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను, కౄరమృగము ,అబద్ద ప్రవక్తలు తానున్న చెరలోనుండి అగ్నిగుండములో పడవేయబడిన తర్వాత ఈ తీర్పు జరుగును (ప్రకటన 20:7-10). అప్పుడు గ్రంధములు విప్పబడెను (ప్రకటన20:12) ఆ గ్రంధములో ప్రతిఒక్కరి క్రియలన్నియు లిఖించబడినవి, అవి మంచివేగాని మరియు చెడ్డవేగాని, ఎందుకంటే చెప్ప్పినవన్ని, చేసినవన్ని లేక వారు ఏమైనా ఆలోచించినవన్నియు దేవునికి తెలియును, వాటినిబట్టి తమ క్రియల చొప్పున మృతులు బహుమానమేగాని లేక శిక్షయేగాని వారికి తీర్పుతీర్చును (కీర్తన 28:4; 62:12; రోమా 2:6; ప్రకటన 2:23; 18:6; 22:12).

ఈసమయములో కూడ , మరొక గ్రంధములు విప్పబడెను, దానిని "జీవ గ్రంధములు" అని ఆంటారు (ప్రకటన20:12). ఆ గ్రంధమే ఒక వ్యక్తి దేవునితోకూడ నిత్యజీవితమును స్వతత్రించుకుంటాడా లేదా అనేది మరియు అగ్నిగుండములో ఒకరు అనుభవించే నిత్య శిక్షను పొందుకంటారని నిశ్చయిస్తుంది. క్రైస్తవులు వారి క్రియలకు జవాబుదారులయినప్పటికి, క్రీస్తులో వారు క్షమించబడితిరి మరియు వారి పేరులు "భూనివాసులలోజగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంధమందు వ్రాయబడెను” (ప్రకటన17:8). లేఖనభాగాలనుండి ఆ తీర్పులో మృతులు "వారి క్రియలనుబట్టి మృతులు తీర్పునొందుతారని" మనకు కూడ తెలుసు (ప్రకటన20:12) మరియు "ఎవని పేరైనను" జీవగ్రంధమందు "వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను ". (ప్రకటన 20:15).

వాస్తవానికి మానవులందరికి అంతిమతీర్పు వుంటుంది, అవిశ్వాసులకు మరియు విశ్వాసులకు , చాల లేఖనభాగాలలో స్పష్టముగా రూఢపరచబడినది. ప్రతి వ్యక్తి ఒక దినాన్న క్రీస్తు ముందు నిలువబడి మరియు ఆమె లేక అతని క్రియలకు తీర్పుతీర్చబడవలెను. ధవళమైన మహా సింహాసనము యెదుట తీర్పు అనేది అంతిమ తీర్పని విశదమే. క్రైస్తవులు బైబిలులో ఉదహరించిన ఇతర తీర్పులతో దానిన్ని జోడించుటలో వారు నిరాకరిస్తారు, ప్రత్యేకముగా, ఎవరైతే ధవళమైన మహా సింహాసనము యెదుట తీర్పును పొందుకొనేవారు.

కొంతమంది క్రైస్తవులు నమ్మేది లేఖంభాగము మూడు వేర్వేరు తీర్పులు వస్తాయని. మొదటి తీర్పు గొఱ్ఱెలను మరియు మేకలను వేరుపరచుట లేక రజ్యములకు తీర్పు (మత్తయి 25:31-36). ఇది శ్రమకాలము తర్వాత జరుగును గాని వెయ్యి సంవత్సరములకుముందే: దాని ఉద్దేశ్యము ఎవరు వీయేండ్ల కాలములో ఉంటారో అని నిరణయిస్తుంది. రెండవది విశ్వాసుల క్రియలు, తరచుగా దానిని క్రీస్తు న్యాయపీటము యెదుట జరుగునని నిర్ణయించెను (2 కొరింథీయులకు 5:10). ఈ తీర్పుకాలములో క్రైస్తవలు వారి పనులకు వేర్వేరు స్థాయిలలో ఫలితము మరియు దేవుని సేవించినదానికి పొందుకుంటారు. మూడవది వెయ్యేండ్లకాలమున ధవళమైన మహా సింహాసనము యెదుట తీర్పుట (ప్రకటన 20:11-15). అవిశ్వాసులు వారు చేసిన క్రియలకు తీర్పుతీర్చబడతారు మరియు వారు నిత్యాకాగ్నికి మండుచున్న అగ్నిగుండంలొ పడవేయబడుటకు అప్పగించబడెను.

ఇతర క్రైస్తవులు ఈ మూడు తీర్పులు కూడ అంతిమ తీర్పుగురించే మాట్లాడుతున్నాయని నమ్ముతారు, ఈ మూడు వేర్వేరు తీర్పులు కాధు. మరొక మాటలలో, ధవళమైన మహా సింహాసనము యెదుట తీర్పును గురించి ప్రకటన 20:11-15 లోనున్నదానికి విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు వేరేగా తీర్పుజరుగును. ఎవరిపేర్లైతే జీవగ్రంధములో కనబడినవో దానిని బట్టి వారు బహుమానములను పొందూకుంటారా లేక పోగొట్టుకుంటారా అనేదానిపై నిర్ణయించుటకు తీర్పుతీర్చబడును. జీవగ్రంధములో ఎవరి పేర్లైతే కనుగొనబడలేదో వారి క్రియల చొప్పున వారికి ఎటువంటి స్థాయిలలో శిక్షను పొందుకొని మండుచున్న అగ్నిగుండంలో పడద్రోయుబడవలెనో అని నిర్ణయిస్తారు. ఎవరైతే ఈ దృక్పధాన్ని నమ్ముతారో మత్తయి 25:31-46 లో మరొక వివరణ అది ధవళమైన మహా సింహాసనము యెదుట తీర్పును ఎలా జరుగునోఅనని చెప్తుంది. వారు వాస్తవాని సూచిస్తూ విషయానికొస్తే ఈ తీర్పుకు ప్రతిఫలమే మనము ధవళమైన మహా సింహాసనము యెదుట తీర్పును గురించి ప్రకటన 20:11-15 తర్వాత చూచినదానికి సమానమే. గొఱ్ఱెలు (విశ్వాసులు) నిత్యజీవములో ప్రవేశీతారు, అయితే మేకలు (అవిశ్వాసులు) "నిత్యశిక్షలో" పడద్రోయబడతారు (మత్తయి 25:46).

మరియు వారు వారు చేసిన క్రియలనుబట్టి శిక్షింపబడతారు. బైబిలు చాల స్పష్టముగా చెప్తుంది అవిశ్వాసులు వరికి వ్యతిరేకముగా వారికై ఉగ్రతను సమకూర్చుకుంటున్నరని చెప్పబడింది (రోమా 2:5) మరియు దేవుడు "ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును" (రోమా 2:6). విశ్వాసులందరు క్రీస్తుచేత తీర్పుతీర్చబడతారు, గాని క్రీస్తు నీతిమంతము మనకు ఆపాదించడంద్వారా మరియు మన పేర్లు జీవగ్రంధములో లిఖించబడుటవలన , మనము ప్రతిఫలము పొందుతాము, గాని శిక్షింపబడము, మనక్రియల ప్రకారము. రోమా 14:10-12 మనమందరము దేవుని న్యాయపీఠము యెదుట నిలుతుము మరియు మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


ధవళమైన మహా సింహాసనము యెదుట తీర్పు అంటే ఏంటి?