settings icon
share icon
ప్రశ్న

ఒక మంచి తల్లి తండ్రిగా ఉండుట గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?

జవాబు


పిల్లల పెంపకం అనేది ఒక కష్టమైన మరియు సవాలు కలిగిన వెంచర్, కాని అదే సమయంలో అది మనము చేయకలిగిన చాలా ఫలవంతమైన మరియు పరిపూర్ణమైన పని. మన పిల్లలను దేవుని యొక్క స్త్రీలు మరియు పురుషులుగా విజయవంతముగా పెంచడం గూర్చి బైబిలు ఒక గొప్ప విషయమును చెప్పును. మనము చేయవలసిన మొదటి విషయము వారికి దేవుని వాక్యమును గూర్చిన సత్యమును బోధించాలి.

దేవుని ప్రేమించడంతో పాటుగా మరియు ఆయన ఆజ్ఞలకు మనలనుమనము లోబడేలా దైవిక ఉదాహరణగా ఉండాలి, ద్వితీ. 6:7-9 ఆజ్ఞను మనము వినవలసిన అవసరం వుంది అలాగే మన పిల్లలకు చేయమని చెప్పాలి. ఈ ప్రకరణము, అలాంటి ఉపదేశమునకు నిరంతర వర్ణన ఇచ్చును. అది ఎల్లప్పుడు జరగాలి- ఇంటిలో, రహదారిపై, రాత్రిలో, మరియు ఉదయము. మన గృహాలకు బైబిలు సంబంధమైన సత్యము పునాదిగా ఉండాలి. ఈ ఆజ్ఞల యొక్క నియమాలను అనుసరించినప్పుడు, మనము మన పిల్లలకు దేవుని ఆరాధించుట స్థిరముగా ఉండాలి, కేవలం ఆదివారం ఉదయం లేక రాతి ప్రార్థనలకు ప్రత్యేకించినది కాదు అని బోధిస్తాము.

ప్రత్యక్ష బోధన ద్వారా మన పిల్లలు ఒక గొప్ప విషయాన్ని నేర్చుకొనినప్పటికీ, వారు మనలను చూచుట ద్వారా మరింతగా నేర్చుకొనును. ఇందువలన మనము, మనము చేసే ప్రతిదానిలో జాగ్రత్తపడవలెను. మొదటిగా మనము దేవుడు మనకిచ్చిన పాత్రలను గుర్తించాలి. భార్య భర్తలు ఒకరిపట్ల ఒకరు గౌరవంకలిగి మరియు లోబడియుండాలి (ఎఫెసీ. 5:21). అదే సమయంలో, దేవుడు క్రమమును ఉంచుటకు అధికారమనే గీతను స్థాపించెను. “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను” (1 కొరింథీ. 11:3). క్రీస్తు దేవునికి తక్కువ కాదని మనకు తెలుసు, అలాగే భార్య తన భర్తకు తక్కువ కాదు. దేవుడు, ఏదైనప్పటికీ, అధికారమునకు లోబడకపోతే, క్రమము ఉండదని గుర్తించెను. ఇంటి శిరస్సుగా భర్త బాధ్యత తన భార్యను తన స్వంత శరీరమును ప్రేమించుకొనుచున్నట్లు ప్రేమించ వలసిన బాధ్యత ఉంది, అదే త్యాగపూరిత విధానములో క్రీస్తు సంఘమును ప్రేమించెను (ఎఫెసీ. 5:25-29).

ఈ ప్రేమగల నాయకత్వమునకు స్పందనగా, భార్యకు భర్త యొక్క అధికారమునకు లోబడుట కష్టము కాదు (ఎఫెసీ. 5:24; కొలస్సీ. 3:18). ఆమె ప్రాధమిక బాధ్యత తన భర్తను ప్రేమించి మరియు గౌరవించుట, జ్ఞానము మరియు పవిత్రతలో జీవించుట, మరియు గృహ బాధ్యతలను నిర్వర్తించుట (తీతు 2:4-5). స్త్రీలు పెంచుటలో సహజముగా పురుషులకన్నా ఎక్కువ ఎందుకంటే వారు వారి పిల్లల ప్రాధమిక సంరక్షకులుగా నిర్మిoమపబడ్డారు.

క్రమశిక్షణ మరియు సూచన పెంపకములో సమగ్ర భాగాలు. సామెతలు 13:24 చెప్పును, “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.” క్రమశిక్షణలేని గృహసముదాయాలలో పెరిగిన పిల్లలు అవసరంలేని మరియు విలువలేని వారిగా భావించును. వారికి దిశ మరియు స్వయo నియంత్రణ కొదువగా వుండి, మరియు వారు పెద్దవారగుచుండగా వారు తిరగబడి, మరియు ఏవిధమైన అధికారమునకు కొంచము లేక అసలు మర్యాద, దేవునితో కూడా కలిపి ఉండదు. “బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు” (సామెతలు 19:18). అదే సమయంలో, క్రమశిక్షణ ప్రేమతో సరితూగాలి, లేకపోతే పిల్లలు వ్యతిరేకముగా, నిరుత్సాహముతో, మరియు తిరుగుబాటుగా ఎదుగుదురు (కొలస్సీ. 3:21). దేవుడు క్రమశిక్షణను అది జరిగేటప్పుడు దుఃఖకరముగా గుర్తించును (హెబ్రీ. 12:11), కాని ఒకవేళ అది ప్రేమగల సూచనతో ఉంటే, అది బాలునికి చెప్పుకోదగిన లాభదాయకంగా ఉండును. “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” (ఎఫెసీ. 6:4).

పిల్లలను సంఘ కుటుంబములోను మరియు పరిచర్యలోను వారు యవ్వనులుగా ఉన్నప్పుడే పాలుపంపులు పొందేలా చేయాలి. క్రమముగా ఒక బైబిలును నమ్మే సంఘమునకు హాజరగుట (హెబ్రీ. 10:25), నీవు వాక్యము చదువుచుండగా చూచుటకు వారిని అనుమతించుట, మరియు వారితో కలిసి చదువుట. వారితో వారిచుట్టు నున్న ప్రపంచము గూర్చి వారు చూచే విధానములో చర్చించుట, మరియు ప్రతిదిన జీవితంలో దేవుని మహిమను గూర్చి వారికి బోధించుట. “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు” (సామెతలు 22:6). ఒక మంచి తల్లి తండ్రిగా ఉండటం అంటే ప్రభువుకు విధేయత చూపి మరియు ఆరాధించే నీ ఉదాహరణను అనుసరించు పిల్లలను పెంచుట.

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

ఒక మంచి తల్లి తండ్రిగా ఉండుట గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries