అన్యభాషలలో మాట్లాడే వరం ఏమిటి?


ప్రశ్న: అన్యభాషలలో మాట్లాడే వరం ఏమిటి?

జవాబు:
అన్యభాషలు మాట్లాడిన మొదటి సందర్భం అపొ. 2:1-4లో పెంతెకొస్తు దినమున జరిగెను. అపొస్తలులు బయటకు వెళ్లి, ప్రజల యొక్క సొంత భాషలలో వారికి సువార్తను ప్రకటించెను: “వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి” (అపొ. 2:11). అన్యభాషలు అని అనువదించబడిన గ్రీకు పదం యొక్క అక్షరార్థం “భాషలు.” కాబట్టి అన్యభాషల వరం కలిగియుండుట అనగా ఒక వ్యక్తికి సువార్త ప్రకటించుటకు మరొక వ్యక్తి తనకు రాని ఆ భాషలో మాట్లాడుట. 1 కొరింథీ. 12-14 అధ్యాయాలలో పౌలు అద్భుత వరములను గూర్చి చెర్చించు చున్నాడు, “సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెనని యైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెనని యైనను మీతో మాటలాడకపోయిన యెడల, నావలన మీకు ప్రయోజనమేమి?” (1 కొరింథీ. 14:6). అపొస్తలుడైన పౌలు ప్రకారం, మరియు అపొస్తలుల కార్యములలో భాషలను గూర్చి ఇచ్చిన వివరణకు సమ్మతి పలుకుతు, అతను లేక ఆమె యొక్క సొంత భాషలో దేవుని సందేశమును వినుచున్న వ్యక్తికి ఇది విలువైనది, మరియు వాటిని అనువదించని వారికి నిరుపయోగమైనది.

భాషలను అనువదించే వరమున్న వ్యక్తి (1 కొరింథీ. 12:30) అక్కడ మాట్లాడిన భాష యొక్క జ్ఞానం లేనప్పటికీ ఆ భాషలను అర్థం చేసుకొనగలడు. మరియు అందరు అర్థం చేసుకొనులాగున భాషలను అనువదించువాడు ఆ సందేశమును అందిస్తాడు. “భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను” (1 కొరింథీ. 14:13). అనువదించబడని భాషలను గూర్చి పౌలు యొక్క తీర్పు బలమైనది: “అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు” (కొరింథీ. 14:19).

భాషల వరం నేటికి కూడా వర్తిస్తుందా? 1 కొరింథీ. 13:8 భాషలు ఆగిపోయాయని చెబుతుందిగాని, ఆ ఆగిపోవుటను 1 కొరింథీ. 13:10లో “పరిపూర్ణమైన”దానితో కలుపుతుంది. ప్రవచనం మరియు జ్ఞానం “ఆగిపోవుట”ను మరియు భాషలు “ఆగిపోవుటను “పరిపూర్ణమైనది” రాక మునుపు అన్యభాషలు ఆగిపోయాయని సూచించుటకు కొందరు గ్రీకు క్రియలలోని కాలము యొక్క మార్పును చూపిస్తారు. ఇది సాధ్యమైనప్పటికీ, వాక్యభాగము నుండి ఇది స్పష్టమగుటలేదు. అన్యభాషలు మాట్లాడుట రానున్న దేవుని తీర్పుకు చిహ్నంగా ఉందనుటకు రుజువుగా కొందరు యెషయా 28:11 మరియు యోవేలు 2:28-29 వైపు చూపిస్తారు. అన్యభాషలు “అవిశ్వాసులకు చిహ్నమని” 1 కొరింథీ. 14:22 వర్ణిస్తుంది. ఈ తర్కము ప్రకారం, యేసు క్రీస్తును మెస్సీయగా తిరస్కరించినందుకు ఇశ్రాయేలీయులకు దేవుడు తీర్పుతీర్చబోతున్నాడు అని చెప్పుటకు అన్యభాషల వరం యూదులకు హెచ్చరిక వంటిది. కాబట్టి, దేవుడు ఇశ్రాయేలుకు నిజముగా తీర్పుతీర్చినప్పుడు (క్రీ.శ. 70లో రోమీయుల ద్వారా యెరూషలేము యొక్క నాశనముతో), భాషల వరము దాని యొక్క ఉద్దేశమును నెరవేర్చదు. ఈ ఆలోచన సాధ్యమైనప్పటికీ, భాషల యొక్క ప్రాథమిక ఉద్దేశము నెరవేర్చబడినదనుట వాటి యొక్క ముగింపును కోరదు. భాషలు మాట్లాడుట నిలిచిపోయిందని లేఖనము స్పష్టముగా తెలుపదు.

అదే సమయంలో, భాషలు మాట్లాడుట నేడు సంఘములో ఉన్నయెడల, అవి లేఖన ఆధారంగా ఉపయోగించాలి. అది నిజమైన స్పష్టమైన భాషగా ఉండాలి (1 కొరింథీ. 14:10). వేరే భాష మాట్లాడు వ్యక్తితో దేవుని వాక్యమును పంచుకోవాలనే ఉద్దేశముతో వాటిని ఉపయోగించాలి. అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞకు అనుసంధానంగా అది ఉండాలి, “భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెనుగాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును” (1 కొరింథీ. 14:27-28). అది 1 కొరింథీ. 14:33కు అనుగుణంగా కూడా ఉండాలి, “ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికి కర్త కాడు.”

మరొక భాష మాట్లాడే వ్యక్తితో మాట్లాడుటకు దేవుడు ఒక వ్యక్తికి నిశ్చయముగా అన్యభాషల వరం ఇవ్వగలడు. ఆత్మీయ వరములను ఇచ్చుటలో పరిశుద్ధాత్ముడు సర్వాధికారము కలిగియున్నాడు (1 కొరింథీ. 12:11). వారు భాషల పాటశాలకు వెళ్లకుండా, ప్రజలతో వారి సొంత భాషలలో మాట్లాడగల శక్తి వెంటనే పొందగలిగితే సువార్తికులు ఎంత గొప్ప ఫలములు పొందగలరో ఒకసారి ఊహించండి. అయితే, దేవుడు దీనిని చేయుచున్నట్లు అనిపించుట లేదు. అది చాలా అవసరమైనప్పటికీ క్రొత్త నిబంధన కాలంలో సంభవించుచున్నట్లు నేడు భాషలు నేడు సంభవించుట లేదు. అన్యభాషలు మాట్లాడు వరమును ఉపయోగించుచున్నాము అని చెప్పు ఎక్కువమంది విశ్వాసులు వాటిని లేఖన అనుసారంగా చేయుట లేదు. భాషల వరము ఆగిపోయిందని లేక సంఘము కొరకు దేవుని ప్రణాళికలో నేడు అవి భాగము కావు అనే ఆలోచనకు ఈ వాస్తవాలు నడిపిస్తాయి.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
అన్యభాషలలో మాట్లాడే వరం ఏమిటి?