settings icon
share icon
ప్రశ్న

గే/స్వలింగ వివాహమును గూర్చి బైబిల్ ఏమి చెప్తుంది?

జవాబు


బైబిల్ స్వలింగ సంపర్కంను గూర్చి వివరిస్తుంది గానీ, గే వివాహం/ స్వలింగ వివాహం గూర్చి స్పష్టంగా చెప్పదు. అయితే, స్వలింగ సంపర్కము అనైతిక మరియు అసహజమైనదిగ బైబిల్ ఖండిస్తుంది. స్వలింగ సంపర్కం హేయమైనదిగా, ద్వేషింపబడే పాపంగా లేవీయకాండము 18:22 తెలియజేస్తుంది. స్వలింగ కోరికలు మరియు చర్యలు తుచ్ఛమైనవిగా, స్వాభావిక విరుద్ధంగా, అవాచ్యమైనవిగా, అసభ్యమైనవిగా రోమా 1:26-27 తెలియపరుస్తుంది. స్వలింగసంయోగులు అన్యాయస్థులు మరియు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని 1 కొరింథీ. 6:9లో చెప్పబడింది. పురుష సంయోగుల కోరికలు మరియు చర్యలు బైబిల్ లో ఖడించబడ్డాయి కాబట్టి, స్వలింగులు “వివాహం” చేసుకోవడం దేవుని చిత్తం కాదు, మరియు వాస్తవానికి పాపం అని స్పష్టమౌతుంది.

ఎప్పుడైనా బైబిల్ వివాహం గురించి చెప్పినప్పుడు, అది పురుషునికి మరియు స్త్రీకి మధ్య జరుగుతుంది. మొదట వివాహం గురించి ఆదికాండము 2:24లో పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని వివరించబడింది. వివాహమునకు కావలసిన హెచ్చరికలను ఇచ్చిన కొన్ని వాక్యభాగాల్లో అనగా 1 కొరింథీ. 7:2-16 మరియు ఎఫెసీ. 5:22-33 వివాహము అనేది పురుషునికి మరియు స్త్రీకి మధ్య జరుగుతుందని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. బైబిల్ అనుసరించి మాట్లాడుతున్నాను, వివాహం అనేది పురుషుడు మరియు స్త్రీ యొక్క జీవితకాల ఐక్యత, మొదటిగా కుటుంబమును కట్టుటకొరకు మరియు ఆ కుటుంబమునకు ఒక స్థిరమైన వాతావరణమును అందించడం.

అయితే, వివాహముయొక్క ఈ అవగాహనను గూర్చి ప్రదర్శించడానికి కేవలం బైబిల్ ను మాత్రమే ఉపయోగించకూడదు. బైబిల్ వివాహ దృక్కోణం ప్రపంచ చరిత్రలో ప్రతి మానవ నాగరికత యొక్క సార్వత్రిక వివాహ అవగాహనగా ఉంది. చరిత్రకారులు పురుష స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా ఉన్నారు. పురుషులు మరియు స్త్రీలు మానసికంగా మరియు ఉద్వేగకంగా ఒకరికొకరు పూర్తి చేసుకొనుట కొరకు రూపొందించబడ్డారని అధునాతన లౌకికపరమైన మనోవిజ్ఞాన శాస్త్రం చెప్తుంది. కుటుంబ పరంగా, పురుషునికి మరియు స్త్రీకి ఇద్దరు మంచి భార్యభర్తలుగా మంచి లింగ ఆదర్శకులుగా నిలవడం పిల్లల్ని పెంచాడానికి ఉత్తమ పర్యావరణంగా పనిచేస్తుంది అని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తారు. మనోవిజ్ఞానశాస్త్రం పురుష స్వలింగ వివాహమునకు వ్యతిరేకంగా వాదిస్తుంది. సృష్టి/భౌతిక పరంగా, లైంగికంగా పురుషులు మరియు స్త్రీలు “తగిన” విధంగా రూపొందించబడ్డారు. లైంగిక సంబంధం యొక్క “సహజమైన” ఉద్దేశం సంతానోత్పత్తి చేయడం, స్పష్టంగా పురుషునికి మరియు స్త్రీకి మధ్య లైంగిక సంబంధం మాత్రమే ఈ ఉద్దేశమును నెరవేర్చుతుంది. ప్రకృతి పురుష స్వలింగ వివాహమునకు వ్యతిరేకంగా వాదిస్తుంది.

బైబిల్, చరిత్ర, మనోవిజ్ఞానశాస్త్రం, మరియు ప్రకృతి ఇవన్నీ కూడా స్త్రీ మరియు పురుషుడు మధ్య వివాహము కొరకు వాదిస్తున్నవి కాబట్టి –ఈ రోజు అలాటి వివాదం ఎందుకు ఉంది? పురుష స్వలింగ/ స్వలింగ వివాహాలను వ్యతిరేకించినవారు ఎంత గౌరవంగా వ్యతిరేకతను ప్రదర్శించినప్పటికీ ద్వేషకులుగా, దురభిమానులుగా ఎందుకు పరిగణింపబడ్డారు? కొంత పౌర సంఘం రూపం కలిగి వివాహ దంపతులు కలిగిన హక్కులను పురుష దంపతులు కూడా కలిగియున్న వారిని చాలా మంది ప్రజలు, ధార్మికమైనవారు, అధార్మికులు, అనుమతించినను – లేదా కనీసం వ్యతిరేకించినప్పుడు, పురుష స్వలింగ వివాహా హక్కుల ఉద్యమం పురుష స్వలింగ/ స్వలింగ వివాహాలను ఎందుకు ముందుకు నెట్టుతుంది?

బైబిల్ ప్రకారంగా, సమాధానం ఏంటంటే, స్వలింగ సంపర్కం అనేది అనైతికం మరియు అసహజమైనదని అందరికీ అంతర్గతంగా తెలుసు, మరియు ఈ అంతర్గత ఆలోచనను అణచివేయడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే స్వలింగ సంపర్కమును సాధారణపరచడం మరియు దానిని వ్యతిరేకించినవారెవరినైనను మరియు వ్యతిరేకించినవారందరిపై దాడి చేయడం. స్వలింగ వివాహాలను సాధారణపరచుటకు గల ఉత్తమమైన మార్గం ఏంటంటే సాంప్రదాయ వ్యతిరేక లింగాల వివాహముతో పురుష స్వలింగ/ స్వలింగ వివాహమును సమానపరచుట. రోమా 1:18-32 దీనిని గూర్చి వివరిస్తుంది. సత్యము తెలియబడింది ఎందుకంటే దేవుడు దానిని విశదపరచాడు గనుక. సత్యము అసత్యముగా మార్చబడింది. అసత్యం కొనసాగించబడింది మరియు సత్యము అణనద్రోక్కబడి దాడి చేయబడింది. పురుష స్వలింగ హక్కుల ఉద్యమములో ఉన్నవారు దానికి వ్యతిరేకంగా ఉన్నవారిపై చూపించు తీక్షణమైన ఆగ్రహము వారి యొక్క రక్షణాత్మకము లేని స్థితిని సూచిస్తుంది. స్వరమును పెంచడం ద్వార బలహీనమైన స్థానమును అధిగమించడానికి ప్రయత్నించడం చర్చా పుస్తకంలో పురాతన కుట్ర. రోమా 1:31, “అవివేకులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, నిర్దయుల” కంటే ఆధునిక గే (gay) హక్కుల విషయపట్టికకు మరింత ఖచ్చితమైన వివరణ బహుశా మరొకటి ఉండదు.

పురుష స్వలింగ/స్వలింగ వివాహాలకు అనుమతి ఇవ్వడం అంటే బైబిల్ స్పష్టంగా మరియు నిలకడగా పాపం అని ఖండించే స్వలింగ సంపర్క జీవన విధానాన్ని అంగీకరించడం. పురుష స్వలింగ/ స్వలింగ వివాహాల ఆలోచనకు క్రైస్తవులు వ్యతిరేకంగా నిలబడాలి. ఇంకా, బైబిల్ కు పూర్తిగా వేరుగా ఉన్న సందర్భాల్లో కూడ పురుష స్వలింగ/ స్వలింగ వివాహాలను గూర్చిన వాదనలు వాటికి వ్యతిరేకంగా ఉన్నాయి. వివాహము అనేది పురుషుడు మరియు స్త్రీకి మధ్య జరిగేదని గ్రహించుటకు ఇవాంజిలికల్ క్రైస్తవుడు అయ్యుండాల్సిన అవసరం లేదు.

బైబిల్ ప్రకారంగా, వివహము అనేది పురుషునికి మరియు స్త్రీకి మధ్య జరిగేదిగా దేవుడు నియమించాడు (ఆది. 2:21- 24; మత్తయి 19:4-6). పురుష స్వలింగ/స్వలింగ వివాహం అనేది వివాహమునకు కారకుడైన దేవునికి పట్ల నేరం చేయడం మరియు వివాహ సంస్థకు వక్రబుద్ధి కలిగియుండడం. క్రైస్తవులంగా, మనం పాపంను విస్మరించకూడదు లేదా క్షమించకూడదు. బదులుగా, యేసుక్రీస్తు ద్వార అందరికి, స్వలింగ సంపర్కులకు అందుబాటులో నున్న దేవుని ప్రేమను మరియు పాపక్షమాపణను పంచాలి. ప్రేమతో సత్యమును మనం మాట్లాడాలి (ఎఫెసీ. 4:15) మరియు సాత్వికముతో మరియు భయముతో సత్యమును గట్టిగా చెప్పాలి (1 పేతు. 3:15). క్రైస్తవులంగా, మనం సత్యము కొరకు నిలువబడినప్పుడు ఫలితంగా వ్యక్తిగత దాడులు, అవమానాలు మరియు హింసలు ఎదురౌతాయి, మనం యేసు మాటలను జ్ఞాపకం చేసుకోవాలి: “లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబందులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది” (యోహా. 15:18-19).

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

గే/స్వలింగ వివాహమును గూర్చి బైబిల్ ఏమి చెప్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries