నాకు వ్యతిరేకముగా పాపముచేసినవారిని నేను ఏవిధంగా క్షమించగలను?ప్రశ్న: నాకు వ్యతిరేకముగా పాపముచేసినవారిని నేను ఏవిధంగా క్షమించగలను?

జవాబు:
ప్రతిఒక్కరు తప్పు చేస్తారు, అసహ్యించబడ్డవారు, మరియు ఒకానొక విషయములో పాపముచేసినవారే. అటువంటి అసహ్యమైనవి ఎదురాడినపుడు క్రైస్తవులు ఏవిధంగా వాటిని ఎదుర్కొంటారు? బైబిలు ప్రకారము, మనము ఇతరులను క్షమించాలి. ఎఫెసీయులకు 4:32 ప్రకటించిననట్లు, " ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి." అటువలెనె, కొలస్సీయులకు 3:14 చాటిస్తుంది "ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకనినొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి." ఈ రెండు లేఖనములలో కీలకమైనది దేవుడు మనలను క్షమించిన విధంగా మనము ఇతరులను క్షమించబద్దులమై యున్నాము. మనము ఎందుకు క్షమించాలి? ఎందుకంటే మనము క్షమించబడినాము కాఅబట్టి! క్రైస్తవులు ఎవరైతేకారో, ఏదిఏమైనా, వారు దేవునిచేత క్షమించబడినవారు కారు మరియు వారికి అటువంటి శక్తి లేదు లేక అట్లాంటి ఇతరులను క్షమించాలనే కోరిక కూడాలేదు.

క్షమించడం అనేది చాల సులభతరమైనది అవుతుంది ఎప్పుడంటే ఎవరైతే ధుఃఖముతోను మరియు పశ్చాత్తాప హృదయముతోను వచ్చి క్షమాపణ వేడుకొంటారో వారిని మాత్రమే క్షమించడం సాధ్యమే. బైబిలు చెప్తుంది మనము ఇతరులను క్షమించాలని, ఎటువంటి షరతులేకుండా, ఎవరైతే మనకు వ్యతిరేకముగా పాపముచేస్తారో వారిని. సత్యముగా ఒకవ్యక్తిని క్షమించుటను ధిక్కరించినట్లయితే అది ఆగ్రహాన్ని, చేదుతనాన్ని, మరియు కోపాన్ని చూపించినట్లే, కాని అందులో ఒకటికూడా నిజ క్రైస్తవునికుండాల్సిన లక్షణము కాదు. ప్రభువునేర్పిన ప్రార్థనలో, మనము దేవునిని మన పాపములను క్షమించమని అడుగుతాం, అదేవిధంగా ఎవరైతే మనకు వ్యతిరేకముగా పాపముచేసారో వారిని క్షమించుటకు (మత్తయి 6:12). యేసు మత్తయి 6:14-15 లో ఈవిధంగా చెప్పెను "మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపుతండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు." ఇతరలేఖనభాగల వెలుగులో చూచినట్లయితే అది దేవుని క్షమాపణగుణాన్ని చెప్తుంది, మత్తయి 6:14-15 లేఖనమును మనము భాగ అర్థముచేసుకున్నాము అనుటకుగుర్తేంటంటే ఎవరైతే ఇతరులను క్షమించుటను తిరస్కరిస్తారో వారు, వారి జీవితాలలో దేవుని క్షమాపణగుణాన్ని అనుభవించలేదని అర్థమవుతుంది.

దేవుని ఆఙ్ఞలలో ఏఒక్కదానికైనా అవిధేయులమయినట్లైతే, మనము ఆయనకు వ్యతిరేకముగా పాపముచేసినవారమే. మనమెన్నడైనా ఇతరవ్యక్తిని తప్పుగా ఆలోచించినట్లయితే, మనము ఆవ్యక్తికి వ్యతిరేకముగా పాపముచేయుటయే కాకుండా, దేవునికి వ్యతిరేకముగా పాపముచేసినవారమవుతాం. దేవుడు మన అన్ని అతిక్రమములను ఎంతమట్టుకో క్షమించిన స్థాయిని సరిగా పరిశీలించినట్లయితే, అప్పుడు మనము ఇతరుల పట్ల కృపను చూపించకుండా ఆపుచేయుటకు హాక్కులేదని మనకు గ్రహింపుకలుగుతుంది. ఇతరులు మనపట్ల వ్యతిరేకముగా పాపముచేసిన దానికంటే అనంతమైనరీతిలో దేవునికి వ్యతిరేకముగా మనము పాపముచేసినవారము. దేవుడు ఎంతో అధికముగా మనలను క్షమిచినప్పుడు, చిన్న చిన్న విషయాలలో ఇతరులను మనము క్షమిచకుండా ఎందుకని తిరస్కరిస్తాము? యేసు మత్తయి 18:23-25లో చెప్పిన ఉపమానము ఈసత్యాన్ని వివరించుటకు ఎంతో శక్తివంతమైనది. దేవుడు వాగ్ధానము చేసాడు మనము ఆయన దగ్గరకువచ్చి క్షమాపణ అడిగినట్లయితే , అతడు ఉచితముగా మనపాపములను క్షమించి ఆయన క్షమాపణ నుగ్రహించును (1యోహాను 1:9). మనము క్షమాపణా గుణాన్ని చూపించినపుడు అది దాని హద్దులను ఎరుగకూడదు, అదేవిధముగా, దేవుని క్షమాపణా గుణము కూడా హద్దులులేనిది (లూకా 17:3-4).


తెలుగు హోం పేజికు వెళ్ళండి


నాకు వ్యతిరేకముగా పాపముచేసినవారిని నేను ఏవిధంగా క్షమించగలను?