మనము మన స్నేహితులను మరియు కుటుంబ సభ్యులను పరలోకములోచూచుటకు మరియు తెలిసికొనుటకు, అవకాశమున్నదా?ప్రశ్న: మనము మన స్నేహితులను మరియు కుటుంబ సభ్యులను పరలోకములోచూచుటకు మరియు తెలిసికొనుటకు, అవకాశమున్నదా?

జవాబు:
చాలమంది మొట్టమొదటిగా వారు పరలోకమునకు వెళ్ళినపుడు కోరుకొనేది ఏంటంటే వారి కంటే ముందుగానే పరలోకమునకు వెళ్ళిన వారిని స్నేహితులను మరియు అతిసన్నిహితులను చూడవలెనని ఆశవుందని చెప్తారు. నిత్యత్వములో, మన స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులను చూచుటకు, తెలిసికొనుటకు, మరియు గడుపుటకు అక్కడ సమృద్ధియైన సమయము కలదు. ఏదిఏమైనా, పరలోకములో దృష్ఠీకరించుట అనేది మాత్రము ప్రాధాన్యమైనదికాదు. మనము ఎక్కువగా దేవునిని ఆరాధించుటలోను మరియు పరలోకములో జరిగే అధ్భుతములతోను మనము ఆసమయాన్ని కేంద్రీకరిస్తాము. మన సన్నిహితులతో మనము మరల కలసికొన్నప్పుడు కేవలము మన జీవితాలలో అనుభవించిన దేవుని కృపను మరియు ఆయన మహిమగల కార్యములగూర్చి, తన అధ్భుతమైన ప్రేమ మరియు తన మహత్కార్యములనుగూర్చి లెక్కించుటలో ముణిగివుంటాము. మనము ఇతర విశ్వాసుల సహవాసములో ఆయనను స్తుతించుటలో మరియు ఆరధించుటలో అంతకంటే ఎక్కువగా ఆనందిస్తాము, ప్రతేకముగా మనము భూమిమీద ప్రేమించినవారిని.

మన మరణముతర్వాత జీవితములో ప్రజలను గుర్తిస్తామా లేదా అనేదాన్ని గురించి బైబిలు ఏమని చెప్తున్నది? రాజైన సౌలు కర్ణపిశాచము గలది యొకతె నున్నపుడు ఆమెను నేనెవరిని నీకొరకు రప్పించవలెనని అడుగగా అతడు సమూయేలును మృతులలోనుండీ పిలువగా సమూయేలును గుర్తించెను ( 1 సమూయేలు 28: 8-17). దావీదు కుమారుడైన పసిబిడ్డ చనిపోయినపుడు, దావీదు ప్రకటించెను, "నేను వాని యొద్దకు పోవుదునుగాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను" (2సమూయేలు 12:23). దావీదు తన కుమారుడు పసిబిడ్డగా చనిపోయినప్పటికి అతడు పరలోకములో తన కుమారుని గుర్తించగలనని ఊహించెను. లూకా 16:19-31 లో , అబ్రాహాము, లాజరు, మరియు ధనికుడు అందర్ని మరణము తర్వాత గుర్తించవచ్చు. రూపాంతరము చెందినపుడు, మోషే మరియు ఏలియా ను కూడ గుర్తించవచ్చు (మత్తయి 17:3-4). ఈ దిగువ ఉదాహరణలలో, బైబిలు కూడ మరణము తర్వాత మనుష్యులను గుర్తించవచ్చని సూచిస్తుంది.

బైబిలు ఏమని చెప్తున్నదంటే మనము పరలోకములోనికి వెళ్ళినపుడు మనము "ఆయనవలే (యేసు); ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనవలె పోలియుందుము" (1యోహాను 3:2). మొదటి ఆదాము భూసంబందిగానున్నపటి శరీరమున్నరీతిగానే, vక్రీస్తువలె మన పునరుత్ఢానముపొందిన శరీరమువలెనుండును (1 కొరింథీయులకు 15:47). "మరియు మనము మంటినుంది పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధిపోలికను ధరింతుము. క్షయమైన ఈ శరీరము అక్ష్యతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నాది" 1 కొరింథీయులకు 15:49,53). చాలమంది యేసు పునరుత్ఢానము తర్వాత ఆయనను గుర్తించారు (యోహాను 20:16,20;21:12; 1 కొరింథీయులకు 15:4-7). యేసు మహిమ శరీరముతోనున్నపుడు ఆయననే గుర్తించినట్లయితే, మనము మహిమ శరీరములతోనున్నపుడు కూడ గుర్తించపోక తప్పదు. మన సన్నిహితులను చూడగలడం అనేది మహిమతోకూడిన పరలోక దృక్పధము, గాని పరలోకము అనేది మనకంటే ఎక్కువగా దేవునిగురించి ఉండేది. ఎంతగొప్ప సంతోషకరమైన విశేషము మన ప్రియమైనవారితో కలవటం మరియు వారితో కలసి దేవునిని నిత్యత్వములో ఆరాధించటం.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


మనము మన స్నేహితులను మరియు కుటుంబ సభ్యులను పరలోకములోచూచుటకు మరియు తెలిసికొనుటకు, అవకాశమున్నదా?