settings icon
share icon
ప్రశ్న

ఒక అబద్ధ బోధకుడిని/అబద్ధ ప్రవక్తను నేను ఎలా గుర్తించగలను?

జవాబు


యేసు “అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు” వచ్చి మరియు దేవుడు ఎన్నుకొనినవారిని మోసం చేయుటకు ప్రయత్నిoచునని వారించెను (మత్తయి 24:23-27; 2 పేతురు 3:3 మరియు యూదా 17-18 కూడా చూడుము). అబద్ధమునకు మరియు అబద్ధ బోధకులకు వ్యతిరేకంగా మిమ్ములను మీరు కాపాడుకొనుటకు శ్రేష్ఠమైన మార్గం సత్యమును తెలిసికోవడం. ఒక నకిలీనుకనిపెట్టుటకు, నిజమైనదానిని అధ్యయనం చేయాలి. ఏ విశ్వాసియైన “సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను” (2 తిమోతి 2:15) మరియు అబద్ధపు సిద్ధాంతమును గుర్తించేలా జాగ్రత్తగా బైబిలును అధ్యయనం చేయును. ఉదాహరణకు, మత్తయి 3:16-17లో తండ్రి, కుమార, మరియు పరిశుద్ధాత్మ యొక్క క్రియలను చదివిన ఒక విశ్వాసి వెంటనేత్రిత్వమును ఖండించే యే సిద్ధాంతమునైనా ప్రశ్నించును. అందువలన, మొదటి మెట్టు బైబిలును అధ్యయనం చేసి మరియు ప్రతి బోధను లేఖనము చెప్పినదానిని బట్టి తీర్పుతీర్చాలి.

యేసు, “చెట్టుదాని పండువలన తెలియబడును” అని చెప్పెను (మత్తయి 12:33). మనము “పండు” కొరకు చూచినప్పుడు, ఇక్కడ యే బోధకుడైనా అతడి లేక ఆమె బోధ యొక్క ఖచ్చితత్వమును గుర్తించడానకి అన్వయించుటకు మూడు నిర్దిష్ట పరీక్షలు ఉన్నవి:

1) యేసు గూర్చి ఈ బోధకుడు ఏమి చెప్పును? మత్తయి 16:15-16లో యేసు-“మీరైతేనేను ఎవడనని చెప్పుకొను చున్నారని వారి నడిగెను?” అందుకు పేతురు, “నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” అని చెప్పెను, మరియు ఈ సమాధానం కొరకు పేతురు “ధన్యుడవు” అని పిలువబడెను. 2 యోహాను 9లో, మనం చదువుతాము, “క్రీస్తుబోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు.” మరియొక మాటలలో, యేసుక్రీస్తు మరియు విమోచించే పనిఅత్యధికమైన ప్రాముఖ్యత; ఎవరైతే యేసు దేవునితో సమానం అనే దానిని ఖండించి, ఎవరైతే యేసు త్యాగపూరిత మరణమును పక్కన పెట్టునో, లేక యేసు మరణమును తిరస్కరించునో వారెవరైనా జాగ్రత్తగా ఉండుము. 1 యోహాను 2:22, “యేసు, క్రీస్తు కాడనిచెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు?తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి.”

2) ఈ బోధకుడు సువార్తను బోధించునా? లేఖనముల ప్రకారం సువార్త అనగా యేసు మరణము, సమాధి, మరియు పునరుత్థానము గూర్చిన శుభవార్త (1 కొరింథీ 15:1-4). “దేవుడు నిన్ను ప్రేమించును,” “దేవుడు మనలను బీదలను పోషించుమని కోరును,” మరియు“దేవుడు నిన్ను ధనవంతునిగా వుండాలని కోరును” అనే వాక్యాలు వినడానికి మంచిగా ఉండును, కాని అవి పూర్తిగా సువార్త వర్తమానము కాదు. గలతీ 1:7లో పౌలు, “క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు” అని వారిన్చును. దేవుడు మనకిచ్చిన వర్తమానమును ఎవరు, ఎంత గొప్ప బోధకుడైనా, మార్చేఅధికారం లేదు. “మీరు అంగీకరించిన సువార్తగాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవునుగాక” (గలతీ 1:9).

3) ఈ బోధకుడు ప్రభువును మహిమపరిచే స్వభావ లక్షణాలను ప్రదర్శించునా? అబద్ధ బోధకుల గూర్చి యూదా 11, “వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.” మరియొక మాటలలో, ఒక అబద్ధ ప్రవక్త అతని అహంకారమును బట్టి తెలియబడును (దేవుని ప్రణాళికకు కయీను తిరస్కారం), దురాశ (ధనము గూర్చి బిలాము ప్రవచనం), మరియు తిరుగుబాటు (మోషేపై కోరహు తననుతాను ప్రోత్సాహం). అలాంటి ప్రజలపట్ల జాగ్రత్తగా వుండి మరియు మనము వారిని వారి పండ్లను బట్టి తెలిసికొందుమని యేసు చెప్పెను (మత్తయి 7:15-20).

మరింత అధ్యయనం కొరకు, సంఘములోనే ఉండే అబద్ధ బోధకులను ఎదుర్కొనుటకు వ్రాయబడిన అలాంటి బైబిలు పుస్తకాలను పునఃసమీక్షించాలి: గలతీ, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, మరియు యూదా. తరచుగా ఒక తప్పుడు బోధకుని/తప్పుడు ప్రవక్తను పట్టుకొనుట కష్టం, సాతాను తానేవెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు (2 కొరింథీ 11:14).

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

ఒక అబద్ధ బోధకుడిని/అబద్ధ ప్రవక్తను నేను ఎలా గుర్తించగలను?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries