నిత్య భద్రత బైబిల్ ఆధారమైనదేనా?


ప్రశ్న: నిత్య భద్రత బైబిల్ ఆధారమైనదేనా?

జవాబు:
ప్రజలు క్రీస్తును తమ రక్షకునిగా యెరిగినప్పుడు, వారికి నిత్య భద్రతను నిశ్చయించు దేవునితో అనుబంధంలోనికి తేబడతారు. యూదా 24 ప్రకటిస్తుంది, “తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి.” దేవుని శక్తి విశ్వాసిని పడిపోకుండా కాపాడుతుంది. ఆయన మహిమగల సన్నిధిలో మనలను ప్రవేశపెట్టుట ఆయన బాధ్యత, మన బాధ్యత కాదు. మన నిత్య భద్రత అనేది దేవుడు మనలను భద్రపరచుట యొక్క పరిణామమే గాని, మనం మన సొంత రక్షణను కాపాడుకొనుట కాదు.

ప్రభువైన యేసు ప్రకటించాడు, “నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు.వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు” (యోహాను 10:28-29b). యేసు మరియు తండ్రి మనలను వారి చేతులతో గట్టిగా పట్టుకొనియున్నారు. తండ్రి మరియు కుమారుని యొక్క పట్టు నుండి మనలను ఎవరు వేరుచేయగలరు?

విశ్వాసులు “విమోచన దినము కొరకు ముద్రించబడిరి” అని ఎఫెసీ. 4:30 మనకు చెబుతుంది. విశ్వాసులకు నిత్య భద్రత లేని యెడల, వారి ముద్ర విమోచన దినము వరకు గాక, పాపము, దేవుని విడిచిపెట్టు, లేక అవిశ్వాస దినము వరకు మాత్రమే ఉండేది. యేసు క్రీస్తును నమ్మువారు “నిత్య జీవమును” పొందుదురని యోహాను 3:15-16 చెబుతుంది. ఒక వ్యక్తికి నిత్య జీవమును ఇవ్వగోరి, దానిని మధ్యలోనే తీసుకున్నయెడల, అది ఎన్నడు “నిత్యమైనది” కాదు కదా. నిత్య భద్రత నిజాము కానియెడల, బైబిల్ లో ఉన్న నిత్య జీవము పొరపాటుగా పరిగణించబడుతుంది.

నిత్య భద్రతకు అత్యంత బలమైన వాదము రోమా 8:38-39లో ఉంది, “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను.” మన నిత్య భద్రత దేవుడు విమోచించిన వారి పట్ల ఆయనకున్న ప్రేమ మీద ఆధారపడియుంది. మన నిత్య భద్రత క్రీస్తు ద్వారా కొనబడినది, తండ్రి ద్వారా వాగ్దానము చేయబడినది, మరియు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినది.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
నిత్య భద్రత బైబిల్ ఆధారమైనదేనా?