కడవరి కాలముల యొక్క ప్రవచన ప్రకారం ఏమి జరుగబోతుంది?


ప్రశ్న: కడవరి కాలముల యొక్క ప్రవచన ప్రకారం ఏమి జరుగబోతుంది?

జవాబు:
కడవరి కాలములను గూర్చి పరిశుద్ధ గ్రంథములో చాలా చెప్పబడింది. దరిదాపుగా పరిశుద్ధ గ్రంథములోని ప్రతి పుస్తకము కడవరి కాలములను గూర్చి కొంతైనా ప్రవచనమును కలిగి ఉన్నాయి. ఈ ప్రవచనములన్నిటిని తీసుకొని వాటిని సరిగా ఒకచోట నిర్వహించడం అనేది చాలా కష్టం. కడవరి కాలములో ఏమి జరుగుతుందని పరిశుద్ధ గ్రంథము చెప్తుందో అనే విషయంపై ఈ క్రింద చాలా క్లుప్త సారాంశం ఇవ్వబడింది.

ఎత్తబడుట (1 థెస్స. 4:13-18; 1 కొరింథీ. 15:51-54) అనే ఒక సంఘటన ద్వారా క్రీస్తు తిరిగి జన్మించిన విశ్వాసులందరినీ ఈ భూమిపై నుండి తొలగించబోతున్నాడు. క్రీస్తు యొక్క తీర్పు సింహాసనము వద్ద, ఈ విశ్వాసులు తమ మంచి క్రియలను బట్టి మరియు ఈ భూమిపై వారు గడిపిన కాలములో నమ్మకమైన సేవ చేసినట్లయితే వారు బహుమానం పొందుతారు, ఒకవేళ సేవ చేయకుండా మరియు విధేయత చూపకుండా ఉన్నట్లయితే నిత్యజీవితమును పోగొట్టుకుంటారు (1 కొరింథీ. 3:11-15; 2 కొరింథీ. 5:10).

అంత్యక్రీస్తు (గొప్ప మృగము) అధికారములోకి వచ్చి ఇశ్రాయేలుతో ఏడు సంవత్సర కాలము పాటు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు (దానియేలు 9:27). ఈ ఏడు సంవత్సర కాలమునే“శ్రమల” కాలము అని పిలుస్తారు. ఈ శ్రమ కాలములో, భయంకరమైన యుద్ధాలు, కరవు, తెగుళ్ళు, మరియు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. పాపము, దుష్టత్వము మరియు చెడుతనముపై దేవుడు తన ఉగ్రతను ధారపోస్తాడు. ప్రకటన గ్రంథములో చెప్పబడిన నలుగురు గుఱ్ఱపు రౌతులు, మరియు ఏడు ముద్రలు, బూర మరియు తీర్పు అనే పాత్ర ఇవన్నియు ఈ శ్రమల కాలంలోనే జరుగుతాయి.

షుమారు ఈ ఏడు సంవత్సరముల మధ్య కాలములో, ఇశ్రాయేలుతో ఈ అంత్యక్రీస్తు చేసిన సమాధాన ఒప్పందాన్ని మీరి దానిపై యుద్ధాన్ని చేస్తాడు. ఈ అంత్యక్రీస్తు “నాశనకరమైన హేయవస్తువు”ను చేసి యెరూషలేము దేవాలయములో తన సొంత విగ్రహమును చేసి ఆరాధించుటకు గాను దానిని ఆ ఆలయములో, అనగా పునఃనిర్మించబడియున్న ఆలయములో, నిలువబెడతాడు (దానియేలు 9:27; 2 థెస్స. 2:3-10). ఈ శ్రమల కాలము యొక్క ద్వితీయార్ధమును “మహా శ్రమల కాలము” అని పిలుస్తారు (ప్రకటన 7:14) మరియు“యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము”గా అది ఉంటుంది (యిర్మీయా30:7).

ఏడు సంవత్సరముల శ్రమ కాలము తరువాత, అంత్యక్రీస్తు యెరూషలేము మీద తన తుది దాడిని చేస్తాడు, ఇది అర్మగిద్దోను అనే యుద్ధముతో ముగుస్తుంది. యేసుక్రీస్తు తిరిగి వచ్చి, అంత్యక్రీస్తును మరియు దాని సైన్యమును ఓడించి, వాటిని అగ్ని గుండములో పారవేస్తాడు (ప్రకటన 19:11-21). అప్పుడు క్రీస్తు సాతానును వెయ్యి సంవత్సరముల పాటు అగాధములో బంధిస్తాడు మరియు ఈ వేయి సంవత్సర కాలములో ఈ భౌగోళిక రాజ్యమును ఆయనే యేలుతాడు (ప్రకటన 20:1-6).

వేయి సంవత్సరముల ముగింపులో, సాతాను విడిచిపెట్టబడి మరలా ఓడించబడుతుంది, ఆ తరువాత నిత్యత్వము కొరకు అగ్ని గుండములో పడవేయబడుతుంది (ప్రకటన20:7-10). ఆ తరువాత గొప్ప ధవళ వర్ణ సింహాసన తీర్పులో క్రీస్తు సమస్త అవిశ్వాసులను తీర్పు తీరుస్తాడు (ప్రకటన 20:10-15), మరియు అందరిని ఆ అగ్నిగుండములో పడవేస్తాడు. ఆ తరువాత క్రీస్తు ఒక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మరియు నూతన యెరూషలేమును తీసుకువస్తాడు – ఇది విశ్వాసులందరికీ నిత్యమూ నివసించే నివాస స్థలము. అక్కడ పాపముగాని, వేదనగాని, మరణముగాని ఉండవు (ప్రకటన 21-22).

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
కడవరి కాలముల యొక్క ప్రవచన ప్రకారం ఏమి జరుగబోతుంది?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి