క్రైస్తవుడు కల భాష్యం చెప్పడము? కలలు దేవుని దగ్గరనుండి వచ్చినవా?ప్రశ్న: క్రైస్తవుడు కల భాష్యం చెప్పడము? కలలు దేవుని దగ్గరనుండి వచ్చినవా?

జవాబు:
గాట్ క్వశ్చన్స్.ఆర్గ్ వారు క్రైస్తవులుగా కల భాష్యం చెప్పే వారు కాదు. మేము భాష్యం చెప్పము. మేము గట్టిగా నమ్మేదేంటంటే ఒక వ్యక్తి యొక్క కలలు మరియు వాటి అర్థముచెప్పటము అనేవి వారికి మరియు దేవునికి మాత్రమే సంభంధించినది. దేవుడు కలలద్వారా ఇంకను మాట్లాడుతాడా? దేవుడు తన ప్రజలతో అనేకమార్లు కలలద్వారా మాట్లాడినట్లు లేఖనభాగాలలో నున్నది. ఉధాహరణకు యోసేపు, యాకోబు కుమారుడు (ఆదికాండము 37:5-10); యోసేపు , మరియ భర్త (మత్తయి 2:12-22); సొలోమోను (1 రాజులు 3:5-15); మరియు ఇతర వ్యక్తులు(దానియేలు 2:1, 7:1; మత్తయి 27:19). యోవేలు ప్రవక్త ప్రవచించించిన ప్రవచనము ఉన్నది(యోవేలు 2:28), అపోస్తలుడైన పేతురు దానిని అపోస్తలుల కార్యములు 2:17లో ఉదహరించాడు,దేవుడు కలలను ఉపయోగించడము అనేది చెప్పబడిది. గనుక సులభమైన జవాబేటంటే, అవును, దేవుడు సమర్థుడు మరియు కలలద్వారా మాట్లాడగలడు.

ఏదిఏమైనా, మనము ఆసత్యాన్ని ఏవిధంగా ఈ దినాలలో అన్వయిస్తామో అనేదానిపై ఆధారపడి ఉన్నది. బైబిలు సమాప్తి చేయాబడినదని మనము మనస్సులో గుర్తుంచుకోవాలి, ఇప్పటినుండి మరియు అంతము వరకు మనము తెల్సుకోవల్సిన ప్రతిదానిని ప్రత్యక్షపరచాడు. దేవుడు అద్భుతములు చేయడని చెప్పడము కాదు లేక కలలు ద్వారా మట్లాడడని కాదు గాని దేవుడు ఏది చెప్పినాకూడా, అది ఒక వేళ కలయే అవ్వవచ్చు, దర్శనమే, లేక "అతి మెల్లని స్వరమే" కావచ్చు, ఆయన వాక్యములో దేనినైతే బయలుపరచాడో దానికి అనుగుణ్యంగా ఉంటుంది. కలలను లేఖనభాగాలమీద అధికారములు కల్గినవిగా ఎంచలేము.

ఒకవేళ నీకు కలవచ్చినట్లు మరియు అది దేవుడు ఇచ్చాడు అని నీవు భావిస్తే దేవుని వాక్యాన్ని పరీక్షించి ప్రార్థన పూర్వకంగా మరియు అది లేఖనభాగాలతో అనుగుణ్యంగా ఉం దో లేదో ఖచ్చితముగా చూడండి. లేనట్లయితే, ప్రార్థనాపూర్వకంగా మీ కలకు జవాబుగా దేవుడు ఏమిచేయదలచాడో అని దానిని ఆలోచించండి(యాకోబు 1:5). లేఖనములో, ఎప్పుడైనా, ఎవరైనా ఒక కలను దేవుని దగ్గరనుండి అనుభవించినట్లయితే, ఆ వ్యక్తికి సూటిగానైన, ఒక దూతద్వారానైనా, లేక ఒక వర్తమానికుని ద్వారానైనా ఆకలయొక్క అంతర్భావమును దేవుడు స్పష్తము చేస్తాడు(ఆదికాండము 40:5-11; దానియేలు 2:45, 4:19). దేవుడు మనతొ మాట్లాడునపుదు, ఆ వర్తమానమును మనకు స్పష్టముగా అర్థమయ్యేటట్లు ఖచ్చితముగా చూస్తాడు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


క్రైస్తవుడు కల భాష్యం చెప్పడము? కలలు దేవుని దగ్గరనుండి వచ్చినవా?