settings icon
share icon
ప్రశ్న

విడాకులు మరియు పునఃవివాహమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

జవాబు


మొదటిగా, విడాకులను గూర్చి ఒక వ్యక్తి ఎలాంటి ఆలోచన తీసుకున్నా, మలకీ 2:16ను జ్ఞాపకముంచుకొనుట చాలా ప్రాముఖ్యం: “భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” బైబిల్ ప్రకారం, వివాహం అనేది జీవితకాల సమర్పణ. “కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను” (మత్తయి 19:6). వివాహాలలో ఇద్దరు పాపపు మనుష్యులు పాలుపంచుకుంటారు కాబట్టి విడాకులు జరుగుతాయని దేవునికి తెలుసు. పాత నిబంధనలో, విడిపోయిన వారి యొక్క హక్కులను కాపాడుటకు, ముఖ్యంగా స్త్రీల కొరకు దేవుడు కొన్ని నియమాలు విధించాడు (ద్వితీ. 24:1-4). ఈ నియమాలు ప్రజల హృదయ కాఠిన్యము వలన ఇవ్వబడెనుగాని, అవి దేవుని కోరిక కాదని యేసు చెప్పాడు (మత్తయి 19:8).

బైబిల్ ప్రకారం విడాకులు మరియు పునఃవివాహం అనుమతించబడుతుందా లేదా అను వివాదం మత్తయి 5:32 మరియు 19:9లో యేసు పలికిన మాటల చుట్టూ ముఖ్యంగా ఆధారపడియుంది. ఆ వాక్యంలోని “వ్యభిచారకారణమునుబట్టి గాక” అను ఒక్క మాట మాత్రమే విడాకులు మరియు పునఃవివాహమునకు దేవుని యొక్క అనుమతి ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ “విశేషమైన మాటను” “ప్రథానం చేయబడిన” కాలంలోని “వ్యభిచార కారణము” కొరకు ఉపయోగించాలని కొందరు అనువాదకులు అర్థం చేసుకుంటారు. యూదా సంప్రదాయం ప్రకారం, స్త్రీ మరియు పురుషుడు ఒకరికొకరు “ప్రథానం చేయబడిన” సమయంలో కూడా వైవాహికులుగా పరిగణించబడేవారు. ఈ ఆలోచన ప్రకారం, “ప్రథానం చేయబడిన” కాలంలో చూపు అనైతికత మాత్రమే విడాకులకు ఒక తగిన కారణంగా ఉంది.

అయితే, “వ్యభిచారకారణమును బట్టి” అని అనువదించబడిన గ్రీకు పదం ఎలాంటి లైంగిక అక్రమ సంబంధములను సంబోధిస్తుంది. అది జారత్వము కావచ్చు, వ్యభిచార వృత్తి కావచ్చు, వ్యభిచారం, మొదలగునవి కావచ్చు. లైంగిక సంబంధాలు వైవాహిక బంధంలో ఒక ముఖ్యమైన భాగం: “వారిరువురు ఏకశరీరమగుదురు” (ఆది. 2:24; మత్తయి 19:5; ఎఫెసీ. 5:31). కాబట్టి, వివాహమునకు బయట లైంగిక సంబంధం ద్వారా ఏవిధంగా అయినా ఆ బంధమునకు భంగం కలిగించిన యెడల అది విడాకులకు కారణమవుతుంది. అలా అయినయెడల, ఈ లేఖన భాగంలో యేసుకు కూడా పునఃవివాహమును గూర్చి ఆలోచన ఉండియుంటుంది. “మరియొకతెను పెండ్లిచేసికొనువాడు” అను మాట కొన్ని విశేషమైన సందర్భాలలో విడాకులు మరియు పునఃవివాహముకు అనుమతి ఉన్నదని సూచిస్తుంది. కేవలం నేరము చేయని వ్యక్తి మాత్రమే వివాహమునకు అర్హులని గమనించుట అవసరం. ఇది లేఖనములో చెప్పబడనప్పటికీ, విడాకులు తరువాత పునఃవివాహం ఎవరికీ విరోధంగా పాపం చేయబడెనో వారి పట్ల మాత్రమే దేవుని కృప గాని, అక్రమ సంబంధం కలిగియున్నవానికి కాదు. “దోషము చేసిన వారు” పునఃవివాహం చేసుకున్న సందర్భాలు ఉన్నాయిగాని, అది లేఖనములో బోధించబడలేదు.

అవిశ్వాసియైన భార్య లేక భర్త విశ్వాసికి విడాకులు ఇచ్చినప్పుడు వారు పునఃవివాహం చేసుకొనుటకు 1 కొరింథీ. 7:15 అవకాశం ఇస్తుందని కొందరు అంటారు. అయితే, ఆక్కడి సందర్భం పునఃవివాహమును ప్రస్తావించదు, కాని ఒక అవిశ్వాసి విడిచి వెళ్లాలనుకుంటే విశ్వాసి ఆ వివాహంలో కొనసాగవలసిన అవసరం లేదని వాక్యం చెబుతుంది. హింస (భార్య, భర్త, లేక బిడ్డలను) అనునది విడాకులకు మరొక నాణ్యమైన కారణమని మరికొందరు అంటారుగాని, బైబిల్ లో అట్టి విషయం వ్రాయబడలేదు. ఇది సాధ్యముకావచ్చుగాని, దేవుని వాక్యమును గూర్చి ఊహించుకొనుట ఎన్నడు మంచిది కాదు.

“వైవాహిక అక్రమ సంబంధాలు” యొక్క అర్థం ఏమైనప్పటికీ, అది కేవలం విడాకులకు ఒక ఉపాయం మాత్రమే అని అవసరత కాదని ఈ వాదనలో పడి కొన్ని సార్లు మరచిపోతుంటాము. వ్యభిచారం చేయబడినప్పటికీ, దేవుని కృప ద్వారా దంపతులు క్షమించి వివాహమును పునఃనిర్మించవచ్చు. దేవుడు మనలను ఎన్నో విషయాల కొరకు క్షమించాడు. ఆయన ఉదాహరణను అనుసరిస్తూ వ్యభిచారం అను పాపమును కూడా క్షమించవచ్చు (ఎఫెసీ. 4:32). అయితే, కొన్ని సార్లు, ఒక భార్య లేక భర్త పశ్చాత్తాపం లేకుండా లైంగిక అక్రమ సంబంధాలలో కొనసాగుతుంటారు. అట్టి పరిస్థితిలో మత్తయి 19:9ను ఉపయోగించవచ్చు. చాలా మందిని దేవుడు ఒంటరిగా ఉండాలని ఆశించినప్పటికీ, విడాకుల తరువాత వెంటనే పునఃవివాహం చేసుకొనుటకు తొందరపడుతుంటారు. ప్రజల ధ్యాస మళ్ళకుండా ఉండుటకు దేవుడు కొన్ని సార్లు వారిని ఒంటరిగా ఉండుటకు పిలుస్తాడు (1 కొరింథీ. 7:32-35). కొన్ని సందర్భాలలో విడాకుల తరువాత పునఃవివాహం ఒక వికల్పం అయినప్పటికీ, అది మాత్రమే మార్గమని కాదు.

క్రైస్తవుల మధ్యలో విడాకుల యొక్క సంఖ్య అవిశ్వాస లోకంలో ఉన్నతగా ఉండుట చాలా బాధాకరమైన విషయం. దేవుడు విడాకులను ద్వేషిస్తాడని (మలాకీ 2:16) మరియు విశ్వాసి జీవితమునకు సమాధానం మరియు పశ్చాత్తాపం చిహ్నంగా ఉండాలని బైబిల్ స్పష్టముగా చెబుతుంది (లూకా 11:4; ఎఫెసీ. 4:32). అయితే, తన పిల్లల మధ్యలో కూడా విడాకులు జరుగుతాయని దేవుడు గుర్తిస్తున్నాడు. మత్తయి 19:9లో ఉన్న మినహాయింపులో మీ విడాకులు/లేక పునఃవివాహం లేనప్పటికీ, ఒక విడాకులు పొందిన/లేక పునఃవివాహం చేసుకున్న వ్యక్తి దేవుడు తమను తక్కువ ప్రేమిస్తాడని అనుకొనకూడదు. చాలా సార్లు దేవుడు అందరి మేలు కొరకు క్రైస్తవుల యొక్క పాపపు అవిధేయతను కూడా ఉపయోగించుకోగలడు.

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

విడాకులు మరియు పునఃవివాహమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries