ధర్మవ్యవస్థ (దైవవిధి)అంటే ఏంటి మరియు అది బైబిలు పరమైనదేనా?ప్రశ్న: ధర్మవ్యవస్థ (దైవవిధి)అంటే ఏంటి మరియు అది బైబిలు పరమైనదేనా?

జవాబు:
ధర్మవ్యవస్థ అనేది వేదాంత పరమైన పద్దతి , దానికి రెండు ప్రాధమికమైన లగుణాలు వున్నవి 1) యధేశ్చగా మాటకు మాటకు సరిగ్గవుండే లేఖనముల భాషాంతరము, ప్రత్యేకముగా బైబిలు ప్రవచనము. 2). ఇశ్రాయేలీయులకు మరియు దేవుని కార్యక్రమములో సంఘములోని భేధము.

ధర్మవ్యవస్థ తమదని వాదించేవారు వ్యాఖ్యానించుటకు తెలిపే శాస్త్రపు మూలసూత్రములు ఏంటంటే ఉన్నదున్నట్టుగా భాషాంతరము చెప్పుట, అంటే అనుదిన్య చర్యలో సమకాలీన భాషలో ప్రతి మాటకు అర్థంనివ్వడం. ప్రతీకలు, రూపకాలంకారములు మరియు చిహ్నాలు అన్నియు ఈ సమమైన పద్దతిలో భాష్యాంచెప్పటం, మరియు ఇది ఏ మాత్రంకూడా ఉన్నది ఉన్నట్టుగా భాషాంతరము చెప్పుటకు పరస్పరముకాదు. అయినా ఈ ప్రతీకలు మరియు రుపాకాలంకారముల వాటివెనుక నిజమైన అర్థములంటాయని చెప్తున్నవి.

లేఖనములు అధ్యయనము చేయుటకు ఈ పద్దతే ఎందుకు మంచిదో చెప్పటానికి కనీసము మూడు కారణాలున్నాయి. మొదటిది, తత్వశాస్త్రంగా, భాషయొక్క ఉద్డేశ్యమే దానికదే కోరుకొనేది ఉన్నది ఉన్నట్టుగా భాష్యంచెప్పాలని. భాషను దేవుడే ఇచ్చాడు దాని ఉద్దేశ్యము మానవులు ఒకనితో ఒకడు సంభాషించుకొనుటకు సామర్ధ్యతకలది. రెమ్డవది, బైబిలుపరమైనది. పాతనిబంధనలో యేసుక్రీస్తును గూర్చిన ప్రతీ ప్రవచనములన్నియు ఉన్నదునట్టుగా నెరవేర్చబడినవి. యేసు పుట్టుక, యేసు సేవ, యేసు మరణము మరియు యేసు పునరుత్ధానములు ఖచ్చితముగా మరియు పాతనిబంధనలో ముందుగా చెప్పినట్లు అన్నియు శుద్దముగా కనపర్చబడినవి. నూతననిబంధనలో ఈ ప్రవచనములకు లేనివి ఉన్నట్లుగా నెరవేర్చబడలేదు. ఉన్నదునట్టుగా భాష్యంచెప్పే పద్దతికి ఇది బలీయమైన వాదనవుతుంది. ఒకవేల ఉన్నదునట్టుగా భాష్యంచెప్పే ఈ పద్దతి లేఖనములు అధ్యయనము చేయుటలొ ఉపయోగించ లేనట్లయితే, మనము బైబిలును అర్థంచేసుకొనుటకు అక్కడ విశేషమైన ప్రమాణములుండవు. ప్రతి ఒక్కవ్యక్తి తనకుతానే బైబిలును భాష్యంచెప్పటానికి సామర్థ్యత కలిగినవారుగాఎంచుకోవచ్చు. బైబిలు భాష్యంచెప్పేటప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకొంటూ అర్థాన్ని వెలికితీయవచ్చు "ఈ పాఠ్యభాగము నాకు ఏమి చెప్తుంది..." అనే దానికిబదులు " బైబిలు ఈవిధంగా చెప్తుంది..." విచారకరమైనది, ఈ దినాలలో బైబిలుపరంగా భాష్యంచెప్పటం అనే నామకరణముక్రింద ఎక్కువశాతం జరుగుతూనే ఉన్నది.

ధర్మవ్యవస్థ వేదాంతాన్ని భోధించేవారు రెండురకముల భిన్నమైన దేవుని ప్రజలు: ఇశ్రాయేలీయులు మరియు సంఘము. ధర్మవ్యవస్థను నమ్మేవారు రక్షణెప్పుడు విశ్వాసమువలనే- పాతనిబంధనలోనున్న దేవునివలనే మరియు ప్రత్యేకముగ నూతన నిబంధనలోనున్న కుమారుడైన దేవునియందు విశ్వాసముంచుటవలన. ధర్మవ్యవస్థాపకులు దేవుని ప్రణాలికలో, సంఘము ఇశ్రాయేలీయులను భర్తీ చేయుటకు ఇవ్వబడిందికాదు మరియు ఇశ్రాయేలీయులకు చేయబడిన పాతనిబందనలోని వాగ్ధానములు సంఘమునకు అంతరణ చేయలేదు. వారు నమ్మేది దేవుడు ఇశ్ర్హాయేలీయులకు వాగ్ధానములు ఇవ్వబడినవి ( భూభాగము, ఎక్కువ సంతానము విషయములలో మరియు ఆశీర్వాదములు)తుదకు పాతనిబందనలోనివన్ని 1000- సంవత్సరము వ్యవధిలోనే ప్రకటన 20 వ అధ్యాయములో చెప్పినరీతిగా నెరవేర్చబడినవి. ధర్మవ్యవస్థను నమ్మేవారు దేవుడు ఈ ప్రస్తుతకాలములో సంఘముపైన తన కనుదృష్ఠియుంచాడు, మరల భవిష్యత్తులో ఇశ్రాయేలీయులపైన తన కనుదృష్ఠినుంచుతాడు (రోమా 9-11).

ఈ పద్దతిని ఆధారము చేసుకొని, ధర్మవ్యవస్థను నమ్మేవారు బైబిలు అర్థంగ్రహించి దీనిని ఏడు ధర్మవ్యవస్థలుగా క్రమబద్దీకరించవచ్చు అని అన్నారు: నిర్ధోషత్వము (ఆదికాండం 1:1–3:7), మనసాక్షి (ఆదికాండం 3:8–8:22), మానవ పరిపాలన (ఆదికాండం 9:1–11:32), వాగ్ధానము (ఆదికాండం 12:1–నిర్గమకాండం 19:25), న్యాయము (నిర్గమకాండం 20:1–అపోస్తలుల కార్యములు 2:4), కృప (అపోస్తలుల కార్యములు 2:4–ప్రకటన 20:3),మరియు వెయ్యేండ్ల రాజ్యపరిపాలన (ప్రకటన 20:4-6). మరల, ఈ ధర్మవ్యవస్థలన్నియు రక్షణకు మార్గాలు కావు, గాని మానవుడు దేవునితో సంభంధం కలిగియుండుటకు రీతులు మాత్రమే. ధర్మవ్యవస్థ అనేది ఒక వ్యవస్థ, క్రీస్తు రెండవ సారి వచ్చేటప్పుడు పూర్వ వెయ్యేండ్ల రాజ్యపరిపాలన గురించి భాష్యం చెప్పుటకు మరియు సామన్యముగ ఎత్తబడుటకు ముందు జరుగబోయే పూర్వపు శ్రమలకాలము గురించి భాష్యం చెప్పుటకు కారణమాయెను. దీనిని సమీక్షించినట్లయితే, ధర్మవ్యవస్థ అనేది ఒక వేదాంత విషయమైన పద్దతి. ప్రవచనములను ఉన్నదునట్టుగా భాష్యం చెప్పుటం గురించి ఉద్ఘాటిస్తుంది, ఇశ్రాయేలీయులకు మరియు సంఘము మధ్య స్పష్ఠమైన తారతమ్యాన్ని గుతిస్తుంది, మరియు బైబిలును వేరైన ధర్మవ్యవస్థ పద్డతిలో అగుపరస్తుంది.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


ధర్మవ్యవస్థ (దైవవిధి)అంటే ఏంటి మరియు అది బైబిలు పరమైనదేనా?