క్రైస్తవులు తమ పిల్లలను ఏవిధంగా క్రమబద్దీకరించవలెను? బైబిలు ఏమని చెప్తుంది?ప్రశ్న: క్రైస్తవులు తమ పిల్లలను ఏవిధంగా క్రమబద్దీకరించవలెను? బైబిలు ఏమని చెప్తుంది?

జవాబు:
ఎంత మంచిగా తమ పిల్లలను క్రమబద్దీకరించట అనేది మనము అతి కష్టముగా నేర్చుకొనవల్సిన గురి, గాని అది క్లిష్టమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. కొంతమంది చెప్పుకుంటారు శారీరక క్రమశిక్షణ (సామూహిక శిక్ష) అంటే కొట్టడం అనేది ఈ ఒక్క పద్దతిని మాత్రమే బైబిలు సహకరిస్తుంది. మరికొందరు అంటే "కాలము- మించడం" మరియు ఇతర శిక్షలు అవి అన్నియు శారీరక క్రమశిక్షణలో పాల్గొనవు గాని అవి ఇంకను చాల ప్రభావితంగా పనిచేస్తాయి. బైబిలు ఏమని చెప్తుంది?బైబిలు భోధిస్తుంది, మరి శారీరక క్రమశిక్షణ అనేది చాలా అనుగుణమైనది, ఫలవంతమైనది మరియు అత్యవసరమైనది.

తప్పుగా అర్థం చేసుకోవద్దు- మనము ఏవిధంగానైనా పిల్లలను దూషించటం అనేది ప్రోత్సాహించము. ఏ బిడ్డను కూడ శారీరకంగా తనకు గాయము తగిలేటంతవరకు శారీరకంగా క్రమబద్దీకరించటం మంచిది కాదు. బైబిలు ప్రకారము, అయినా, తగినది మరియు అణచినట్టు పిల్లలను శారీరకంగా క్రమబద్దీకరించుట అది మంచి విషయము మరియు ఆ బిడ్డను సరియైన రీతిలో పెంచుటకు మరియు తన శ్రేయస్సుకొరకు తోడ్పడేదిగా వుంది.

చాలా లేఖనభాగాలు ఈ శారీరక క్రమశిక్షణను గురించి ఖచ్చితముగా చెప్తుంది. "నీ బాలురను శిక్షించుట మాను కొనకుము. బెత్తముతో వాని కొట్టినయెడల వాదు చావకుండును. బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను తప్పించెదవు" (సామెతలు 23:13-14; మరియు వీటిని చూడండి 13:24; 22:15; 20:30). బైబిలు క్రమశిక్షణను గురించి చాలా దృఢంగా నొక్కి వక్కాణిస్తూ ప్రాముఖ్యతను చెప్తుంది; మనకు సామాన్యముగా అందరికి కావాల్సింది ఉత్పాదకమైన ప్రజలు కావడానికి, మరియు వారు చిన్నపిల్లలుగానున్నప్పుడే వారు అతి త్వరగా నేర్చుకుంటారు. పిల్లలు ఎవరైతే క్రమశిక్షణలో పెరగరో వారు తిరుగుబాటుదారులు అవుతారు, అధికారము చేసేవారికి గౌరవమునివ్వరు, దాని కారణంగా దేవునికి ఇష్టపూర్వకంగా విధేయతచూపించుటకు మరియు వెంబడించుటకు అతికష్టముగా భావిస్తారు. దేవుడు తనకుతాను క్రమశిక్షణను మనలను సరిచేయుటకు మరియు సరియైన మార్గములో మనలను నడిపించుటకును మరియు మనలను మన తప్పు క్రియలనుండి మార్పుపొందుటకు ప్రోత్సాహించును (కీర్తనలు 94:12; సామెతలు 1:7; 6:23; 12:1; 13:1; 15:5; యెషయా 38:16; హెబ్రీయులకు 12:9).

క్రమశిక్షణను సరిగ్గా అన్వయించుటకు గాను మరియు బైబిలు సూత్రాల ప్రకారము, తలిదండ్రులు క్రమశిక్షణను గూర్చిన లేఖనములలోని సలహాలతో బాగుగా అలవాటుపడినవారైయుండాలి. సామెతల పుస్తకములో అనేకమైన ఙ్ఞానమును గూర్చిన భాగాలు, ఏవిధంగా పిల్లలను పెంచవలెనో, అంటే, “బెత్తమును గద్దింపును ఙ్ఞానమును కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును (సామెతలు 29:15). ఈ వచనపు వెల్లుపలిభాగము తమ బిడ్డను క్రమశిక్షణలో పెట్టనట్లయితే దాని పర్యవసానాన్ని తెలియపరుస్తుంది- తలిదండ్రులకు అవమానము తెచ్చును. అయినా, క్రమశిక్షణ అనేదానికి ఒక గురి బిడ్డకను మంచి దిశవైపుకు నడిపించేదిగా నుండాలి మరియు అది ఎన్నడూ ఆబిడ్డను దూషణను మరియు తప్పుగా పిల్లలతో వ్యవహరించడం అనేదానిని సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు. అది ఎన్నడూ కోపాన్ని లేక అసహనాన్ని బయటకు కనుపర్చుటకు ఉపయోగించకూడదు.

క్రమశిక్షణ అనేది ఖండించుటకు మరియు ప్రజలకు మంచి మార్గమును భోధించుటకు ఉపయోగించబడినది. "మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దు:ఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” (హెబ్రీయులకు 12:11). దేవుని క్రమశిక్షణ ప్రేమగలిగినది, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్యనున్నట్లు. శారీరక క్రమశిక్షణ ఎన్నడూ శాశ్వతమైన భాధను లేక హానిని కలిగించుటకు కారణముకాకూడదు. శారీరక శిక్ష తక్షణమే ఎన్నడూ వారిని ఆదరణమాటల్తో నిశ్చయతను కనుపరుస్తూ అతడు/ ఆమె ఆపిల్లల పట్ల ప్రేమను కనుపరచేదిగా వుండాలి. ఇలాంటి క్షణాలు ఎప్పటికిని మంచి పిల్లలకు భోధించటానికి తగిన పరిపూర్ణసమయముగా ఎంచుకొని దేవుడు మనలను క్రమపరిస్తున్నడు ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి, అలానే తల్లిదండ్రులు, మనము మన పిల్లలకును అలానే చేయవలెను.

మరి ఇతర రకాల క్రమశిక్షణా క్రియలు , అంటే "కాల- పరిమితిమించి," అట్లాంటివి శారీరక క్రమశిక్షణకు బదులు వాడవచ్చునా? కొంతమంది తల్లిడండ్రులు వారి పిల్లలు శారీరక క్రమశిక్షణకు సరిగ్గా ప్రతిస్పందించరని వారు కనుగొన్నారు. మరికొంతమంది "కాల- పరిమితిమించి," నీచానికి పాల్పడుతూ, మరియు/ లేక వారి ప్రవర్తనాసరళిని మార్చేటటువంటి ఫలవంతమైన వాటిని పిల్లలనుండి తీసివేయడం మొదలగునవి చేస్తారు. ఒకవేళ అదే అవసరమైనట్లయితే , ఎట్లానైనా, ఒక తండ్రి వారి ప్రవర్తనాసరళిని ఫలభరితముగా మార్చడానికి కొన్ని శ్రేష్టమైన పద్దతులను తలిదండ్రులు అలవర్చుకోవాలి. బైబిలు తిరస్కరించలేని విధంగా శారీరక క్రమశిక్షణను సమర్థించినప్పటికి, బైబిలు ప్రాముఖ్యముగా ఈ దేవుని స్వభావాన్ని నిర్మించడానికి గురికలిగియుంటూ దానికంటే అది గురియొక్క అంతిమ ప్రతిఫలాన్ని పొందుకొనుటకు ఖచ్చితమైన పద్దతి కలిగియుండుట పట్ల శ్రద్ధ కలిగియుండవలెను.

ఈ విషయాన్ని మరింతగా భాధాకరము చేయటానికిగాను గవర్నమెంట్ ఇంకా ఈ శారీరక క్రమశిక్షణను పిల్లలను దూషించటం క్రింద వారు రకరకాల జాబితాలలోనికి తీసుకొనివచ్చి వాటిని విభజించుట విశేషమైనది. చాలమంది తలిదండ్రులు వారి పిల్లలను గవర్నమెంట్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారని మరియు గవర్నమెంట్ ఆపిల్లలను తలిదండ్రులకు నుండి తీసుకువెళ్లిపోతారని భయముతో వారు ఎన్నదూ పిల్లలను కొట్టరు. గవర్నమెంట్ పిల్లలకు శారీరక క్రమశిక్షణ విధించడం అనేది వారు శాస్త్రవిరుద్ధముగా చేసినపుడు తల్లిదండ్రులు ఏమిచేయవలెను? రోమా 13:1-7 ప్రకారము తల్లిదండ్రులు గవర్నమెంటుకు లోబడివుండాలి. గవర్నమెంట్ ఎన్నడూ దేవుని వాక్యాన్ని మరియు శారీరక క్రమశిక్షణను విభేధించేదిగాను నుండకూడదు. అయితే అది పిల్ల అభీష్టమునుబట్టి బైబిలు వివరిస్తున్నదానిబట్టినుండవలెను. ఏదిఏమైనా,పిల్లలను గవర్నమెంట్ వారి "శ్రద్దలో" వుంచుటకు మొత్తానికి వదలుకొనుటకంటే కుటుంబములోనుంచి వారు కనీసము క్రమశిక్షణను నేర్చుకొనేవారుగా తీర్చిదిద్దుట మంచిది.

ఎఫెసీయులకు 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి, దానికిబదులు, వారిని దేవుని మార్గములలోనికి తిసుకొనరాబద్దులమైయున్నాము. పిల్లలను పెంచుటలో "ప్రభువుయొక్క శిక్షలోను భోధలోను" దానితోపాటు అణచిపెట్టడం, సంస్కరిస్తూ, మరియు , అవును, ప్రేమతో శారిరక క్రమశిక్షణలో పెంచుడి.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


క్రైస్తవులు తమ పిల్లలను ఏవిధంగా క్రమబద్దీకరించవలెను? బైబిలు ఏమని చెప్తుంది?