settings icon
share icon
ప్రశ్న

పరిశుద్ధ గ్రంధము దయ్యము పీడించుటను గూర్చి/ దయ్యములచే పీడింపబడుటను గూర్చి ఏమి చెప్తుంది?

జవాబు


కొంత మంది ప్రజలు దయ్యములచే పీడింపబడినవారి లేదా వాటిచే ప్రభావితము చేయబడినవారి ఉదాహరణలు పరిశుద్ధ గ్రంధము కొన్ని ఇస్తుంది. ఇవే ఉదాహరణల నుండి దయ్యముల యొక్క ప్రభావమును గూర్చి మనము కొన్ని అంతర్దృష్టులను పొంది దయ్యము ఒకరిని ఏ విధంగా పీడిస్తుంది అనే విషయమును గూర్చి తెలుసుకొనవచ్చు. ఇక్కడ కొన్ని లేఖనముల భాగములను చూడగలం: మత్తయి 9:32-33; 12:22; 17:18; మార్కు 5:1-20; 7:26-30; లూకా 4:33-36; 22:3; అపొ.కా. 16:16-18. ఇక్కడ ఇవ్వబడిన వాక్యభాగములలో కొన్నిటిలో, దయ్యము పీడించుట అనేది మాట్లాడకుండా చేయుట, మూర్చ వ్యాధి లక్షణములు, గ్రుడ్డితనము మొదలగు భౌతికమైన కొన్ని లక్షణమునలు కలిగిస్తుంది. ఇతర సంఘటనలలో, సదరు వ్యక్తి కొంత దుర్మార్గతను చేయునట్లు చేస్తుంది, దీనికి యూదా ప్రధాన ఉదాహరణ. అపొస్తలుల కార్యములు 16:16-18లో, ఆ ఆత్మ ఇక్కడ ఉన్న ఇవే బానిస బాలికకు తన తెలివికి మించిన కొన్ని విషయములను తెలుసుకొనులాగున చేస్తుంది.గెరాసేనుల ప్రాంతములో దయ్యము పట్టిన వాడు, అనేక దయ్యములు (సేనా) పట్టినవాడు, మానవాతీతమైన బలమును కలిగియుండి సమాధుల మధ్య దిగంబరుడుగా జీవించాడు. రాజైన సౌలు, యెహోవాకు వ్యతిరేకంగా పాపము చేసిన తరువాత, అపవిత్రాత్మ చేత పీడింపబడ్డాడు (1 సమూయేలు 16:14-15; 18:10-11; 19:9-10), దీని ద్వారా స్పష్టంగా ఆయన మిగుల నిరాశ చెంది దావీదును చంపాలనే తన కోరికను అధికం చేసుకున్నాడు.

ఈ విధంగా, దయ్యముచేత పీడించబడుట అనుదానికిచాలా లక్షణములే ఉన్నాయి, అంటే సాధారణ మానసిక సమస్యగా పరిగణించలేని ఒక భౌతికపరమైన బలహీనత, నిస్పృహ లేదా క్రూరత్వము వంటి వ్యక్తిత్వపు మార్పులు, అసహజమైన శక్తి, సిగ్గు తెలియక ఉండటం, సమాజ వ్యతిరేక ప్రవర్తన, మరియు సాధారణంగా ఒకరు తెలుసుకొనలేని సమాచారమును తెలియజేసే సామర్ధ్యత కలిగి ఉండటం అనునవి. ఈ లక్షణములలో అధిక లక్షణములు, అంటే అన్ని లక్షణములు కాకపోయినా, ఇతర వివరణలు కలిగి కూడా ఉండవచ్చు, కాబట్టి నిస్పృహలో ఉన్న ప్రతి వ్యక్తిని లేదా మూర్ఛ వ్యాధి ఉన్న వ్యక్తిని దయ్యము పట్టినవాడిగా పరిగణించకూడదు. మరొక విధంగా, ప్రజల జీతివములలో సాతాను యొక్క పాత్రను పాశ్చాత్త దేశములు అంత తీవ్రముగా పరిగణించవు.

భౌతికమైన మరియు మానసికమైన ఈ తేడాలతో పాటు, దయ్యము యొక్క ప్రభావమును సూచించే ఆత్మ సంబంధమైన లక్షణములను కూడా కొన్నిటిని చూడగలం. అవి క్షమించలేకుండా ఉండటం (2 కొరింథీ. 2:10-11) అబద్ధ సిద్ధాంతమును నమ్మడం మరియు దానిని ప్రకటించడం, ప్రత్యేకంగా యేసుక్రీస్తును గూర్చి మరియు ఆయన యొక్క పాప పరిహార క్రియను గూర్చి (2 కొరింథీ. 11:3-4, 13-15; 1 తిమోతి 4:1-5; 1 యోహాను 4:1-3).

క్రైస్తవుల జీవితములలో దయ్యముల పాత్రను గురించి మాట్లాడితే, విశ్వాసి కూడా దయ్యముచే ప్రభావితము చేయబడగలడు అనుటకు అపొస్తలుడైన పేతురే ఒక ఉదాహరణ (మత్తయి 16:23). బలమైన దయ్యపు ప్రభావము క్రింద ఉన్న క్రైస్తవులను కొందరు “దయ్యము పట్టినవాడు”గా పరిగణిస్తారు కాని, క్రీస్తు నందు విశ్వాసముంచు వారు దయ్యముచే పీడింపబడినట్లు లేఖనములలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. పరిశుద్ధ ఆత్మ తనలో నిలిచి ఉంటాడు గనుక (2 కొరింథీ. 1:22; 5:5; 1 కొరింథీ. 6:19), మరియు దేవుని యొక్క ఆత్మ దయ్యముతో తన నివాసమును పంచుకొనలేడు గనుక క్రైస్తవుడు దయ్యముచే పీడింపబడలేడు అని చాలా మంది వేదాంత శాస్త్రజ్ఞులు అంటుంటారు.

ఒకడు పీడింపబడుటకు తననుతాను ఎలా తెరుచుకుంటాడో మనకు చెప్పబడలేదు. ఒకవేళ యూదా యొక్క జీవితాన్ని మచ్చుకగా తీసుకుంటే, తన హృదయమును దుష్టత్వమునకు ఆయన తెరచాడు – తన విషయంలో దురాశ చేత (యోహాను12:6). అలవాటైన పాపము తన హృదయమును ఏలునట్లు ఒకరు అప్పగించుకున్నట్లయితే, అది దయ్యము వచ్చి నివసించులాగున చేసే ఆహ్వానముగా ఉండవచ్చు. సువార్తీకుల అనుభవాల ద్వారా, దయ్యముచే పీడింపబడుట అనేది అన్య దేవతలను ఆరాధించుట, మరియుక్షుద్ర ప్రయోగములు చేయుట వలన కూడా వస్తుంది అని తెలుస్తుంది. విగ్రహారాధను లేఖనములు దయ్యములను నిజముగా ఆరాధించుటతో పోల్చుతున్నాయి (లేవీయ. 17:7; ద్వితీయ. 32:17; కీర్తన. 106:32; 1 కొరింథీ. 10:20), కాబట్టి విగ్రహారాధనలో పాలుపొందితే దయ్యములచే పీడింపబడుటకు అనేక అవకాశములు ఉన్నాయనే విషయము మనకు ఆశ్చర్యం కలిగించ కూడదు.

పైన పేర్కొనబడిన లేఖనముల ఆధారంగా మరియు సువార్తీకుల కొన్ని అనుభవాల ఆధారంగా, కొంత పాపమును హత్తుకొనుట లేదా ఒకవిధమైన మత విషయములలో పాలుపొందుట (తెలిసి చేసినా తెలియక చేసినా) ద్వారా అనేకమంది ప్రజలు తమ జీవితములను దయ్యములచే పీడింపబడుటకు అనుమతిస్తారని మనం తెలుసుకోగలము. ఉదాహరణలు, అనైతికత, ఒకరి విచక్షణను నిర్వీర్యపరచే మాదక ద్రవ్యము/మత్తుపదార్ధ సేవనము, తిరుగుబాటు, అసూయ, మరియు సర్వోత్క్రుష్టమైన ధ్యానము.

మరొక అదనపు పరిశీలన ఇక్కడ ఉంది. సాతాను మరియు దాని సమూహము అంతయు కూడా ప్రభువు అనుమతించని దానిని చేయలేవు (యోబు 1-2). ఇట్లుండగా, సాతాను తన సొంత ఉద్దేశములను నెరవేర్చుకుంటున్నానని అనుకుంటూ, నిజానికి యూదా యేసును అప్పగించిన విషయములో జరిగినట్లుగా, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశములను నేరవేరుస్తాడు. క్షుద్ర ప్రయోగముల పట్లను మరియు దయ్యముల క్రియల పట్లను కొందరు తగని ఆకర్షణను పెంపొందించుకుంటారు. ఇది జ్ఞానరహితమైనది మరియు లేఖన విరుద్ధమైనది. మనము దేవుని వెదకిన యెడల, తన యుద్దోపకరణములను మనము ధరించుకొని తనశక్తిపై ఆధారపడితే (ఎఫెసీ. 6:10-18), దుష్ట ఆత్మల వలన మనము భయపడవలసిన అవసరం ఉండడు, ఎందుకంటే దేవుడే సమస్తముపై పరిపాలన చేస్తున్నాడు!

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

పరిశుద్ధ గ్రంధము దయ్యము పీడించుటను గూర్చి/ దయ్యములచే పీడింపబడుటను గూర్చి ఏమి చెప్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries