బైబిలులో అపోస్తలుల మరణమునుగురించి ఎక్కడైనా రాయబడిందా? ఒక్కొక్క అపోస్తలుడు ఏ విధంగా మరణించారు?ప్రశ్న: బైబిలులో అపోస్తలుల మరణమునుగురించి ఎక్కడైనా రాయబడిందా? ఒక్కొక్క అపోస్తలుడు ఏ విధంగా మరణించారు?

జవాబు:
కేవలము ఒకే ఒక్క అపోస్తలుని మరణము గురించి బైబిలులో రాయబడిన అది యాకోబు విషయము (అపోస్తులుల కార్యములు 12:2). రాజైన హేరోదు యాకోబును “ఖడ్గముతో చంపించెను,” ఇది సుమారుగా శిరచ్ఛేదము చేసినట్లు సూచిస్తుంది. ఇతర అపోస్తలుల మరణములు పరిస్థితులన్నియు సంఘ ఆచారములకు సంభంధించినది, గనుక మనము ఇతర వాటిని మనము లెక్కలోనికి తీసుకొని ఎక్కువ ప్రాధాన్యతతో పరిగణించకూడదు. చాలా సామాన్యముగా అంగీకరించగలిగే అపోస్తలుల మరణము విషయమై సంఘ ఆచారము ఏంటంటే అపోస్తలుడైన పేతురు రోమాలో నున్న ఆచారప్రకారము యేసు ప్రవచించినదానిని నెరవేర్చుటకై X- ఆకారములో తలక్రిందులుగా సిలువవేయబడెను (యోహాను 21:18). వ్యాప్తిలో ఉన్న ఇతర అపోస్తలుల మరణమునకు సంభంధించిన "ఆచారములు" క్రింద వివరించబడినవి:

మత్తయి ఇతియోపియాలో హతసాక్షిగా శ్రమపొందెను, ఖడ్గముచేత గాయముపొందినవాడై చంపబడెను. రోమాలో శ్రమలు పెడ్తున్న సమయములో ఒక పెద్ద బేసినులో మరుగుతున్న నూనెలొ యోహానును పడవేయుటవలన ప్రాణ సమర్పణం చేయుటకు సంసిధ్ధుడయ్యెను. ఏదిఏమైనా, ఆయన మరణమునుండి అధ్భుతముగా తప్పించబడెను. యోహాను తరువాత పత్మాసు ద్విపములోని చీకటి ఘనులలోనికి చెరగా భంధించుటకై శిక్షాస్థలము ఉత్తరువు చేసెను. ఆక్కడే పత్మాసు ద్వీపములోనే తన ప్రవచనాగ్రంధమైనా ప్రకటన గ్రంధమును రాసెను. అపోస్తలుడైన యోహాను తరువాత స్వతంత్రుడై మరియు ఈ దినాలలో నూతన ప్రదేశముగా పిలువబడే టర్కీకి తిరిగివచ్చెను. ఒక వృద్ధుడుగా మరణించెను, కేవలము అతి విశ్రాంతిగా మరణించిన అపోస్తలుడు ఇతడే.

యాకోబు, యేసుక్రీస్తు సహోదరుడు (ఆధికారికంగా అపోస్తలుడు కాదు), యెరూషలేములోని ఒక సంఘములోని పెద్దగా నున్నడు. ఆయన మందిరముయొక్క ఆగ్నేయ దిక్కు గోపుర శిఖరము నుండి పడద్రోయబడెను (పైనుండి వంద అడుగుల లోతులలో) క్రీస్తులోనున్న విశ్వాసమును కాదని ఒప్పుకొనుటలో ధిక్కరించనందుకు. ఆరితిగా పడిన తరువాత అతడు సజీవుడుగా నుండుట వారు కనుగొన్నారు, అప్పుడు అతని శత్రువులు లాఠీ కర్రతో అతడు మరణించేవరకు కొట్టెను. సాతాను యేసును శోధించినపుడు ఈ గోపుర శిఖరము దగ్గరకే సాతాను యేసును తీసుకొని వెళ్ళి అతనిని శోధించెనను ఒక ఆలోచన.

బర్తలోమయి, మరియు నతానియేలు అని పిలువబడే, ఈయన ఆసీయాభాగమునకు ఒక్క ప్రేషితుడుగా నుండెను.ఈ ప్రస్తుత దినాలలోనున్న టర్కీని సాక్షిగానున్నాడు మరియు ఆర్మేనియాలో ప్రసంగిస్తున్నప్పుడు హతసాక్షిగానుండెను, ఒక కొరడాతో కొట్టగా అతని చర్మము ఒలిచినంతగా మరణించెను. అంద్రెయ గ్రీసులో X ఆకారములోనున్న సిలువపై సిలువవేయబడెను. ఏడుగురు యుద్ద సైనికులు కొరడాలతో భయంకరంగా కొట్టిన తరువాత, అతని భాధను పొడిగించుతకు తోలుతో తన శరీరమును సిలువకు కట్టివేసెను. అతడు సిలువ దగ్గరకు తీసుకొని పోబడినాడని తన అనుచరులు తెలిసికొని సమాచారమందించగా, అంద్రెయ ఈ మాటలతో వారికి నమస్కారము చేసెను: “ఈ సంతోషకరమైన గడియకొరకు ఎంతో అభీష్టముతో మరియు వేచిచూసాను. సిలువపై క్రీస్తు యొక్క శరీరము వ్రేలాడదీయబడటువలన అది ఎంతో ప్రతిష్ట చేయబడినది.” ఇంకా రెండు దినములకు చనిపోయేంతవరకు తన్ను భాధించినవారికి ప్రసంగించుటను కొనసాగించెను. అపోస్తలుడైన తోమా ఒక మిషనరీ ప్రయాణములో సంఘమును స్థాపించుటకు భారత దేశమునకు వెళ్ళిన సమయములో అతనిని కత్తిచే పొడిచి చంపెను. మత్తయి, అనే అపోస్తలుడు విశ్వాసఘాతుకుడైన యూదా ఇస్కరియోతుకు బదులుగా అపొస్తలుడుగా ఎన్నుకొనబడెను, అతడు రాళ్ళతో కొట్టబడి మరియు శిరచ్చేధనము చేయబడెను. క్రీ.శ. 67 లో రోమాలో నీరో చక్రవర్తి పరిప్లానలో అపోస్తలుడైన పౌలును హింసపెట్టి తరువాత శిరచ్చేధనము చేసెను. ఇతర అపోస్తలుల విషయమై అనేక ఆచారములును వున్నవి, గాని వాటికి ఎటువంటి చరిత్రపూర్వకమైన మరియు ఆచారపరమైన ఆధారములు ఏమిలేవు.

అపోస్తలులు ఏవిధంగా మరణించారనేది అంత ప్రాముఖ్యము కాదు. ప్రాధాన్యముగా గుర్తించవల్సిన వాస్తవమేంటంటే వారు వారి విశ్వాసముకొరకై స్వచిత్తముగా మరణించుటకు సంసిధ్ధపడటం. ఒకవేళ యేసుక్రీస్తు పునరుత్ధానుడవకుండా వుండినట్లయితే, శిష్యులకు ఆ సంగతిని ఎరిగియుండే వారు కాదు. అబద్దమని నమ్మిన దానికొరకు ఏ ప్రజలుకూడా మరణించటానికి ఇష్టపడరు. వాస్తవానికి అపోస్తలులందరు అతి దారుణమైన భయంకర రీతిలో మరణించుటకు సంసిధ్ధులై, క్రిస్తులోనున్న విశ్వాసమును పరిత్యజించుటకు తిరస్కరించారు, పునరుత్ధానుడైన యేసుక్రీస్తుకు నిజ సాక్షులుగా సత్యానికి నిలిచారనుటకు ఇది బ్రహ్మాండమైన ఋజువుగా ఇప్పటికి చరిత్రపుటలో నున్నది.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


బైబిలులో అపోస్తలుల మరణమునుగురించి ఎక్కడైనా రాయబడిందా? ఒక్కొక్క అపోస్తలుడు ఏ విధంగా మరణించారు?